ఋతంభరా ప్రజ్ఞ - Vishwagurunidhi
*ఋతంభర* ఒక విశ్వ జ్ఞాన కోశం. *ఋతంభర* అన్ని దివ్య సంకేతాలకి, అనుభూతులకి మూలం. ఋతంభర ఆధ్యాత్మిక దూరవిద్యా విజ్ఞానం.
అది అన్ని చోట్లా విశ్వమంత వ్యాపించిన చైతన్యం. ఎక్కడైనా ఉండి, ఎక్కడినించైనా మాట్లాడ గల అతీత పరబ్రహ్మని సృష్టితో అనుసంధానం చేసే ప్రక్రియ *ఋతంభర.* దేవతలు, మహర్షులు, సాధకులు, మానవులు, జంతువులూ, ఇంకా జీవరాశుల, నిర్జీవ రాశుల చైతన్యమంతా ఇమిడి ఉండి వాటిని నిర్దేశించే ఓ దివ్య శక్తి జాలం *ఋతంభర.* ఇది కేంద్రీకరించబడి ఒక్కో వ్యక్తిలో స్థిరమైతే అతను తన గురువుతోనూ, దేవతా శక్తితోనూ 'కనెక్ట్ ' అవుతాడు. ఆ సాధకుడి *భ్రూ* మధ్యం, అంటే మూడో నేత్రం ఉండే (కనుబొమ్మల మధ్య) చోట నిండి సృష్టి సంకేతాలు వస్తూ, పోతూ ప్రయాణించడం ప్రారంభిస్తాయి. అతను లేక ఆమె భూత, భవిష్యత్, వర్తమానాలకతీతంగా విషయాలను దర్శించగలరు, వినగలరు, ఏదైనా తెలుసుకోగలరు. *ఆజ్ఞాచక్రం* తెరుచుకుని, అంతర్ముఖమైన జ్ఞాన చక్షువులు విచ్చుకుని, తానున్న చిన్న 'నేను ' అనే వృత్తం నించి బయటికి, తన దైనందిన సాధారణ జీవన పరిధినించి బయటకి వచ్చి, విశ్వవ్యాపక *అసాదృశ శక్తి* అనుభూతి చెందుతూ, అప్పుడప్పుడు ఆ మహా దివ్య కాంతులను అనుభవాన్ని పొందుతూ మళ్ళీ మామూలు పరిధిలోకి వస్తూ ఉంటాడు. అతి మామూలు మాటల్లో ఇది ఒక పైలట్ దిన చర్యలా ఉంటుంది...... కొంత సేపు ఆకాశ విహారం, ఎగరనప్పుడు కొంత ఇహలోకపు విహారం.
ఇలాంటి *ఋతంభర* శక్తి ఏ ప్రత్యేక వ్యక్తులకో కేటాయించింది కాదు. ఇది సృష్టిలో ప్రతి జీవికి సొంతం. వారి వారి స్థాయిని బట్టి వారు వాడుకోవచ్చును, ఆ శక్తిని పెంచుకోవచ్చును. యోగులు కళ్ళు మూసుకుని ఎదైనా చూడాలనుకున్నప్పుడు ఆ దర్శనాన్ని అందించే ప్రజ్ఞ ఋతంభర. ఎక్కడో ఉన్న పుత్రిక ఏడిస్తే నిద్రపోతున్న తల్లిని లేపి ఏదో జరుగుతోందని తెలిపే శక్తి ఋతంభర. అన్నిటిని మరిచి తాదాత్మ్యతతో ఇష్ట దేవత జపం చేస్తున్నప్పుడు ఆ దేవత వచ్చిందని తెలిపే సూచనలందించే నిశ్శబ్ద శక్తి ఋతంభర.
మానవ శరీరంలో నరనరమూ, చర్మమూ, అణువణువూ ఏకమై ఒక మనిషిగా ఉండి ఎక్కడో కాలి గోటికి దెబ్బ తగిలితే తల దాకా మెదడుకి నొప్పి తెలిసేలా ఎలా 'ఏకత్వం' ఉందో అలాగే సృష్టి అంతటా వ్యాపిస్తూ ఉండే 'తెలివి ' ఋతంభర. నిజానికి ఋతంభరకి ఏ పేరూ లేదు. పేరు పెట్టడం వల్ల దాని గురించి మాట్లాడు కోవడం సులువవుతుంది. పేరు పెట్టడం అయినంత మాత్రాన ఒక విషయం అర్ధమయిపోదు. అర్ధం చేసుకోవడం మొదలవుతుంది. కొత్తగా పుట్టిన బిడ్డకి పేరు పెడితే జీవితం మొదలువుతుంది ఆ పేరు మీద. ఇంకా కధ ఎంతో ఉంటుంది - ఇదీ అలాగే. పేరు తెలియగానే అర్ధం కూడా అర్ధం అవదు. మంత్రం తీసుకోగానే సిద్ధి వచ్చేయదు, సాధన మొదలవుతుంది. సృష్టి బడిలో, అమ్మ వడిలో మళ్ళీ కూచుని యోగి తన తపస్సుని మొదలు పెడతాడు. ఋతంభరని అనేకులు అనేక సార్లు దర్శించారు. ఒక్కో కోణంలోంచి ఒకలా పిలిచారు. అన్నీ కలిపినా ఆ ఋతంభర పూర్తి కాదు. *'డేజా వూ ' (daejawoo)* అంటే ఏమిటి ? *'దివ్య దృష్టి '* అంటే ఏమిటి ? *'ప్రకృతి '* మాట్లాడడం అంటే ఏమిటి ఇలా ఎన్నో ఇన్నాళ్ళూ ఈ వ్యాసాల్లో కొద్ది మాటలు స్పృశించాం. అన్నీ కలిపినా, ఆ దివ్య శక్తిని ఎలా చెప్పలేవో అలాగే ఋతంభరనీ!
కొందరు *ఋతంభర* ని *'ఆకాషిక్ రికార్డ్స్'* గా భావిస్తారు. కొన్నిసార్లు మనం మన 'గోల' తగ్గించి *తపో తలంలో* వింటే వినిపించే సంగీతం *ఋతంభర*. మన చలనాలని తగ్గించి సృష్టి చలనాలని అర్ధం చేసుకోవడం మొదలు పెడితే కలిగే అవగాహన, కనిపించే చిన్ని, సూక్ష్మ తంత్రులు - సంఘటనలకి వెనకాల, ఆలోచనలకి అవతల అపుడపుడు స్పష్టంగా కనిపించే తంత్రుల్లా *ఋతంభర*. ఈపని చెయ్యొద్దు, అది చెయ్యి అని మంచి మార్గంలో నడిపిస్తూ మనలోంచే మాట్లాడే దక్షిణామూర్తిలా *ఋతంభర*
మా మాష్టారిని అడిగాను, అసలు *ఋతంభర* అంటే ఏమిటి అని.....? ప్రతి పదానికి మనకి అర్ధమయ్యే అర్ధం వెనకాల అర్ధం వెనకాల ఒక మూల తత్వం ఉంటుంది. (దీని గురించి నిజంగా జరిగిన ఓ కధ చెప్పాలి) అది చిత్రంగా ఉంటుంది. ఆ తలంలో జవాబు చెప్పారు ఆయన. *ఋతంభర* అనేది ఇంగ్లీషులో *'రిథం '* అంటాం కదా! దానికి సంబంధించినది అని. *రిథం* అనేది కంపనాన్ని (వైబ్రేషన్) సూచిస్తుంది. అది తరంగాలని సృష్టిస్తుంది. అవి ప్రయాణించి మన చెవిని చేరితే అవి మన వినికిడి పరిధిలో పడితే, మన చెవులు విని, మెదడు అర్ధం చేసుకుని చెపుతోంది, ఇదీ సంగతి అని. ఇవి విద్యుదయస్కాంత తరంగాలైతే కాంతి అంటున్నాం. చూస్తున్నాం. అంటే మన చూసినా విన్నా అన్నీ తరంగాలే. అన్నీ *రిథం* జనితాలే! మనసుతో ఆలోచించి, మెదడుతో దానికి రూపాన్ని, భాషని ఇచ్చి ఇంకోళ్ళ మెదడుకి శబ్ద తరంగాలుగా పంపుతున్నాం. ఈ పనంతా మెదడు నించి మెదడుకి 'లాజికల్ ' గా జరుగుతుంటే అది ఆలోచనల మార్పిడి. చిత్రమేమంటే *ఋతంభర* మనసు మాట్లాడే ప్రక్రియ. మనసుతో వినాలి. మనసు ఇంద్రియంగా ఆలోచనలని 'ప్రోసెస్ ' చెయ్యాలి. బుద్ధి వేరు, మనసు వేరు (అందుకే హస్త సాముద్రిక శాస్త్రంలో *లైన్ ఆఫ్ మైండ్* వేరు, *లైన్ ఆఫ్ హార్ట్* వేరు - *ఋతంభర* వినాలంటే హార్ట్ పూర్ణత్వం చెంది ఉండాలి, మీకు తెలుసు నేను చెప్పేది భౌతికమైన హృదయం కాదు అని). మనసుకి చేరే ఈ ప్రకంపనాలు, మన మూల తత్వమైన సృష్టి కర్తతో అనుసంధానంలో ఉంటాయి. ఇవి హృదయ స్థానమైన అనాహత చక్రానికి చెందినవి గా చెప్పవచ్చు (అందుకే తల్లి శిశువుతో తన హృత్ స్పందన వినిపించే ఎడంవైపు ఉంచి పడుకుబెడుతుందా?). మనసు పూర్ణత్వాన్ని చెందే కొద్ది సాధకుడి *ఋతంభర* ఉన్నత స్థితిని చేరి శబ్దం అక్షరాలుగా మారే విశుద్దిని దాటి మహా జ్ఞాన త్రిపురము, 'మహా కాళేశ్వర ' స్థానము, అతీంద్రియ శక్తికి ఉన్నత సోపానము ఐన ఆజ్ఞా చక్రాన్ని చేరి అక్కడినించి సంకేతాలు పంపడం, తెలుసుకోవడం చేయగలుగుతాడు. కనుబొమ్మల మధ్య ఉన్న అజ్ఞా చక్రంలో నామము, విబూది, కుంకుమ పెట్టుకున్నప్పుడల్లా ఆ శక్తిని ప్రేరేపిస్తున్నామన్న మాట............

Comments
Post a Comment