తాంత్రిక అంటే ఏమిటి - Vishwagurunidhi


తాంత్రిక విద్య అంటే ఏమిటి :-


ప్రస్తుత కాలంలో తంత్రం అంటే అదేదో చెడు చేయడం అని , రహస్యంగా కుట్రలను పన్నటం అని అందరూ అనుకుంటున్నారు . దాన్ని తంత్ర అనరు . కుతంత్రాలు అంటారు . ఒక కార్యాన్ని విజయవంతం చేయడానికి ఇష్ట కార్య సిద్ధి జరగడానికి కొన్ని మంత్రాలు , వస్తువులను , ఉపయోగించి చేసే కార్యక్రమాన్ని తంత్రం . తంత్ర అనేది ఒక శక్తి గల మంత్రంతో గూడిన సాధనం లాంటిది . ఆ సాధనమును శత్రు సంహారానికి ఉపయోగించవచ్చు . చెడు సంకల్పంతో చెడు కార్యములకు ఉపయోగించవచ్చు . కత్తితో ఫలములను , దర్భలను కోయవచ్చు , జీవహింస చేయవచ్చు . అది చేసే వారి ఆలోచనా సంకల్పమును బట్టి ఉంటుంది . మంచికి చేస్తే మంచి ఫలితంను , చెడుకు చేస్తే చెడు ఫలితాలను పొందటం జరుగుతుంది . భారతంలో శకుని , తంత్రంను ఉపయోగించి తన ఇష్ట కార్యసిద్ధి జరుపుకోవడానికి తంత్ర విద్య ద్వారా మాయా జూదమును జరిపించాడు . అందుకు కారణం గా అది చెడు అవడం వలన అప్పటికి మాత్రం వారి కార్యం విజయవంతం అయింది గాని కౌరవులు పాచికల రూపంలో ప్రేతాత్మలను ఉపయోగించి ఈ చెడు బుద్ది తో చేసిన పాప తాంత్రిక కర్మ వలన చివరకు సర్వ నాశనం అయిపోయారు . చేసే సంకల్పంను బట్టి ఈ తాంత్రిక విద్యల ద్వారా ఫలితాలు పొందడం జరుగుతుంది . శ్రీకృష్ణుడు తాను సృష్టించిన మంచికి , ధర్మానికి చెడు ఎదురవుతున్న సందర్భంలో ఆ చెడును నిర్మూలించగల శక్తి ఆ పరమాత్మకి ఉన్నప్పటికీ , తంత్ర విద్యల ద్వారా మానవ రూపంలో ఉన్న పాండవుల ద్వారా ప్రయోగింపజేసి నిర్మూలించాడు . ఇందులో సూక్ష్మం ఏమిటంటే కర్మఫలం వలన మానవుడు ఎదుర్కొనే చెడు కర్మలకు నిర్మూలణా మార్గాలను తంత్ర విద్యల రూపంలో ఆ శ్రీ మహావిష్ణువే వరంగా ప్రసాదించారు . మనం ఎదుర్కొంటున్న శత్రు సమస్యలను , వారు చేసే లేదా చేయించే అభిచార కర్మలను , మనమే తొలగించుకునేలా తంత్ర విద్యలను ప్రసాదించారు . ఎంతో శక్తివంతులు మరియు శూరులూ , ధీరులు , ధర్మ పరాయుణులైన పాండవులు శత్రు సంహారానికి తంత్రాలను ఉపయోగించడం జరిగింది . చరిత్రలోకి వెళితే అణు ఆయుధాలు తంత్ర విద్యలే కదా? మహాభారతంలో ఉపయోగించబడిన అత్యంత శక్తివంతమైన ఆచరణకి కష్ట సాధ్యమైన నాగాస్ర్తం , దీనినే వశీకరణ అస్త్రం అని కూడా అంటారు. ఆగ్నేయాస్త్రం , కుజాస్త్రం ఇది కుజుడికి సంబంధించినది , పాశుపతాస్త్రం ఇది మహాదేవుడికి సంబంధించినది . వాయువ్యాస్త్రం ఇది కేతువు , వాయు దేవుడికి సంబంధించినది . వారుణాస్త్రం ఇది వరణుడికి సంబంధించినది . ఇలా ఎన్నో శస్త్ర అస్త్రాలు అధర్వణ వేదంలో భాగాలే .. అంటే ఇక్కడ మనం తెలుసుకోవల్సినది ఏమిటంటే ఈ శస్త్ర అస్త్రాలు అన్నీ కూడా తాంత్రిక విద్యలు . రాక్షస పీడను , శత్రు పీడను , నిర్మూలించడం కోసం రూపొందించిన విద్యలు .. ద్వాపరయుగంలో , త్రేతాయుగంలో కూడా రాక్షస ఫీడను నిర్మూలించి లోక కళ్యాణం కోసం ఈ శస్త్ర అస్త్రాలను ఉపయోగించక తప్పలేదు . ఇందులో మర్మం ఏమిటి అంటే పైశాచిక తనాన్ని నిర్మూలించడమే !! కొంత శ్రద్ధగా గమనిస్తే ఇందులో మర్మం అర్థం అవుతుంది. ఎదుటి వారి పై తంత్ర విద్యలు ప్రయోగించాలన్న వారికి పూర్వ జన్మ పాపాలు , శాపాలు అధికంగా ఉంటేనే అవి వారి పై ప్రభావాన్ని చూపుతుంది . అంటే చేసే ప్రతీ క్రియ కూడా కర్మ ఫలమే .. అది మంచి కానీ చెడు కానీ , పైశాచిక గ్రహాల చెడు ప్రభావాలను నిర్మూలించడానికి మాత్రమే తంత్ర విద్య ఉపయోగపడతాయి .. మన నుదిటి వ్రాత ఆ బ్రహ్మ ఆజ్ఞానుసారం జరుగుతుంది . మనిషి ఎదుర్కొనే భాధను తన బాధగా స్వీకరించే ఆ పరమాత్మ ఆ బాధని తొలగించడం కోసం ఈ తంత్ర మార్గాలను అధర్వణ వేదం ద్వారా మనకు ప్రసాదించారు . ఇందులో అంతర్యం ఏమిటి అంటే , వర్షం వచ్చినప్పుడు గొడుగును ఉపయోగించడం వలన ఆ వర్షం నుంచి తడవకుండా ఉండగలుగుతాం .. వర్షం పడటం బ్రహ్మ మనపై చూపించే నుదిటి వ్రాత .. మండుటెండ కాచినపుడు పాదరక్షలు దరించడం ఆ వేడి తాపం నుంచి కాళ్ళు కాలకుండా రక్షించుకోవడం . వేడి తాపం అనేది సూర్య గ్రహ రూపంలో బ్రహ్మ మనపై చూపుతున్న వ్రాత .. వర్షం నుంచి , సూర్య తాపం నుంచి కాపాడే గొడుగు , పాదరక్షలు గ్రహ దోష నివారణా మార్గాలు లాంటివి .. విధిని తప్పించుకోవడం కష్టం కానీ , తామస , రజో , లక్షణాలు కలిగిన శత్రు ఫీడ నివారణా , అభిచార కర్మలను తంత్ర విద్యల ద్వారా నిర్మూలించవచ్చు ..!! ఈ తంత్ర విద్యలను అభ్యసించిన వారు వీలైనంత వరకు లోక కళ్యాణం కోసమే ఉపయోగించాలి .. అలా కాకుండా కామ , క్రోధ , మధ, మత్సర్యాలతో , అసూయతో , ఈర్ష్యా ధ్వేషాలతో ఇతరులపై చేయడం అంత మంచిది కాదు. శక్తివంతమైన ఈ తాంత్రిక విద్యలను అభ్యసించడం వల్ల మనుషులు తాము ఎదుర్కొంటున్న శత్రువులు చేసిన అభిచార కర్మలను నిర్మూలించుకోగలరు .. స్త్రీ అనుబంధ ప్రాప్తి , స్త్రీ సాంగత్య ప్రాప్తి , నష్ట ద్రవ్య ప్రాప్తి , కార్యసిద్ధి , వ్యాపార అభివృద్ధి , కోర్టు వ్యవహారాలు , మొదలైన వాటిలో విజయాన్ని పొందుతారు... ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్లుగా ఏ స్థాయిలో ఉన్నవ్యక్తికి ఆ స్థాయిలో శత్రు పీడ ఉంటుంది .. వివిధ దుష్ట గ్రహ ప్రభావం ఉంటుంది .. అందరికీ ఆర్థిక వెసులుబాటు ఉండదు.. మీ శత్రు సంహారం కోసం చేయగలిగే ఈ తంత్ర మార్గాలను ఆర్థిక

బలం , అంగ బలం లేని వారు కూడా అభ్యసించవచ్చు .. ఉపయోగించవచ్చు .. జీవుడు తాను పుట్టిన నాటి నుండి మరణించే వరకు తన యొక్క పూర్వ జన్మ లోని చేసుకున్న పాపపుణ్యాల కర్మఫలాన్ని అనుభవించడానికి విధి రూపంలో ఎన్నో ఎన్నెన్నో అనుబందాలను , ఆనందాలను , ఐశ్వర్యాలను , ప్రేమానుబంధాలను , భాధ్యతలను , సుఖాలను అనుభవించడం జరుగుతుంది .. పూర్వ జన్మలో ఎవరితోనైతే శత్రుత్వం కలిగి ఉంటారో , ఈ జన్మలో వారికి బాంధవ్యాల రూపంలో సంబంధం బాంధవ్యాలు ఏర్పడతాయి .. ఇలా ఎన్నో రకాలుగా జరుగుతుంది .. పూర్వ జన్మలో తాము ఎదుర్కొన్న అనారోగ్య , ఆర్థిక , సామాజిక , కుటుంబ , బంధుత్వాలు ఋణశేషం ఇహ జన్మలో మానవుడు అనుభవిస్తున్నాం .. ఆ పూర్వ జన్మలో గ్రహాల ద్వారా యోగాల , అవయోగాల ద్వారా వాటిని అనుభవించి కర్మఫలాన్ని సంపూర్ణం చేసుకోవడం జరుగుతుంది .. ఇది శాస్త్ర సమ్మతం !!! అయితే ఈ జన్మలో ఎదుర్కొంటున్న , ఎదుర్కోబోయే సమస్యలు , దోషాలు వేద జోతీష్య శాస్త్రం ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాం .. కర్మఫలాన్ని అనుభవించడానికి మనం పుట్టినప్పుడు ఈ కర్మఫలం లో ఉండే అతి భయంకరమైన మానసిక , శారీరక సంక్షోభాలకు గురి చేసే విధి వ్రాతను తప్పించుకోవడం ఎంతవరకు సాధ్యం ? అని ప్రతీ ఒక్కరికీ సందేహం కలుగక మానదు !? విధి అనేది తప్పక అనుభవించాల్సినదని దాని నుండి తప్పించుకోవడం సాధ్యం కాదని ప్రతీ ఒక్కరూ అనుకుంటూ ఉంటారు !! పురాణాల ప్రకారంగా చూసినట్లైతే గంధర్వులు , యక్షులు , శాపాలకు గురి కావడం మనం చదివాం .. శాపాలకు గురి కావడం అనేది విధి .. శాపాలకు విమోచన , విరుగుడు చేసుకోవడం అనేది ఆత్మ సంకల్ప విధి !! పూర్వ జన్మ కర్మఫలం శరీర రూపంలో ఆత్మ అనుభవించడం జరుగుతుంది .. శరీరం రూపంలో ఉన్న ఆత్మ పాపపుణ్యాలను అనుభవించడం వలన స్థూల శరీరానికి మాత్రమే ఆ నొప్పి , ఆనందం తెలుస్తాయి .. అంతేగానీ శాశ్వత అత్మకు కాదు .. కర్మ ఫలం ద్వారా కానీ , మానసిక దౌర్బల్యం వలన గాని , సమస్యలు ఎదుర్కొంటున్న శరీరమునకు ఉపశమనం ఇచ్చే మార్గాలే అంతరాత్మ ద్వారా మనకు భగవంతుడు తెలిజేస్తాడు.. ఆ భగవంతుడు ఇచ్చిన తాంత్రిక మార్గాలే ఈ తంత్ర విద్యలు .. కర్మఫలాన్ని అనుభవించడానికి మనపై భగవంతుడు ఏర్పరిచిన ఈ మాయా బంధాల సమస్యలను ఎదుర్కోవడానికి ఆ పరమాత్మే మార్గాలను చూపాడు .. మహాభారతంలో శత్రువులను సంహరించడం కోసం శ్రీ కృష్ణుడు అర్జునుని చేత ప్రయోగింపబడ్డ శస్త్ర అస్త్రాలు తంత్రములే కదా ..!! గ్రహాల రూపంలో , గ్రహాల ద్వారా ప్రయోగింపబడ్డ అత్యంత శక్తివంతమైన నాగాస్త్రం , దీనినే వశీకరణాస్త్రం అని పేరు .. ఈ వశీకరణ అస్త్రం శుక్రుడు , రాహు గ్రహముల సహాయం తో ప్రయోగిస్తారు .. గ్రహముల ద్వారా మంత్రములను ప్రయోగించే వాటిని అస్త్రాలు అంటాం.. తంత్ర విద్యలను అభ్యసించి ఉపయోగించి ప్రయోగించడాన్ని తంత్ర అంటాం.‌





Comments