నాగుల చవితి అసలు రహస్యం , నాగ లోకం కి మానవ లోకం కి ఉన్న సంబంధం - Vishwagurunidhi

నాగుల చవితి అసలు రహస్యం , నాగ లోకం కి మానవ లోకం కి ఉన్న సంబంధం - Vishwagurunidhi
మన పాల పుంతలో ఏడు గ్రహాలు పద్దెనిమిది చంద్రుళ్లు ఉన్ననక్షత్ర మండలం ఒకటి ఉంది, ఈ గ్రహాల్లో ఒకటి సర్పలోకం, పరిపక్వత చెంది విజ్ఞాన పరంగా బాగా వికసించిన సర్పాలు ఆ లోకంలో నివసిస్తూ ఉంటాయి, ఈ పాముల్ని నాగ దేవతలు అని అంటారు, నాగులకి మహా నాయకుడు అయినా ఐదు పడగల బంగారు సర్పాన్ని - మన సనాతన భారతీయ గ్రంధాల్లో అనంతుడు గా వర్ణించారు.
వేలాది ఏళ్ళ క్రితం మానవజాతి ఇంకా మానసిక వికాసపు బాల్య దశల్లో ఉన్నపుడు సర్పలోకం తో సత్సంబంధాలు ఉండేవి, విజ్ఞానవంతులు, శ్రేష్ఠులు అయిన నాగులు భూమి మీదకు వచ్చి మానవుల మధ్య గడుపుతూ, మానవులకు విజ్ఞానాన్ని భోదించి వారిని విద్యావంతులను చేసే వారు, అందుకే సనాతన నాగరికతల్లో మానవులు నాగారాధనం చేసి వారి ప్రతిమలను పూజించడం చేసే వారు, అసలు మానవాళీకి  కుండలిని శక్తి రహస్యాన్ని బోధించింది నాగులే, కుండలిని  శక్తికి ప్రతీక కూడా సర్పమే, అష్టాంగ యోగాన్ని  లోకానికి ఇచ్చిన పతంజలి కూడా నాగుడే, అతడిని సగం పాముగా సగం మనిషిగా శిలా ప్రతిమగా ఆరాధించడం మనం చూస్తూ ఉంటాం.
ప్రాచీన ఈజిప్ట్ నాగరికతలో ఫారో తల మీద ఉండే సర్పం, ఆది దేవుడైన శివుణ్ణి మేడలో ఉండే పాము,,,, ఇవన్నీ నాగలోకం ఎంత ఉన్నతమైనదో మనకు తెలియచేస్తాయి.
✒అయితే మానవ జాతి నాగుల సహాయం తో శక్తి వంతులు అవుతుండగా వారిలో స్వార్ధపరులు, దుష్ట స్వభావులు అయినా మానవులు భౌతికంగా, ఆద్యాత్మికం గా, మానసికంగా  ఎంతో ఉన్నతులు అయినా నాగుల ప్రాబల్యాన్ని చూసి భయపడి వారు మానవాళికి చేసిన మేలు మరచి, వారి వద్దనుండి పొందిన శక్తులను వారిపై వ్యతిరేకంగా ఉపయోగించడం మొదలుపెట్టారు.

నాగుల జాతి పై సామూహిక సంహారాలు చేసారు, ఇది తెలిసి నాగుల ప్రభువు వారి జాతిని తమ లోకానికి రమ్మని ఆజ్ఞాపించాడు, వారిలో కొంతమంది తమ లోకానికి వెళ్లిపోగా,,,, మానవ జాతిపై కరుణ దయతో వారిలో కొంతమంది నాగుల ప్రభువు అజ్ఞాని ధిక్కరించి భూలోకం లో ఉండిపోయారు. ఎప్పటికి వారు మానవ జాతిలో ఉన్న యోగ్యులు, శ్రేష్ఠులు, మహాత్ములకు మాత్రమే కనిపించి విజ్ఞానాన్ని పంచుతున్నారు నేటికీ....

ఇప్పటికి ఈ ప్రపంచం లో ఉన్న నాగులు,  సర్ప జాతులు భూమిపై మిగిలిన వాళ్లు వాళ్ళ సంతతే, రక్త సంబధీకుల కలయిక వల్ల కలిగిన సంతానం కారణంగా నాగులు వారి శక్తులను కోల్పోయి,,, వారి పూర్వీకుల గొప్ప లక్షణాలను, విజ్ఞానాన్ని కోల్పోయారు...

షిర్డీ సాయి బాబా మూడు రోజులు శరీరాన్ని వదిలి వెళ్ళింది సర్ప లోకం లో కలహాన్ని తీర్చి శాంతిని నెలకొల్పడానికి అని భారతీయ సనాతన యోగుల ద్వారా రహస్యం బయటకు తెలిసింది.....

Comments