సజీవ యోగి maha yogi barfani dadaji - Vishwagurunidhi

                      శ్రీ  బరఫని దాదాజి సజీవ యోగి
barfani dadaji

                          barfani dadaji

Siddharth grandhi with barfani dadaji

Siddharth grandhi with Himalayan yogi

సజీవులు.227 సంవత్సరాలు వీరికి.
వీరు హిమాలయాల్లో 40 సంవత్సరాలు కైలాస,మనసా సరోవరం తపస్సు చేయగా మొత్తం శరీరం మంచుతో కప్పబడి పోయింది. అందుకే వీరికి బరఫని(మంచు) బాబా గా పేరు వచ్చింది.
రాజరికాపు వంశంలో1792 సంవత్సరం లో దీపావళి రోజు ఉత్తర ప్రదేశ్ లో గంగా నది వడ్డు న డోది ఖేడా గ్రామంలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు సంత్ ధుని వాలా దాదా గారికి శిష్యులు. పిల్లలు లేకపోవడంతో వీరు దాదా గారిని ఆశ్రయించారు. దాదా గారి అనుగ్రహముతో శ్రీ బరఫని బాబా గారు జన్మించారు. వీరికి 8 వ సంవత్సరం లో ధునివాలా గారి దగ్గరకు ఆశీస్సులకోసం తీసుకెళ్లారు. అక్కడ సంత్ శ్రీ అర్జున్ దాస్ మహరాజ్(అయోధ్య)గారు కొద్దీ రోజులుగా ప్రవచనం చెప్తున్నారు.శ్రీ దునివాలా దాదా వీరిని శ్రీ అర్జున్ దాస్ బాబా ని ఆశ్రయించి,సేవించమన్నారు.వారిని సేవించి వారితోనే  దేశ పర్యటన చేసారు.తర్వాత ఆయుర్వేదం, గణితం,వేదాలు,ఉపనిషత్తులు అన్ని శ్రీ కేలా బ్రహ్మచారి (వారాణసి)గారి దగ్గర నేర్చుకొని మరలా  హిమాలయాల కు తపస్సు కు వెళ్లి పోయారు.  టిబెట్,నేపాల్,కొన్నిచోట్ల తపస్సు చేసి కైలాస, మానస సరోవరం దగ్గర ఉండి, తరువాత జ్ఞానగంజ్ దగ్గర, ఫూలేరి బాబా పరమహంస దగ్గర ఆధ్యాత్మిక సాధన చేసి 1930 సంవత్సరం లో చ శరీరం వృధాప్యం చెందటం తో కాయ కల్ప విద్యతో మరల వృధాప్యం పోగొట్టుకొని 1962 లో 32 సంవత్సరల తర్వాత హిమాలయాల ను వదిలి అమర కంఠక్ గుడిలో స్థిరపడ్డారు.సాయిబాబా,శ్రీ.దునివాలా దాదా,వీరు కలిసి సింధూ, కరాచీ,పంజాబ్ ప్రాంతాల్లో పర్యటించారు .సాయి నాధుడు గొప్ప సిద్ధ పురుషులు అని,సాయి నాధుడు ఎక్కడ ఉన్నా  ధుని వాలా దాదా తో కలిసి తప్పక ధుని నిర్వహించేవారుఅని తెలిపారు..వీరిని చిన్నప్పుడు చుసిన వారు, చూసిన వారు వృద్దులై నప్పటికి,దాదాజి గారు అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పటికి  అలాగే ఉన్నారు అని అన్నారు.













Comments