సిద్ధక్షేత్రాల్ని కొంతమంది గురువులు క్యాటలైజ్‌ చేశారు. - Vishwagurunidhi

 సిద్ధక్షేత్రాల్ని కొంతమంది గురువులు క్యాటలైజ్‌ చేశారు.
దాని శక్తిని అనేక రెట్లు పెంచారు. ఉదాహరణకి మన ఆంధ్రాలోని
తిరుమల కొండల్లోనే మూడొందల అరవై సిద్ధక్షేత్రాలున్నాయి. రోజుకి
ఒక్కొక్క సిద్ధక్షేత్రాన్ని దర్శించుకుంటూ సాగిపోజే సంవత్సరం పడుతుంది
తిరుమలయాత్ర. సాధారణంగా ఒక్కో సిద్ధ క్షేతంలో ఒక్కో టెక్నాలజీని
బుషులు ఏర్పాటు చేశారు. అన్ని చోట్లా ఒకే ఫలితం రాదు. ముఖ్యంగా
ఈ సిద్ధక్షేత్రాల్లో మన షట్చక్రాలు యాక్టివేట్‌ అవుతాయి. ఆ క్షేత్ర స్ధల
మహత్యం మనకు తెలిసినా తెలియకపోయినా మన వెన్నుపూస లోని
శక్తులు మేలుకుంటాయి. ఆయా క్షేత్రాల్లో బుషులచేత నిక్షిప్తం
చేయబడిన శక్తి మన కోరికలు తీరుస్తుంది. అనారోగ్యాన్ని పోగొడుతుంది. అలాంటి సిద్ధక్షేత్రాలకు మనం రానూ పోనూ బండి మాట్లాడు
కుని వెళ్తుంటాం. అది పరమ మూరకత్వం,
పరమ దయామయులైన షిరిడీసాయి
 షిరిడీని ఓ అద్భుతమైన
(వైద్యశాలగా) శానిటోరియంగా రూపొందించారు. ఆయన చివరి
ఏనిమిది సంవత్సరాల జీవితం పరిశీలిస్తే అర్ధమౌతుందది. షిరిడీలోని
చావడి వద్దకు ప్రతి రాత్రీ వెళ్ళి నిద్రపోయేవాడాయన, మూలాధారానికి
(ప్రతీక అది. మన అలవాట్లు, బలహీనతలు అక్కడ మనం పోగొట్టు
నోవచ్చు. ద్వారకామాయి స్వాధిష్టానచక్రానికి నమూనా, మన కోరికలు,
అభిరుచులు అక్కడ తీరిపోతాయి. అదే మణిపూరక చక్రముకూడా,
అక్కడో తిరగలి ఉంటుంది. అక్కడే అగ్ని ఉంది. ధుని. సమస్త రోగాలూ అక్కడ నయమౌతాయి.

అక్కడ అరవై సంవత్సరాలపాటు కదలకుండా కూర్చున్నాడా
మహనీయుడు. రాబోవు అతి సమీప కాలంలో షిరిడీ ఓ అద్భుతమైన
శానిటోరియంగా రూపొందుతుంది. ఓ అత్యద్భుత రోగ నివారణ
కేంద్రంగా ప్రసిద్ధికక్కుతుంది. పుట్టెడురోగాలతో వచ్చిన పరమ వ్యాది
గ్రనుడైనా సరే అలా షిర్డిలో తిరిగేసి సమస్త రోగాల్నీ వదిలించేసుకుని
చక్కా వెళ్ళిపోతాడు. మనమంతా అతి సమీప కాలంలో ఈ విషయాన్ని
స్పష్టంగా చూస్తాం.

మనకున్న పొట్టకు సంబంధించిన సమస్తరోగాలూ, అనేక
సమస్యలు ద్వారకామాయిలో కూర్చుంటే మటుమాయమైపోతాయి.
అలాగే మానసిక ఆందోళనలు, హిస్టీరియా, పిచ్చి, జీవితంలో స్థిరత్వం
లేకపోవడం, డి(పెషన్‌, అశాంతి, దిగులు ఉన్న వాళ్ళు గురుస్థానం
దగ్గర ఎంతో లాభం పొందుతారు. అది ఆజ్ఞాచక్రం. నందబీపం, విశుద్ధి
చక్రానికి సంబంధించిన శక్తి కేంద్రమది. వాక్సుద్ధి కోసం, వాక్‌సిద్ధి
ఆశించేవారికి మంచి ఫలితాలొస్తాయి. నత్తి, మూగ వంటి వాటిని
అక్కడ సరిజేసుకోవచ్చు. సహజంగా కుండలినీ శక్తి పురుషుల్లో కంటే
స్రీలలోనే ఎక్కువుంటుంది. కనుక స్త్రీలు చావడికి వెళ్తే ఆ శక్తి ఎక్కువైతే
వాళ్ళకి చికాకులాస్తాయని ఆడవాళ్ళు చావడికెళ్ళాల్సిన అవసరం
లేదన్నారు. అంతేగానీ అగౌరవంతో కాదని గ్రహించాలి. లెండి వనం
అనాహతొనికి సంబంధించినది. అక్కడ కళ్ళకి సంబంధించిన, చర్మ
రోగాలకి సంబంధించిన వాటిని పోగొట్టు కోవచ్చు. ఈ షట్చక్రాలన్నీ
కలిసే శక్తికేంద్రం సాయి సమాధి మందిరం. సహస్రానికి సంబంధించినది.
“నేను లేకపోయినా నా సమాధి మాట్లడుతుంది” అనడంలో సాయి
ఉద్దేశం “నా శక్తినక్కడ నింపిఉంచాను. ఉపయోగించుకోగలిగితే ఉపయో
గించుకో, మన్నాడాయన. ఈ విషయం ఎందరు గ్రహించారో ఆయనకే
తెలియాలి,







Comments