శివ శక్తి - vishwagurunidhi


శివ శక్తి 

 ఒక వ్యక్తి దృఢ సంకల్పంతో, ఎలాంటి సంశయం లేకుండా ధ్యానించినట్లయితే ఇక ఆ ఆరాధనకు తిరుగులేదు. అదే తపస్సు. అలా  కఠోర దీక్షలో నిమగ్నమైనప్పుడు అద్భుత వలయాకార చక్రం ఏర్పడుతుంది. ఏకాగ్ర చిత్తంతో తపస్సు చేసినప్పుడు మెదడులో పీనియల్  గ్రంథి నుండి అపురూపమైన, మహాద్భుతమైన దివ్య కిరణాలు ప్రసరిస్తాయి. ఈ కిరణాలు విశ్వంలో తిరుగుతున్న విద్యుదయస్కాంత  శక్తిని కదిలించి వేస్తుంది. ఆ కిరణాలు మేఘాలను మించి అంతరిక్షం లోనికి దూసుకువెళ్ళి విశ్వశక్తుల వైపు దూసుకుపోతుంది.


ఆ దీక్ష, ధ్యానంతో, వారి నుదుటి నుండి మహోజ్జ్వలమైన కాంతి కిరణాలు వెలువడి, అవి అంతే ప్రకాశవంతంగా, మనోహరంగా ప్రసరిస్తాయి. ఈ చరాచర సృష్టిలోని లోకాలన్నింటినీ పట్టి ఉంచుతున్న మహా విశ్వశక్తి గురుత్వాకర్షణ  అలాంటి శక్తిని  మహర్షులు తపస్సుతో సాధించే శక్తి! అదే శివ శక్తి! ఈ తపశ్శక్తితో విశ్వంలోని విద్యుదయస్కాంత శక్తులు సైతం కల్లోలమౌతాయి.


భూమి గురుత్వాకర్షణ కన్నా కొన్ని లక్షల కోట్ల రెట్లు ఎక్కువగా, అత్యంత వేగంగా ఎంతటి వస్తువులనైనా తనకేసి లాక్కొనే గురుత్వ మహాశక్తి రోదసిలో అనంతం. దీనికి నిలయంగా వివిధ గ్రహాలు, ఉపగ్రహాలు, గ్రహ శకలాలు, నక్షత్రాలు, తారా మండలాలు, రాశి కూటాలు, పిల్ల విశ్వాలు వంటి మహాద్రవ్యరాశితో కూడిన ఖగోళ వస్తువులు జగత్తులో మన లెక్కలకు అందవు. పరమాణు నక్షత్రాలు, నవ్యోజ్వల తారలు, కాలబిలాలు కాంతిని సైతం తమలోకి లాగేసుకుంటాయి. నక్షత్రాలు మృతస్థితికి చేరుకొన్న దశలో కాల బిలాలుగా పరిణామం చెందుతాయి. అటువంటి రెండు (జంట) భారీ కాలబిలాలు కలగలిసిపోయి ఒక మహా కాల బిలంగా మారే సందర్భాలు కోకొల్లలు. ఆ జంట కాలబిలాల మహా సంఘర్షణనే గురుత్వ తరంగాలు! ఇవే శివ శక్తి తరంగాలు!


సూర్యుని చుట్టూ తిరిగే భూమి, చంద్రుడు,  కుజుడు,  బుధుడు,  గురుడు,  శుక్రుడు,  శనికి, భూమి ఛాయా గ్రహాలైన  రాహువు  కేతు గ్రహాల నుంచి వివిధ దిశలలో కిరణాలు ప్రసరిస్తాయి. కిరణాల కోణాలు ప్రతి నిమిషానికి మారుతూ ఉంటాయి. ఇటు పైన సౌలభ్యం కొరకు “కాంతి” అంటే విద్యుదయస్కాంత వికిరణం  అని అన్వయించుకుందాం. కంటికి కనబడే కాంతికి “వెలుగు” అని పేరు పెడదాం. పదార్ధాలన్నీ కాంతిని ఇంతో, కొంతో పీల్చుకుంటాయి. కొన్ని కొన్ని పదార్ధాలు గామా నుండి రేడియో వరకూ ఉన్న ఏడు  రకాల కాంతులలో కొన్నింటిని ఎక్కువగా పీల్చుకుంటాయి.


కంటికి కనిపించే కాంతి పట్టాలోనే ఇంద్ర ధనుస్సులోని సప్త వర్ణాలు ఇమిడి ఉన్నాయి, .సూర్యుడు ఎక్కువగా “కళ్లకి కనిపించే కాంతి కిరణాలు” విరజిమ్ముతాడు. ఆకాశంలో మరొక రకం నభోమూర్తులు కేవలం        x-కిరణాలని విరజిమ్ముతాయి. అవి మన కళ్లకి కనబడవు. వాటిని చూడాలంటే మనకి x-రే కళ్లేనా ఉండాలి లేకపోతే x-రే టెలిస్కోపు అనే మరొక రకం  దూరదర్శినిని అయినా వాడాలి.


నిజానికి ఒక నభోమూర్తి ప్రకాశిస్తూన్నప్పుడు అది వెలార్చే శక్తి ఒక్క వెలుగు రూపంలోనే కాకుండా అనేక ఇతర రూపాలలో బహిర్గతం అవుతూ ఉంటుంది. వేడి రూపంలో ఉన్న శక్తి, వెలుగు రూపంలో ఉన్న శక్తి కాకుండా ఇంకా అనేక అదృశ్య రూపాలలో శక్తి ఉంటుంది. దీనికి కారణం సూర్యరశ్మిలో ఉండేవి, మన కంటికి కనపడనివి అయిన   Ultraviolet Rays.


వీణ వాయించి సప్తస్వరాలు పుట్టించినప్పుడు ప్రతి స్వరానికి వీణ తీగ కంపించే జోరుకీ సంబంధం ఉంటుందని మనందరికీ తెలుసు. తీగ కంపించినప్పుడు పుట్టే శబ్దానికి రెండు లక్షణాలు ఉంటాయి. ఒకటి, జోరు (frequency); ఇదే స్వరాన్ని నిర్ణయిస్తుంది. రెండవది బిగ్గర తనం (loudness). తీగని ఎక్కువగా పైకి లాగితే దాని డోలన పరిమితి (amplitude) పెరుగుతుంది; మనకి శబ్దం బిగ్గరగా వినిపిస్తుంది. తీగ పొడవు తీగ ప్రకంపించే జోరుని (అంటే స్వరాన్ని) నిర్ణయిస్తుంది.


వాతావరణ పీడనంలో తటాలున సంభవించే మార్పుల వల్ల ఆకాశంలోని మేఘాలు కదులుతాయి. అప్పుడు వాటిలోని మంచుముక్కలు, నీరు కొంత చెల్లా చెదురై వాటి మధ్య ఘర్షణ జరిగి మేఘాలకు విద్యుదావేశం కలుగుతుంది. మేఘాలపై రుణ విద్యుదావేశం (negative electric charge) వస్తే, భూమిపై వస్తువులకు ధన విద్యుదావేశం (positive electric charge) సంక్రమిస్తుంది. వీటి మధ్య అనుసంధానం జరిగితే ఒక సారిగా తీవ్రమైన విద్యుత్‌ ఉత్సర్గం (electric discharge) వెలువడుతుంది. అదే ప్రకాశవంతమైన మెరుపు. ఈ ఎలక్ట్రిక్‌ స్పార్క్‌ వల్ల విద్యుత్‌ అయస్కాంత తరంగాలు ఏర్పడుతాయి.


శబ్ద తరంగాలకీ, విద్యుదయస్కాంత తరంగాలకీ (electromagnetic spectrum)  మౌలికమైన తేడాలు ఉన్నప్పటికీ, అన్ని తరంగాలకీ డోలన పరిమితి (amplitude), జోరు, లేదా, తరచుదనం (frequency) అనే రెండు లక్షణాలు ఉంటాయి. తరంగాలని వర్ణించేటప్పుడు మరొక భావం వాడతారు; తరంగ దైర్ఘ్యం (wavelength). ఒక అల శిఖ (crest) నుండి పక్కనున్న శిఖకి కాని, గర్త (trough) నుండి పక్కనున్న గర్తకి కాని ఉన్న దూరమే తరంగ దైర్ఘ్యం.


విద్యుదయస్కాంత కిరణాలని కాని, కాంతి కిరణాలని కాని తరంగాలుగా ఊహించుకుంటే ఆ తరంగాలకి ఉన్న జోరు ఆ కిరణాల రంగుని నిశ్చయిస్తుంది. కనుక ఒక కిరణం యొక్క తరంగ దైర్ఘ్యం చెప్పినా, జోరు (లేదా తరచుదనం) చెప్పినా, దాని రంగు చెప్పినా ఒక్కటే.


సూర్యరశ్మి ఏడు రంగులుగా విడిపోతుంది. ఈ సప్తవర్ణాల మాలకి ఇటూ, అటూ – మన కంటికి కనిపించకుండా – ఇంకా చాల పెద్ద వర్ణమాల ఉంది. మన కంటికి కనిపించేవి, చాక్షుష దూరదర్శినులకి (optical telescopes) కనిపించేవి అతి కొద్ది: అవే తేజోమేఘాలు (nebulae), నక్షత్ర గోళాలు, వాటితో నిండిన క్షీరసాగరాలు, మొదలైనవి. ఇవే బిలియన్ల కొద్దీ ఉన్నాయి. కాని ఇదే విశ్వంలో మనకి “కనపడని” (కంటికి, ఇప్పటివరకు మనం నిర్మించిన పరికరాలకి కూడ “కనపడని”) కృష్ణ పదార్ధం (dark matter) అనేది ఒకటి, కృష్ణ శక్తి (dark energy) అనేది మరొకటి ఉన్నాయి. విద్యుదయస్కాంత కిరణ తరంగాలు ఏడు రకాలు.అవి


1) రేడియో తరంగాలు

2) మైక్రో తరంగాలు

3) పరారుణ కిరణాలు

4) దృశ్య కాంతి

5) అతినీలలోహిత కిరణాలు

 6) x-రే కిరణాలు

7) గామా కిరణాలు.


అందులో దృశ్య కాంతిని తప్ప మిగతా వాటిని మనం చూడలేం. ఏడు రకాల విద్యుదయస్కాంత తరంగాలను వాటి తరంగదైర్ఘ్యం పెరిగే క్రమంలో లేదా పౌనఃపున్యం తగ్గే క్రమంలో వరుసగా అమరిస్తే-- ఆ అమరికను విద్యుదయస్కాంత వర్ణపటం అంటారు. విద్యుదయస్కాంత వర్ణపటంలోని వివిధ  వికిరణాల ధర్మాలు, ఉపయోగాలు, వాటిని ఉపయోగించి పనిచేసే వస్తువులు, ఆ వస్తువులు పని చేసే సూత్రాలు లాంటి అంశాలు ప్రధానంగా కనిపిస్తాయి.


ప్రపంచం మొత్తం వికిరణాలతో నిండి ఉంది. ఏ ఒక్కరూ వీటి ప్రభావం నుంచి తప్పించుకోలేరు. మనం ఉపయోగించే టీవీ, మొబైల్, మైక్రోవేవ్ ఓవెన్, ఇతర పరికరాలు, నక్షత్రాలు శక్తిని విద్యుదయస్కాంత తరంగాల రూపంలో విడుదల చేస్తున్నాయి. రాడార్, శాటిలైట్, మొబైల్ కమ్యూనికేషన్స్, టీవీ-రేడియో ప్రసారాలు, గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం (జీపీఎస్) తదితర నిత్యావసర ప్రక్రియల్లో విద్యుదయస్కాంత తరంగాల వినియోగం తప్పనిసరి.


సాధారణంగా విద్యుదయస్కాంత వికిరణాలు వాటి తరంగదైర్ఘ్యం ప్రకారం రేడియో తరంగాలు, మైక్రో తరంగాలు, టెరా హెర్ట్జ్ వికిరణాలు, పరారుణ వికిరణాలు, దృగ్గోచర వర్ణపటం(దృశ్య కాంతి) ,అతినీలలోహిత కిరణాలు, X-కిరణాలు మరియు గామా కిరణాలు గా వర్గీకరింప బడతాయి.

Comments