ఈ దత్త షట్చక్ర జాగరణ స్త్రోత్రం ఒకొక్క చక్రాని కి ఒకొక్క స్త్రోత్రం ఈ ఒక స్త్రోత్రం సాధన పారాయణ 40 రోజులు చేస్తే అద్భుత ఆశ్చర్య కరమైన మార్పులు వస్తాయి
సాధన :- పద్మాసనం లో కూర్చొని వెన్ను నిటారుగా ఉంచి
మొట్టమొదట మూలాధారం నుండి మొదలు పెట్టి ఒక్కొక్క చక్రానికి సంబంధించిన స్త్రోత్రం పారాయణ చేయాలి
ఈ పారాయణ రోజుకి 11 సార్లు కన్నా ఎక్కువ చేయకూడదు దాని నుండి వచ్చే శక్తి తట్టుకోవడం కష్టం అతిగా చక్రాలు క్రియావంతం అయినా సమస్యలు వస్తాయి
గర్భిణీ స్త్రీలు చేయకూడదు
ఏ చక్రానికి సంబంధించిన స్త్రోత్రం చేస్తున్నారో ఆ చక్రం మీద దృష్టి పెట్టి చేయవలెను
11 సార్లు పారాయణ ముగిసిన తర్వాత శ్వాస మీద ధ్యాస ఉంచి 15 నిమిషాలు ఉంచండి
భైరవ ముద్ర
కుండలిని ముద్ర
నాగ ముద్ర ఒకొక్క ముద్ర 5 నిమిషాలు చెప్పున 15 నిమిషాలు ధ్యానం చేయాలి
తరువాత గంట వ్యవధి ఇచ్చి మీ ఇష్ట దేవత మంతాన్ని గాని స్త్రోత్రం గాని దండకం కానీ 108 సార్లు పారాయణ చేయండి
ఇలా 40 రోజులు చేయండి మీ శక్తి ని బట్టి
90 రోజులు కూడా చేయండి
సాత్విక ఆహారం
బ్రహ్మచర్యం
అవసరానికి మించి ఎక్కువగా వృధాగా మాట్లాడకూడదు పనికి వచ్చే మాటలు ఎంత సేపు అయిన పరవలేదు ఉపయోగం లేనివి వృదా మాటలు ఈ సాధన చేసినప్పడు వద్దు
ఎందుకు అంటే విశుద్ధి చక్రం లో శక్తి క్షీనిస్తుంది ఈ చక్రం గొంతు దగ్గర ఉంటుంది
మనిషి శరీరంలోని శక్తి కేంద్రాలనే యోగ సాధకులు చక్రాలంటారు.మనిషి వెన్నుపూసలో నిద్రాణ స్థితిలో దాగివుండే ఒక అనిర్వచనీయమైన శక్తినే కుండలిని శక్తిగా యోగ శాస్త్రం అభివర్ణిస్తోంది. విశేష యోగ సాధన ద్వారా వెన్నుపూస దిగువనుండే మూలాధారం వద్ద నిద్రాణంగా ఉన్న కుండలినీ శక్తిని జాగృతం చేసి సహస్రారం వరకు సుషుమ్న నాడి సాయంతో చేర్చే పద్ధతిని కుండలినీ యోగం వివరిస్తోంది. ప్రాణ శక్తిని సమతుల్యం చేయటం తెలుసుకున్న మనిషికి శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ప్రగతి సాధ్యమవుతుంది.
చక్రాలు
మూలాధార చక్రము: గుద భాగానికి పైన ,లింగ స్థానానికి కింది భాగంలో ఈ చక్రం ఉంటుంది. ఇక్కడే కుండలినీ శక్తి నిద్రాణమై ఉంటుంది. ఈ చక్రం పనితీరు బాగున్న వారు ధైర్యం, భద్రతతో జీవిస్తారు. ఈ చక్రం పనితీరు దెబ్బతిన్న వ్యక్తులు నిరంతరం అసంతృప్తి, భయం వంటి భావనలతో జీవితాన్ని వెళ్లదీస్తుంటారు. వీరు తరచూ ఎముకలు, దంతాలు, పేగులకు సంబంధించిన అనారోగ్యాలను ఎదుర్కొంటుంటారు. మొక్కలు పెంచటం, పచ్చిక మీద చెప్పులు లేకుండా నడవటం వల్ల ఈ చక్ర పనితీరును మెరుగుపరచుకోవచ్చు. ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చొని వెన్నుపూస దిగువ భాగాన ఎరుపు రంగు ఉన్నట్లు భావిస్తూ 'నేను సరైన రక్షణలో ఉన్నాను. నా అవసరాలన్నీ చక్కగా సమకూరుతున్నాయి. నాకెలాంటి భయం లేదు' అని భావన చేయటం ద్వారా ఈ చక్రం పనితీరును మెరుగు పరచుకోవచ్చు.
స్వాధిష్ఠాన చక్రము: బొడ్డు దిగువ భాగాన ఉండే నారింజ రంగు చక్రమే స్వాధిష్ఠానం. ఇది భావోద్వేగాల కేంద్రం. మంచి చెడులను భరించే శక్తితో బాటు ఇంద్రియాలనూ ఇది ప్రభావితం చేస్తుంది. ఆనందమయ జీవితాన్ని కోరే ప్రతి వ్యక్తీ ఈ చక్ర గతిని గాడిలో పెట్టుకోవాలి. దీని పనితీరు దెబ్బతింటే ఆ ప్రభావం మనసు మీద పడి మనిషి వ్యసనాల పాలవుతాడు. నిజ జీవితంలో కోల్పోయే ఆనందాన్ని వ్యసనాల ద్వారా పొందేందుకు ప్రయత్నిస్తూ ఊహా జగతిలో ఉండిపోతాడు. ఈ చక్రం పనితీరు బాగుండాలంటే బొడ్డు కింద భాగంలో నారింజ రంగును ఊహించుకొని 'ఆరోగ్యాన్ని, ఆనందాన్ని పంచే స్థితిని ఆహ్వానిస్తాను. వాటిని ఆసాంతం అనుభవిస్తాను' అని పదే పదే మనసులో అనుకోవాలి.
మణిపూరక చక్రము: బొడ్డు పై భాగంలో పసుపు రంగులో ఉండే చక్రమే మణిపూరకం. మానసిక ప్రవృత్తిని, ఆత్మ నిగ్రహాలను ఇది ప్రభావితం చేస్తుంది. సమస్యలను ఎదుర్కొని సానుకూల పరిష్కారాలను కనుగొనేందుకు ఈ చక్రం దోహదపడుతుంది. దీని పనితీరు బాగున్న వ్యక్తులలో ఏదో తెలియని ఆకర్షణ, వెలుగు ఉంటుంది. దీని పనితీరు దెబ్బతిన్న వ్యక్తులు సొంతనిర్ణయాలు తీసుకోలేరు. తరచూ మాట మార్చటం, ఇతరుల మీద ఆధారపడటం, ఒప్పుకున్న పనిని పూర్తి చేయలేకపోవటం, ఒకే సమయంలో పలు పనులు మొదలుపెట్టి ఒక్క పనీ చేయలేక పోవటం, ఎదుటి వారిని సంతోషపు పెట్టేందుకు సొంత సమయాన్ని వృధా చేసుకోవటం వంటి లక్షణాలుంటాయి. ఈ పరిస్థితి మారాలంటే క్రమబద్ధమైన జీవనానికి అలవాటు పడాలి. రోజూ వ్యాయామం చేయట, ధ్యానం చేయటం తప్పనిసరి. బొడ్డు, గుండె మధ్య భాగంలో పసుపు రంగు గోళాన్ని ఊహించుకొని ' నేను చేసే ప్రతి పనికీ నేనే బాధ్యుడను. నన్ను నేను అదుపు చేసుకోగలను' అని మళ్ళీ మళ్ళీ భావన చేసుకోవటం ద్వారా ఈ చక్రం పనితీరు మెరుగుపడుతుంది.
అనాహత చక్రము: ఇది హృదయ స్థానములో ఆకుపచ్చ రంగులో ఉంటుంది. ప్రేమ వంటి సున్నితమైన భావనలకు ఇది కేంద్రం. ఈ చక్రం ఛాతీ, వీపు భాగాల పనితీరును నియంత్రిస్తుంది. ప్రతి క్షణాన్ని ప్రేమించేలా చేయటంతో బాటు ప్రాణ శక్తిని, చైతన్యాన్ని పెంపొందిస్తుంది. దీని పనితీరు బాగున్న వారు ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటారు. ఎలాంటి భేషజాలు లేకుండా వాస్తవాలని అంగీకరిస్తారు. ఈ చక్రం పనితీరు దెబ్బ తిన్నవారికి ఏ పనిలోనూ సంతోషం, సంతృప్తి లభించవు. ఎవరినీ నమ్మరు. ఎప్పుడూ తక్షణ ఫలితాలను ఆశిస్తారు. పనులను మధ్యలోనే వదిలేస్తారు. పెంపుడు జంతువుల ఆలనా పాలనా చూడటం ద్వారా ఈ చక్రం పనితీరు బాగుపడుతుంది. గుండె భాగంలో ఆకుపచ్చ గోళాన్ని ఊహిస్తూ ' నేను అందరి ప్రేమనూ పొందగలను. నా చుటూ ఉన్నవారికి ప్రేమను పంచుతాను. మంచి చెడులను ఏకరీతిన జీవితంలోకి ఆహ్వానిస్తాను.' అని రోజూ పదే పదే మననం చేసుకోవటం ద్వారా ఈ చక్రం పనితీరు మెరుగుపడుతుంది.
విశుద్ధి చక్రము: కంఠ స్థానములో నీలి రంగులో ఉండే ఈ చక్రం సృజన, భావ వ్యక్తీకరణకు కేంద్రం. ఇది దవడ, మెడ, ఊపిరితిత్తుల పనితీరును నియంత్రిస్తుంది. దీని పనితీరు బాగున్న వారు ఏ రంగంలోనైనా నాయకులుగా, మార్గదర్శులుగా ఎదుగుతారు. వీరిమాటను అందరూ ఆమోదిస్తారు. ప్రణాళికా బద్ధంగా పనిచేయటమే గాక ఇతరులు చెప్పేదాన్నీ శ్రద్దగా వింటారు. ఈ చక్రం పనితీరు దెబ్బవారు కంగారు, గందరగోళానికి గురికావటం, అనాలోచితంగా పనులు చేయటం వంటి ఇబ్బందులకు గురవుతారు . మనసుకు సంతోషాన్ని కలిగించే పనులు చేయటం, ఇంటిపని, రచనా వ్యాసంగం, పుస్తకాలు చదవటం, క్రీడలు వంటి వాటిని అలవాటు చేసుకుంటే ఈ చక్రం పనితీరు మెరుగుపడుతుంది. ప్రశాంతంగా కూర్చొని గొంతు భాగాన నీలిరంగు గోళం ఉందని భావిస్తూ ' నేను ఏ విషయాన్నైనా కొత్తగా ఆలోచిస్తాను. దాన్ని నలుగురికీ ఆసక్తి కలి
గేలా చెప్పగలను' అని మననం చేయటం ద్వారా కూడా ఈ చక్రం పనితీరు మెరుగుపడుతుంది.
ఆజ్ఞా చక్రము: భ్రూ (కనుబొమల) మధ్య భాగంలో ముదురు నీలం రంగులో ఉండే ఈ చక్రమే అంతర్బుద్దికి కేంద్రం. ఊహించటం, ఆలోచించటం దీని పని. దీన్నే త్రినేత్రం అనీ అంటారు. దీని పనితీరు బాగుంటే భవిష్యత్తులో రానున్న సంకేతాలను, మార్పులనూ సరిగా ఊహించగలరు. కళాకారులుగా గుర్తింపు పొందుతారు. ఈ చక్రం పని తీరు దెబ్బ తిన్నవారు కంటికి కనిపించే వాటినే నమ్ముతారు. సొంతనిర్ణయాలు తీసుకోలేరు. చిన్న చిన్న విషయాలకూ అతిజాగ్రత్త పడుతుంటారు. బొమ్మలు వేయటం, రంగులద్డటం వంటి పనులతో ఈ చక్రం పనితీరు మెరుగు పడుతుంది. కనుబొమ్మల మధ్యభాగంలో ముదురు నీలిరంగు గోళాన్ని ఊహిస్తూ ' అంతర్బుద్దిని, ఊహాశక్తిని పెంచుకొంటాను. ఈ క్రమంలో ఎలాంటి సమస్యనైనా ఎదుర్కొంటాను' అని సంకల్పం చెప్పుకుంటే ఈ చక్రం పనితీరు మెరుగు పడుతుంది.
సహస్రార చక్రము : మాడు భాగంలో బచ్చలి పండు రంగులో ఉంటుంది. ఈ చక్రాన్ని చేరుకున్న వ్యక్తి జీవాత్మ, పరమాత్మల సంబంధాన్ని తెలుసుకుంటాడు. యోగ సాధన పరంగా కుండలిని ఆఖరి మజిలీ ఇది. ఆత్మజ్ఞానమును సాధించిన పరమ హంసలు ఈ చక్రాన్ని చేరగలరు. దీనిని శైవులు శివస్థానమనీ, వైష్ణవులు పరమ పురుష స్థానమనీ, శాక్తేయులు దేవీస్థానమనీ, కొందరు హరిహర స్థానమనీ అంటారు. కుండలిని శక్తిని ఈ స్థానానికి చేర్చిన మనిషికి పునర్జన్మ నెత్తాల్సిన అవసరం లేదని యోగ శాస్త్రం స్పష్టం చేస్తోంది.
ఈ దత్త షట్చక్ర స్త్రోత్రం ఒకొక్క చక్రాని కి ఒకొక్క స్త్రోత్రం ఈ ఒక స్త్రోత్రం పారాయణ 40 రోజులు చేస్తే అద్భుత ఆశ్చర్య కరమైన మార్పులు వస్తాయి
Datta shatchakra sadhana to be done independently for 40 days each or can it be done for all 6 chakras at a time . Kindly clarify.
ReplyDeleteWhere can I get further details.
jai GURUDEV
ReplyDelete