శరీరం లో ఉన్న ఉపచక్రాలు
మానవ సూక్ష్మ శరీరంలో 7 చక్రాలు మాత్రమే ఉన్నాయనుకుంటాము. నిజానికి అనేకానేక ఉప చక్రాలతో, 7 ప్రధాన చక్రాలతో విలసిల్లుతున్నాడు...ఈ శరీర భగవానుడు.
కొంత మంది యోగుల ప్రకారం ఈ శరీరంలో 114 చక్రాలున్నాయి. వీటితో పాటు 72000 ముఖ్య నాడుల సముదాయము ఈ దేహమనే దేవాలయం.
మొత్తం చక్రాలలో కొన్ని చక్రాలు , మానవ శరీరంలోనూ, కొన్ని చక్రాలు, మానవ శరీరానికి ఆవల ఉంటున్నాయి.
శరీరములో గల ఉప - చక్రాల గూర్చి తెలుసుకుందాం.
శరీరంలో ఈ ఉపచక్రాలు శక్తి-సుడులులా వర్ణించబడ్డాయి. ఇవి ప్రధాన చక్రాలకు ఇంధనాన్నందించే, చిన్న కేంద్రాలుగా వర్ణించబడ్డాయి.
ఉదాహరణకు Thymus Chakra అనునది అనాహత, విశుద్ధ చక్రాలతో సంబంధం కలిగి ఉంటుంది.
శాస్త్రాలలో, ఉప చక్రాలు లేదా గౌణ చక్రాలు , రక రకాల సంఖ్యలలో, రక రకాల నామాలతో వర్ణించబడ్డాయి. హెచ్చు భాగం 21 గౌణ చక్రాలు లేదా ఉప చక్రాలుగా వర్ణించ బడ్డాయి.
1. ఛాతి మధ్య భాగంలో, జతృక యొక్క (clavicle) పై భాగంలో, 2 ఉప చక్రాలు కలవు.
2. మన అర చేతుల్లో ఒక్కొక్క చక్రంగా 2 ఉప చక్రాలున్నాయి.
3. మన 2 అరి పాదాలలో, ప్రతి అరి పాదంలోనూ ఒక్కొక్క చక్రం చొప్పున్న 2 ఉప చక్రాలున్నాయి.
4. మనకు గల రెండు కనుల పై భాగంలో ఒక్కొక్క చక్రం చొప్పున్న 2 ఉప చక్రాలున్నాయి.
5. ప్రతి పునరుత్పాదక అవయవమూ, ఒక ఉప చక్రాన్ని కలిగియుంటుంది.
6. మన కాలేయంలో కూడా ఒక ఉప చక్రం ఉంటుంది.
7. మన జీర్ణాశయంలో కూడా ఒక ఉప చక్రము ఉంటుంది.
8. మన ప్లీహములో (spleen)లో కూడా ఒక ఉప చక్రము ఉంటుంది.
9. ప్రతి మోకాలుకి ఒక ఉప చక్రం చొప్పున, 2 ఉప చక్రాలు మోకాళ్ళలో ఉంటాయి.
20. థైమస్ గ్రంథి వద్ద గల, వేగాస్ నాడిలో ఒక ఉప చక్రం కూడా కలదు.
21. మన solar plexus వద్ద కూడా మరో ఉప చక్రము కూడా కలదు.
ఈ ఉప చక్రాలు లేదా గౌణ చక్రాలు...రెండు అంగుళాల కైవారంతో, శరీరంలో గానీ-శరీరం బయట గానీ పరి వేష్టితమైయున్నాయి.
మనలో గల ఈ గౌణ చక్రాలు, ప్రధాన చక్రాల కన్నా, పరిమాణంలో చిన్నవిగా ఉంటాయి.
భూ తారా చక్రము:
శరీరంలో గల ఈ 8వ చక్రమే " భూతారా చక్రము ". ఈ చక్రము మూలాధార చక్రానికి, కుడి వైపు ఉంటుంది.ఈ చక్రము, మనకు - భూ తత్వానికి గల అత్యంత సన్నిహిత సంబంధాన్ని తెలుపుతుంది. ఈ చక్రం రంగు "ముదురు గోధుమ రంగు".
9వ చక్రము చంద్ర చక్రము. ఈ చక్రము సహస్రారానికి కుడివైపు పై భాగంలో ఉంటుంది. ఈ చక్రము, వెండి-తెలుపు తళ తళలతో అలరారుతూ ఉంటుంది. ఈ చక్రము చంద్ర శక్తిని గ్రహిస్తుంది.
10 వ చక్రము సూర్య చక్రము. ఇది 9వ చక్రానికి పైన ఉంటుంది. బంగారు రంగులో మెరిసి పోతూ ఉంటుంది. జీవితంలో గల శక్తిని ఈ చక్రము ప్రతిబింబిస్తూంటుంది.
గెలాక్టిక్ చక్రము :
గెలాక్టిక్ చక్రము, శరీరం బయట ఉంటుంది. ఈ చక్రము మన చేతికి,కాలుకి సంబంధం కలిగి ఉంటుంది. ఇది ఊదా,బంగారు కలిసిన మెరిసే రంగులో ఉంటుంది. ఈ చక్రము, చైతన్య పరచుకున్న వారికి "ఆకాశిక్ రికార్డులతో " సంబంధం ఉంటుంది.
విశ్వ చక్రము : ఈ పన్నెండవ ఉప చక్రము, ఏకత్వం యొక్క శక్తిని కలిగి యుంటుంది. ఇది మన "ఆరా" ( aura ) పై భాగంలో వ్యవస్థితమై ఉంటుంది. ఈ చక్రం , మానవుడికి వైశ్విక ఏకత్వంతో గల అవినాభావ సంబంధాన్ని తెలుపుతుంది. వైశ్విక చైతన్యాన్ని , ప్రతిధ్వనిస్తుంది.
అయితే, మన 7 చక్రాలపై ఆధిపత్యం సాధించామనుకోండి. అదే విధంగానే మనం ఉప చక్రాలపై కూడా ఆధిపత్యం సంపాదించినట్లే.
Comments
Post a Comment