గురువులు చెప్పిన ప్రయోగం ,శత్రువుల నుండి రక్షణ కోసం అతి శక్తి వంతమైన ప్రయోగం :
శత్రువుల నుండి రక్షణ కోసం ప్రయోగం :
స్వార్థపూరిత మైన లోకంలో, మానవునికి....ప్రత్యక్షంగానూ,పరోక్షంగానూ.... శతృవులు ఏర్పడుతుంటారు. రకరకాల బాధలు కల్పిస్తూ ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో..... నిండుగా నవ్వలేక, తనివితీరా ఏడవ లేక, చావలేక, బ్రతుకలేక....అయోమయ స్థితిలో పడి పోతుంటారు.
ఒక్కొక్కసారి మన శత్రువు ఎవరో తెలియదు. అలాంటి గుప్త శత్రువుల భయం మరీ అధికంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి అతలాకుతలమై పోతుంది. తప్పుడు కేసుల్లో ఇరుక్కుపోయి ఆస్తుల దురాక్రమణకు గురి అవుతాము. అధికార వర్గం మనకు వ్యతిరేకం అయిపోతుంది ఇలాంటి సమస్త ప్రతికూల పరిస్థితుల పరిష్కారానికి.... ప్రసిద్ధ తంత్ర డాక్టర్ నారాయణ దత్త శ్రీమాలి "నృసింహ సాధన" సూచిస్తున్నారు. ఈ సాధన , వ్యక్తిగతంగానూ, ఏకాంతంగానూ చేయవచ్చు. సామూహికంగా చేయవచ్చు. కాని సాధన వల్ల ఫలితం అధికంగా ఉంటుంది.
ఆ సాధనా విధానం ఇది.
చతుర్దశి నాడు ఈ సాధన చేయాలి. ఎర్రని వస్త్రాలు ధరించాలి ఎర్రని ఆసనంపై కూర్చోవాలి. రాత్రి రెండవ ఝాము ప్రారంభంలో పడమర(పశ్చిమం) వైపు తిరిగి కూర్చోవాలి. ఈ సాధనకు నృసింహ యంత్రం, నరసింహ మాల అవసరం.
యంత్రాన్ని కుంకుమ, అక్షతలతో పూజించాలి. తైల దీపం వెలిగించాలి. తరువాత ఈ క్రింది మంత్రాన్ని తీవ్రస్వరంతో.....సింహ గర్జన లాంటి స్వరంతో ఒక మాల జపించాలి.
మంత్రం :
ఓం నృం నరసింహాయ శతృభుజబల విదీర్ణాయ నమః
మంత్ర జపవేళ.... కొంతమంది సాధకులకు......ఆవేశం, ఉత్తేజం, తీవ్ర క్రోధం.... కలగవచ్చు. అవి సఫలతను సూచించే శుభ లక్షణాలు.
ఏ శత్రువైన లేక ప్రతికూల పరిస్థితైనా తెలిస్తే.... ఆ శత్రువు పేరు లేదా పరిస్థితిని కాగితంపై..... సింధూరం లేదా కాటుకతో రాయాలి. ఈ కాగితం యంత్రం క్రింద ఉంచాలి. మంత్రజపం అనంతరం కాగితం,యంత్రం, మాలలను .....ఎర్రని వస్త్రంలో కట్టి నది లేదా చెరువులో వదిలివేయాలి.
ఈసాధన, సామూహికంగా చేసేటప్పుడు..... ప్రతి సాధకునికి విడివిడిగా యంత్రం,మాల అవసరం అవుతాయి. సింహం ప్రశాంతంగా ఉంటుంది. కానీ దానికి క్రోధం కలిగితే ?!
సరిగ్గా ఇలాంటి లక్షణం నృసింహ సాధకుని లోనూ ఏర్పడుతుంది. ధీరపురుషులు అకారణంగా ఎవరికీ హాని కలిగించదు కదా! జీవితంలో అసలైన ఆనందం ఎప్పుడు వస్తుంది.
సాధకుని లో అత్యంత సామర్థ్యం ఏర్పడినప్పుడు. ఆపదలను ఒక్క హుంకారంతో నిర్మూలింప జేసుకున్నప్పుడు. ఒక్క దృష్టి పాతంతో విపత్తులను పారద్రోల గలిగినప్పుడు ఆనందం లభిస్తుంది. అది నృసింహ సాధన వల్ల లభిస్తుంది అంటారు శ్రీ గురువులు.

Comments
Post a Comment