Characteristics of the mind -మనస్సు యొక్క లక్షణములు - vishwagurunidhi


 మనస్సు  యొక్క లక్షణములు 



మనస్సును స్థూలముగా 3 రకాలుగా విభజించవచ్చును.


1. శుద్ధ మనస్సు


2. అశుద్ధ మనస్సు


3. అనన్య మనస్సు



శుద్ధ మనస్సు - లక్షణములు : 


ఆశా వ్యామోహాలు లేకుండుట, దేని యందునూ ఇచ్ఛ లేకుండుట, మనస్సును ఆత్మ యందు ఐక్యము చేయుట.


కామ వర్జితమైనది శుద్ధ మనస్సు.


అశుద్ధ మనస్సు :


బంధాలు, ఆశలు, ప్రీతి, అరిడ్వర్గాలతో నిండియున్నదే అశుద్ధ మనస్సు.


కామ సంకల్పములతో కూడినదే అశుద్ధ మనస్సు.


ఏ కల్మషాలునూ లేని పరిశుద్ధమైన మనస్సే ఆత్మకు మిత్రుడు. బంధువు. పరిశుభ్రము లేని మనస్సు శతృవు.


శుభ్రమైన మనస్సు గల వాని సహవాసముతో అశుభ్రత నశించును.


అనన్య మనస్సు :


 అనన్యము అనగా అన్యము లేనిదని అర్థము. అనగా ఆత్మ తప్ప అన్యమగు వస్తువు మరియొకటి లేదని అర్ధము.


మనస్సు ఒక విషయము లేదా వస్తువు యందు సంలగ్నము కాక , ఇతర వ్యాపకాలు లేకున్న స్థితియే " అనన్య మనస్సు ". అట్టి గుణము గల మనస్సు తోనే పరమాత్మను ధ్యానించవలెను. ఆత్మ యందు దృష్టి తప్ప ఇతర దృష్టులు లేని మనస్సే అనన్య మనస్సు. ధ్యేయ వస్తువును జాగ్రత్తగా ఎంపిక చేసుకుని, దానిపైననే ధ్యానించవలెను.


అట్టి స్థితిలో మాత్రమే అనన్య మనస్సు సంభవమగును.

Comments