పిండాండములో శ్రీ చక్ర భావన చేసి, ఆయా ఆవరణ దేవతలు, వారి పరివార దేవతలు, ఆ - ఆవరణలు, చక్రములు, దళాలు అన్నిటినీ ఒక క్రమపద్ధతిలో ఆరాధించే విధానాన్ని అంతర్యాగం' అంటారు. ఈ అంతర్యాగ శ్రీ చక్రార్చనే రహోయాగం' ఔతుంది. పిండాండ, శ్రీ చక్రాలను సమన్వయ పరుస్తూ అన్ని విషయాల్లోను అభేదాన్ని దర్శించి చేసే యాగం ఇది. ఈ విధంగా చేసే యాగం అమ్మవారికి ఇష్టంగూడా మన యొక్క సాధన, జ్ఞానాన్ని పెంచుకునే ప్రయత్నం మొదలైనవి మన అంతరంగంలో ఒంటరిగా మనమోనర్చే యాగం వంటిది. ఇవన్నీ మనకు తెలియకుండా నే జరుగుతుంది ఆలోచనలు కూడా గమనించే ప్రయత్నం చేయండి మీ గురించి మీకు చాలా విషయాలు తెలుస్తుంది..*
*అనంతమైన విశ్వశక్తి పిండాండంలో ఒక పరిధిలో ఇమిడి ఉంటుంది. ఈ విషయం గ్రహించిన వాడికి విశ్వమంతా తనలో తాను విశ్వమంతా నిండి యుండి కనిపిస్తాడు.*
*జీవము లో ఉన్నశక్తి విశ్వమంతా నిండి యున్న పరమాత్మ లోని శక్తి ఒక్కటే స్థిరంగా అందాలి అలా ఒక్కటే అని తెలిసిన నాడు తాను ఒక్కడే ఒంటరిగా వేరు అనే భావం కాదు, తనలో అందరూ ఉన్నారు, అందరిలోనూ తాను ఉన్నాడు అనుకున్న ఒంటరి స్థితి, అనన్య స్థితి, ఆ స్థితిలో పరాశక్తికి చేసే ఆరాధనే రహోయాగం. ఈ సాధన రహస్యముగా చేయబడు యాగము. ఈరహస్యాన్ని "రహొయాగ క్రమారాధ్యా రహస్తర్పణ తర్పితా" అన్న మంత్రం సూచిస్తున్నది. ఇక్కడ ఉన్న ఇంకొక యోగరహస్యం ఏమనగా, మనం బాహ్యంగా చేసే ఏ తర్పణమైనా పైనుంచి క్రిందకు వదులుతాము. కాని "రహస్తర్పణము" అనబడే ఈ తర్పణము మాత్రం శరీరం లోపల జరుగుతుంది. బాహ్య ప్రక్రియకు భిన్నంగా ఇది క్రిందనుంచి పైకి వ్యతిరేకదిశలో జరుగుతుంది. క్రింది నుంచి పైకి శక్తి రూపంగా ప్రవహించి సహస్రార కమలంలో ఉన్న నిత్య బోధ స్వరూపుడైన పరమ శివుని అభిషేకిస్తుంది.*
*ఈ ప్రక్రియ ఎటువంటి సిద్ధిని సాధకునికి కలుగజేయగలదో తరువాతి మంత్రం చెబుతుంది. సద్య: ప్రసాదినీ..నామంలో తెలుస్తుంది.*
*సగుణ, నిర్గుణ తత్వాలను రెండింటి గురించి తెలుసుకున్న సాధకుడికి సాధన చేసుకొని జ్ఞానమును పెంపొందించుకుంటూ ఆరాధన చేయాలి అనే క్రమమైన పద్దతి రహోయాగ క్రమము..శ్రీ చక్రమే అంతర్యాగము అదే రాహోయాగము. దీనికి పదార్థాలతో వ్యక్తులతో పని లేదు. అనన్య భావంతో ఒంటరిగా చేసే అంతర్ముఖ ధ్యాన యాగము ఇది.*
*మానసికంగా చేసే పూజ అలంకారం హృదయం తో చేసే సమర్పణ ఈ మానసిక పూజ ఇదే కోవకు చెందినది..మనసు సమర్పించి చేసే ఏకాగ్రత సాధన. నీలో నే నీ రూపంలో ఉన్న భగవంతుడు కి చేసే నిత్య ఉపాసన రహోయాగం..*
*అనన్యభావంతో క్రమమైన పద్దతిలో ఆరాధింపబడునది' అని ఈ నామానికి అర్థం.*
*ఆత్మ ధైర్యాన్ని, ఆత్మ విశ్వాసాన్ని, మనో నిగ్రహాన్ని కలిగించే నామ మంత్రం ఒక నాయకుడి ఉండవలసిన సామర్ధ్యం, ప్రణాళిక, ఒక.కార్య నిర్వహణ చేయాల్సిన వ్యకికి ఉండవలసిన సమతుల్యత పెంపొందిస్తుంది. సొంతగా ఆలోచించే శక్తిని మీయొక్క సామర్ధ్యంని మీరు గుర్తుంచే జ్ఞానం అనుగ్రహిస్తుంది. కొత్త ఉత్సహం ఆరోగ్యం కలుగుతుంది..*
*మిమ్మల్ని మీరు సక్రమంగా అన్నిటిలో సమతుల్యతను చేసుకోగలుగుతారు ఇది ప్రతి వ్యక్తిలో ఉంటే ఎన్నో సమస్యలు తీరిపోతుంది.*
*క్షణికావేశమే ఎన్నో తప్పులకు కారణం అవుతుంది ఆ ఒక్క క్షణం ఆవేశాన్ని కంట్రోల్ చేసుకుంటే అనర్ధాలు జరగదు అది ఏ విషయంలో అయిన. అట్టి స్థితిని బాలన్స్ చేయగల నామ మంత్రం ఇది.. నిత్యం ధ్యానం, నామ జపం చేసుకుంటే ఈ మంత్ర ప్రభావం మీ జీవితంలో చాలా శాంతిని కలిగిస్తుంది.*
Comments
Post a Comment