మానవ విద్యుదయస్కాంత శక్తి – గ్రౌండింగ్

మానవ విద్యుదయస్కాంత శక్తి – గ్రౌండింగ్

అనాదిగా మన పెద్దలు మన పూర్వులు పాదరక్షలు కేవలం అవసరమైనప్పుడు మాత్రమె వాడి, మామూలు సమయాల్లో వట్టి పాదాలతో నడవమని చెప్పేవారు. ఇవి తప్పక పాటించాలని గుడులలో, తీర్ధాలలో, నదీ సముద్ర స్నానాలలో ఇంట్లో కూడా పెరట్లో తులసికోట దగ్గర, గృహం లోపల, పూజా గృహంలో ఇలా ఎన్నో చోట్ల తప్పక barefoot అంటే వట్టి కాళ్ళతో ఉండాలి అన్న నియమం ఏర్పాటు చేసారు. రాను రాను ఆధునిక యుగంలో మనకు పాదరక్షలు, షూలు, ఇతరత్రా వేసుకోక అసలు ఉండడం మానేశాము. కొందరైతే ఇంకొక అడుగు ముందుకేసి అసలు ఇళ్ళల్లో కూడా చెప్పులు వాడుతూ, ఎక్కడా కూడా పాదం కటిక నేలపై మోపక వయ్యారాలు పోతున్నారు. విదేశాలలోని వారైతే సరేసరి. అక్కడ కాలికి మట్టి అంటడం లాంటిది చాలా అరుదు. పాదాలకు రక్షలు వేసుకొని వారిని అనాగరికులుగా ముద్ర వేసిన వారే కొన్ని రకాల జబ్బులు తగ్గాలంటే ఎలా అయితే సూర్యరశ్మి నుండి విటమిన్ D వస్తుందో పంచభూతాలను అన్నింటినీ స్వచ్చంగా ఆస్వాదిస్తే ఇమ్మ్యూనిటి పెరుగుతుందని, భూమి మీద వట్టి పాదాలు ఆన్చడం వల్ల విటమిన్ “G” వస్తుందని నేటి పరిశోధనలలో కనుక్కున్నారు. దీనినే “Grounding” ( గ్రౌండింగ్) అన్న పేరుతో ప్రచారం చేస్తున్నారు.

గ్రౌండింగ్ తాలూకు పరిశోధనలో వారు శాస్త్రీయంగా ప్రతీ మనిషికి కొంత voltage ఉంటుందని, దాన్ని మనం పాదాలను insulate చేసుకున్న కొద్దీ ఆ potential పెరుగుతూ పోతుందని, దాని వలన కొన్ని కొన్ని సమస్యలు వస్తాయని తేల్చింది. తార్కికంగా ఆలోచిస్తే మనలో ప్రతీకణం కూడా కొంత మిల్లివోల్ట్ విద్యుదయస్కాంత శక్తితో వుంటుంది. ఇలాంటి కొన్ని కోట్ల కణాలతో తయారయిన మన శరీరం కొంత విద్యుత్ potential వుంటుంది. కాలానుగుణంగా మనం వేసుకున్న బట్టల వలన, మరి కొన్ని వాటి వలన ఆ శక్తి పెరుగుతూ వుంటుంది. ఇప్పటికీ మనకు చలికాలంలో దేన్నైనా లోహాన్ని కానీ కుర్చీలను కానీ ముట్టుకుంటే static తగిలి ఒక షాక్ రకంగా తగలడం అందరికీ అనుభవమే. మన శరీరంలో ఈ potential difference వుంది కాబట్టే మనకు ECG, EEG, scan వగైరా మనం చెయ్యగలుగుతున్నాము. మనం భూమికి ఎంత పైకి ఉంటామో, అంత voltage పెరుగుతూ వుంటుంది. ఒకానొక స్టడీ ప్రకారం మనం రెండవ అంతస్తులో ఉన్ని వస్తువులమీద పడుకుంటే కనీసం మనం భూమికన్నా 2800 వోల్ట్ తేడా లో ఉంటాము. గ్రౌండింగ్ అంటే మన శరీరాన్ని భూమికి వున్న voltage కి సమానంగా చేసుకోవడం. దీనివల్ల antioxidants మన వంటిలోకి సరఫరా అయ్యి మన ఆరోగ్యాన్ని నియంత్రిస్తాయి అని వారి పరిశోధన. భూమికి వట్టి కళ్ళతో తాకడం వలన భూమి నుండి కావలసినన్ని ఎలేక్ట్రోన్స్ మన శరీరంలోకి ప్రవేశ పెట్టబడతాయి. కొన్ని కొన్ని దీర్ఘకాలిక రోగాలు పూర్తిగా నయమౌతాయని వారు తేల్చారు.

మనకింద ఉన్న భూమి నెగటివ్ పోటేన్శియల్ తో వుంటే మన పైన ఉన్న ఐయనోస్ఫియర్ పాజిటివ్ పోటేన్షియల్ తో వుంటుంది. మధ్యలో మనం ఎంత భూమికి దూరం అవుతామో, మనలో మనం అంత పాజిటివ్ పోటేన్షియల్ పెంచుకుంటూ పోతాము. దీనివల్ల కొన్ని రోగాలకు కారణం అవుతాయి. అదే గ్రౌండింగ్ చెయ్యడం వలన పరిశోధన చేసినవారిలో కొన్ని అద్భుతమైన లక్షణాలు కనబడ్డాయిట. నిద్ర క్వాలిటీ పెరగడం, తద్వారా స్ట్రెస్ తగ్గడం, కండరాలు పట్టేయ్యడం తగ్గడం, చాలా బాధాకరమైన నొప్పులు తగ్గడం, cortisol ఎక్కువ తయారయ్యి స్ట్రెస్ తగ్గడం, నెర్వస్ సిస్టం బాలన్స్ అవ్వడం, గుండె సరిగ్గా కొట్టుకోవడం, దెబ్బ త్వరగా మానడం, వాపులు తగ్గడం, రక్తం పలుచబడడం, మన శరీరంలో నీటి సాంద్రత సరిగ్గా వుండడం లాంటి లక్షణాలు నిరూపింపబడ్డాయి. వాత పిత్త లకు సంబంధించిన రోగాలు నయమౌతాయని మన ఆయుర్వేదం ఎప్పటినుండో చెబుతూనే వుంది. ఇది నేడు మనలో ఉన్న విద్యుదయస్కాంత శక్తి ద్వారా నిరూపించారు, కాబట్టి మనలోని హేతువాదులు కూడా ఇప్పుడు నమ్ముతారు. మన పాదాలలో మన శరీరానికి సంబంధించిన నాడీ వ్యవస్థ వుందని ఆయా ప్రదేశాలలో ఒత్తిడి చెయ్యడం వలన, acupressure వలన, గ్రౌండింగ్ వలన శరీరంలో ఎన్నో రోగాలు పోతాయంటే మాత్రం మనవారు నమ్మరు. అది కూడా నిరూపించే రోజు ఎంతో దూరంలో లేదు.

మనకు ఇదే విషయం ఎన్నో రకాలుగా చెప్పారు. యోగాసనాలు వేసేటప్పుడు తప్పక చెప్పులు లేకుండా చెయ్యడం వలన మన శరీరంలో ఉన్న చెత్త voltage మొత్తం గ్రౌండ్ అయి యోగా చేసినవారు ఆరోగ్యంగా వుండడం కద్దు. ఇంకా పాశ్చాత్త్యులకు తెలియని ఎన్నో విషయాలు మనకు చెప్పి వున్నారు. నేలపై కూర్చునేటప్పుడు, ధ్యానం, తపస్సు, పూజ చేసేటప్పుడు తపక ఆసనం వేసుకోవాలని చెబుతోంది. మనకున్న చక్రాల ద్వారా మన ఎనర్జీ అనవసరంగా గ్రౌండ్ అవుతున్నదని మన ఋషులు మనకు చెప్పారు. అంతేకాదు, మన రేతస్సు ఊర్ధ్వప్రయాణం చెయ్యడానికి చేసే మన తపస్సులకు తప్పక వాటికి చెప్పిన ఆసనాలు వేసుకునే కూర్చోమని పురాణాలు ఘోషిస్తున్నాయి. ఒక సిల్క్ గుడ్డ, కుశ ఆసనం, తపస్సు చేసేవారికి జింక, పులి చర్మాలు, ఇతరత్రా చెప్పడానికి ఇదే కారణం, కానీ వాళ్లింకా ప్రూవ్ చెయ్యలేదు కాబట్టి వినని వారు కొందరు ఉంటారు. మన దేహంలో తలవైపు నార్త్, కాళ్ళవైపు సౌత్ pole వుంటాయి, కాబట్టి భూ ఉత్తరం వైపు తల పెట్టుకోకు నీకు హాని అని చెప్పాయి, అలా చేస్తే నిద్ర సరిగా పట్టదని, శాస్త్రీయంగా ఇప్పుడు ప్రూవ్ చేస్తున్నాం కానీ అప్పుడు అందరికీ పాటించేలా ఉత్తరం వైపు తల పెట్టుకున్న జీవి తల తీసుకురమ్మని శివుడు ఆజ్ఞాపించినా, దక్షిణంవైపు యమ స్థానం అటువైపు కాళ్ళు పెట్టుకుని పడుకుంటే యమాగ్రహం అని ఎన్నో కారణాలు చెప్పినా దానిలో ఉన్న శాస్త్రీయ దృక్పధం మనం అర్ధం చేసుకోవాలి. పెద్దల మాట చద్దన్నం మూట. వింటే బాగుపడతాం, లేదంటే అంతా కాలాక ఒక తెల్లవాడు రీసెర్చ్ చేసి కనుక్కుంటే అవును కాబోలు నిజం సుమా అని నాలిక కరుచుకుని అప్పటినుండి మొదలుపెడతాం. కాదంటారా?

Comments