శత్రునాశనం కొరకు, భార్యా వియోగం తొలగుటకొరకు దర్శించాల్సిన క్షేత్రం - Vishwagurunidhi

 శత్రునాశనం కొరకు, భార్యా వియోగం తొలగుటకొరకు దర్శించాల్సిన క్షేత్రం - Vishwagurunidhi
శత్రునాశనం కొరకు, భార్యా వియోగం
తొలగుటకొరకు దర్శించాల్సిన క్షేత్రం
శ్రీఆది కుంభేశ్వరాలయం. ఈ ఆలయం
తమిళనాడు కుంభకోణంలోని ప్రధాన ఆలయం.
అతిప్రాచీనమైన ఈ ఆలయం కావేరీనది అరసలార్‌
నదుల మధ్యలో ఉంది. శైవులు దర్శించవలసిన
దేవాలయాలలో ముఖ్యమైనది. స్వామివారు
కుంభేశ్వరలింగం, అమ్మవారు మంగళాంబికాదేవి. 51
శక్తి పీఠాలలో ఒకటిగా భక్తులు నమ్ముతారు.

శివలింగం పైభాగం కొద్దిగా వంగి ఉన్న
కారణంగా కుంభకోణం అనే పేరు వచ్చింది. (కుంభం
అంటే కుండ, కోణం అంటే వంపు.)  గరుక్మంతుడు
అమృతభాండమును తీసుకుని వెళుతుండగా ఈ
ప్రాంతంలో ఒక అమృతపు చుక్క జారి పడిపోతుంటే
శివుడే స్వయంగా ఇక్కడి ఇసుకతో ఒక కుండను
తయారుచేసి అందులో ఆ జారే అమృతబిందువు
పడే విధంగా చేసి అందులో స్వయంభులింగంగా
ఉండిపోయాడు. ఆ కుండ చేసినపుడు పైభాగం కొద్దిగా

 వంగినట్టుగా వచ్చిన కారణంగా కుంభకోణం అని
పేరు వచ్చింది.

రావణుడు సీతాపహరణం చేసిన తర్వాత
శ్రీరాముడు సతీవియోగ దుఃఖంతో ఇక్కడికి వచ్చి
స్వామిని ఆరాధించి వెళ్ళి తన శత్రువైన
రావణసంహారాన్ని చేసాడని పురాణ సారాంశం.
గంధద్రవ్యాలలేపనం తప్ప ఇక్కడ స్వామికి
నిత్యాభిషేకాలు జరగవని చెబుతారు.

Comments