శివుడు ఆజ్ఞ పై శంబాల నగరాన్ని నిర్మించిన విశ్వకర్మ - vishwagurunidhi



 ఈ సిద్ధాశ్రమం హిమాలయాలకి ఉత్తరాన ఉన్న మానస సరోవరానికి, కైలాస పర్వతానికి మధ్య 36 కి.మీ. పొడవు, 36 కి.మీ. వెడల్పు భూమిని ఆక్రమించి ఉన్నది.


మహా భారత యుద్ధానికి పూర్వం శ్రీకృష్ణుడు ఈ ఆశ్రమాన 12 సంవత్సరాలు తపస్సు చేసాడు. 


ప్రస్తుతము శ్రీకృష్ణుడు, అశ్వత్థామ, శంకరాచార్యులు, మత్స్యేంద్రనాథులు, గోరఖ్ నాథులు, ఏకలవ్యుడు, పుండరీకాక్షుడు, బుద్ధుడు ఈ ఆశ్రమాన ఉన్నారు.


సిద్ధాశ్రమాన...మూల కల్పవృక్షము వద్ద ధర్మరాజు, భీష్ముడు, కృపాచార్యులు..తపస్సులో ఉన్నారు.


ప్రస్తుతము భారతదేశములోని కొంత మంది సిద్ధి పొందిన యోగులు ఈ సిద్ధాశ్రమంతో సంబంధం కలిగి ఉన్నారు.


ఈ ఆశ్రమంలో రాత్రి అనేది ఉండదు. వృద్ధాప్యము ఉండదు. ఈ ఆశ్రమాన ప్రవేశించి ఏ దేవతా మూర్తిని దర్శించాలనుకుంటే ఆ దేవతా మూర్తి దర్శనం లభిస్తుంది.


ఈ సిద్ధాశ్రమము సామాన్య దృష్టికి అందదు. ఈ సిద్ధాశ్రమమునందు ప్రవేశించాలంటే, తత్సంబంధ యోగ్య గురువు వద్ద సిద్ధాశ్రమ ప్రవేశ దీక్షను పొందాలి.


శంకరాచార్యులు ఈ ఆశ్రమ ప్రవేశానికై యత్నించి..మూడు సార్లు విఫలమైనాడు. నాలుగవ సారి  సఫలత పొందినాడు.


శాస్త్రవేత్త ఐన్స్షీన్ ఈ ఆశ్రమమందు ప్రవేశించాలన్న కోరిక తోనే మరణించాడు.


భారతదేశములోని కొంత మంది యోగులు సిద్ధాశ్రమం ద్వారా సిద్ధ యంత్రాలను, మూలికలను తెప్పించి సమాజ శ్రేయస్సుకి ఉపయోగిస్తారు.


కొంతమంది యోగులు సూక్ష్మశరీరాలతో ఈ ఆశ్రమానికి వెళ్ళి  సాధనలు చేసి తిరిగి వస్తూంటారు.


Comments