పరమ సిద్ధుడైన యోగి వలన విగ్రములు ప్రతిష్ఠ వలన, ఆ విగ్రహములందు దేవతా శక్తి ఆవిర్భవించును. దేవతా సాన్నిథ్యము కలుగును.
మనస్సును లగ్నము చేసి...తదేక భావముచే పూజించిన ఎడల, ధృఢ విశ్వాసము వలన సాధకునకు విగ్రహము సజీవముగా దర్శనమిచ్చును. దేవతా సాక్షాత్కారము భౌతికముగా జరుగును. ఉదాహరణకు...రామకృష్ణ పరమహంస.
సామవేద బ్రాహ్మణం ప్రకారం...దేవతా సాన్నిధ్యము వలన...విగ్రహమందు విచిత్రాలు ఇలా వర్ణించబడినవి.
దేవాయతనాని కంపంతే, దైవత ప్రతిమా హసన్తి, రుదన్తి, నృత్యన్తి, స్ఫుటన్తి, స్విద్యన్తి, ఉన్మీలన్తి, నిమీలన్తి....
దేవతా స్థానములు కంపించును. దేవతా ప్రతిమలు నవ్వును. రోదించును. నాట్యము చేయును. విగ్రహములు బ్రద్దలగును. చెమట పట్టును. కనులు తెఱచు కొనును. మూయుచుండును.
ఈ లక్షణములు , ప్రాణ ప్రతిష్ఠ వలన విగ్రహములందు దేవతా సాన్నిథ్య సూచకములుగా ఉన్నవి. ఈ లక్షణములు భిన్న సమయములందు కలుగు చుండును.
కలరా, మహమ్మారి మొదలగు వ్యాదులు వ్యాపించునపుడు , మహాత్ముల మరణ కాలమందు, ప్రతిమలు రోదనము చేయును. బ్రద్దలగును. కంపించును.
ఒక్కొక్క మహాత్ముడావిర్భవించునపుడు , దేవతా ప్రతిమలు నాట్యము చేయును. నవ్వును. ఇవన్నియూ ప్రాణ ప్రతిష్ఠ యొక్క మహిమా సూచనలు.
అయితే సాధకునకు పరస్పర సాన్నిథ్యమును కల్పించునది " మంత్రము " అయిఉన్నది.
విషయ ప్రపంచమునుండి దివ్య ప్రపంచమునకు చేర్చునది మంత్రము.
మంత్రాన్ని జపించుచూ, దేవతను ధ్యానించినచో...మంత్ర సిద్ధి కలుగును.
Comments
Post a Comment