శ్రీ భువనేశ్వరి మాత - Vishwagurunidhi

                   శ్రీ భువనేశ్వరి మాత



భువనేశ్వరి అనగా  పార్వతీదేవి. భువనేశ్వరీ పరమమైనది, శాంతిమయమైనది. కాళి, తార, సుందరీల ప్రకాశమునకు భువనేశ్వరి తెరవంటిది. దశమహావిద్యలు, వామ, కౌళ సంప్రదాయములకు చెందినది. వామ, కౌళములు సిద్ధపురుషులకే గాని సామన్యులకు కాదు, పరమదేవతా అనుగ్రహము పరిపూర్ణంగా పొందాలనుకుంటే సాంప్రదాయ పరంపరాగతంగా వస్తున్న ఆ దేవి యంత్ర, మంత్ర, తంత్ర, పూజా కల్పానాసారము విధి విధానం తెలుసుకొని అర్చించి దేవీ కృపకు పాత్రులు కావలసి ఉంటుంది. మహామాయయైన భువనేశ్వరీదేవి  భువనేశ్వరీ అనగా విశ్వమంతటికి మహారాజ్ఞి.దశమహావిద్యలలో నాల్గవ మహావిద్య శ్రీభువనేశ్వరీదేవి. ఉదయించే సూర్యుడిలాంటి కాంతితో ప్రకాశించే ఈ మాతకు భాద్రపద శుక్లపక్ష అష్టమీతిథి ప్రీతిపాత్రమైనది. ఈ దేవి సంపూర్ణ సౌమ్యస్వరూపిణి. ఈ విద్యను ఉపాసిస్తే ఆ సాధకుడికి మూడో కన్ను తెరుచుకుంటుంది. భూత భవిష్యత్ వర్తమానాలు తెలుసుకునే శక్తి లభిస్తుంది. అంతేకాదు, రాజ్యాధికారాన్ని, సమస్తసిద్ధుల్ని, సకల సుఖభోగాల్ని ఈ దేవి అనుగ్రహంతో సాధకులు పొందవచ్చు

భువనేశ్వరీ బీజం హ్రీం. దీనినే మాయా బీజం అని అంటారు మంత్ర శాస్త్ర పరిభాషలో ‘హృల్లేఖ’ అని అంటారు.

సమస్త భువనాలకు అధీశ్వరియైన ఈ దేవత ఉదయించే సూర్యుని వలె ప్రకాశిస్తుంటుంది. కిరీటం మీద చంద్రకళ మూడు కన్నులు చిరునవ్వు, ఆమెకు అలంకారాలు నాలుగు చేతులలో పాశాంకశాలను వరదా భయముద్రలను దాల్చి ఉంటుంది. ఈమె పరమ శాంతి స్వరూపిణి ‘‘పరమాం శాంతిం కామయ మానో భువనేశ్వరీ ముపాసీత’’. సర్వజీవులు అంతిమంగా కోరేది శాంతి శృంగార వీరాది సమస్త రసాలు స్థాయి భావమును చేరుకోవాలంటే సుప్రకాశానంద చిన్మయమైన శమ స్థితిని పొందాలి. ఆ శమములో ఆనందముంది. ఆ ఆనందం ప్రేమకు లక్షణం. ఆమె సమస్త విశ్వాన్ని ప్రేమతో చూస్తూ ఉంటుంది. అందుకే ఆమెను ఋషులు ఇలా స్తుతించారు.

దయామయమైన ఆమె చూపుల వల్ల భక్తులు కుబేరునితో సమానమైన సంపదలను పొందుతారు త్రిమూర్తులు ఆమె చేతనే సృష్టించబడినారు. బ్రహ్మకు సృష్టి శక్తిని, విష్ణువునకు స్థితి శక్తిని, మహేశ్వరునకు సంహారశక్తిని ఆమె ప్రసాదించింది. త్రిమూర్తులకు అతీతమైన ఒక మహాశక్తిగా భువనేశ్వరిని భావించవలసి ఉంటుంది. తనను ఉపాసించే వారికి ఆమె ఇంద్రియ విజయాన్ని ప్రసాదిస్తుంది. జీవులలోని కామ, క్రోధ,లోభ, మోహ, మద, మాత్సర్యాలు అనే ఏనుగును అంకుశంతో లొంగతీసుకొన్నట్లుగా వాటిని లొంగదీసి శాంతిని ప్రసాదిస్తుంది. హ్రీంకార బీజ రూపిణిగా, మహామాయగా, శక్తిగా, ఏకాక్షరిగాని, త్య్రక్షరిగాని, స్వీకరించి సంప్రదాయ క్రమంలో సాధన చేస్తే భువనేశ్వరీ కరుణ తప్పక కలుగుతుంది.
 హ్రీంకార భీజాక్షరి
హ్రీంమయి దేవి అభయవరద హస్తిని పాశాంకుశ ధారిణి
శ్రీ చక్ర వాసిని,బాల పీఠ అధిరోహిణి
మాతా మత్రు మయీ అమ్రుత మయి ఆనందమయి
అనంతమయీ మాతా కాల కరణి
మాతా దేహీ దేహీ తక్షణం త్రికాల జ్నానం
మాతా దేహీ తక్షణం అష్థ ఐశ్వర్యం
మాతా దేహీ తక్షణం యత్న కార్య సిద్ది
మాతా దేహీ దేహీ వరప్రసాదం దేహి

శివశక్త్యాత్మకమైన 'హ్రీం'మంత్రాక్షరాలన్నింటికితలమానికమైనది.పరమేశ్వరికి అత్యంత ప్రియమైన బీజమిది. జగత్ అంతయూ ఆమె హిరణ్య గర్భంలో ఇమిడినట్లే, తంత్ర మంత్రం సూక్ష్మాలన్నీ హ్రీం బీజంలోనే ఉన్నాయి. ఇది త్రిపుటలకు అధిష్టానం. అండ పిండ బ్రహ్మాండాలకి ఆశ్రయం. 

లలితాత్రిశతి నామాలు, పంచదశి మంత్రాన్ని ఆశ్రయించి చెప్పబడినవి. ఈ పంచదశి మంత్రం పరాశక్తి యొక్క విశిష్ట రూపం. ఈ పంచదశి మంత్రం మూడు ఖండాలుగా ఉంది. 

మొదటిదైన వాగ్భవ ఖండములోని  5 బీజాలలో చివరి బీజం హ్రీం.  రెండవదైన కామరాజ ఖండములోని ఆరు బీజాలలో చివరి బీజం హ్రీం. మూడవదైన శక్తి ఖండములోని నాలుగు బీజాలలో చివరి బీజం హ్రీం.అక్షరానికి 20 నామాల చొప్పున పంచదశి మంత్రంలోని 15 అక్షరాలకు మొత్తం 300 నామాలు చెప్పబడినవి. అవే లలితా త్రిశతి. 

త్రిశతి నామాలకి పంచదశి మహా మంత్రానికి (శ్రీవిద్య) అవినాభావ సంబంధం ఉంది. హ్రీంకారం పంచదశి మంత్రానికి హృదయంగా భావించే బీజం. జీవన గమనం సమస్యలు లేకుండా నడుచుటకు అందరి హృదయాలలో ఆకాశదీపశిఖవలె విరాజిల్లుటకు పరాశక్తి బ్రహ్మ స్వరూపిణిహ్రీం బీజం ఎంతో అవసరం.

మంత్ర శాస్త్రంలో స్త్రీ దేవతలను గురించే చెప్పే మంత్రాలను విద్య అంటారు. పరమేశ్వరిని గురించి చెప్పే విద్య కాబట్టి దీనిని శ్రీవిద్య అంటారు. పరదేవతను గురించి చెప్పే మంత్ర యంత్ర తంత్ర శాస్త్రాన్నే శ్రీవిద్య అంటారు. లలితా సహస్రం యంత్ర మంత్ర తంత్రాలే కాకుండా అనేక రహస్య విషయాలు కూడా నిక్షిప్తమై ఉన్నాయి.

శ్రీ లలితా సహస్రనామంలో కొన్ని కొన్ని నామాలను ఒక సమూహంగా చెప్పటం జరిగింది. దీనికి ఒక ప్రత్యేకమైన విశేషత ఉంది. ఈ ప్రకారంగా వేయి నామాలలో అనేకానేక విశేషాలు పొందుపరచబడ్డాయి. ఉదాహరణకు మొదటి ఐదు నామాలలో పరమేశ్వరి ప్రాదుర్భావాన్ని వివరిస్తే.. ఆ తదుపరి ఆ తల్లి స్వరూపాన్ని.. మరో చోట జగన్మాత సూక్ష్మ రూపాన్ని వర్ణించారు. అదే పంచదశి మహా మంత్రం. ఇంకోచోట శ్రీ చక్రాన్ని వివరించారు.

మరి కొన్ని నామాలలో ఆ పరదేవత యొక్క అర్చనా విధానాలను, ఆచారాలను, చతుషష్టిపూజా విశేషాలను, షట్చక్రాలను వివరించా

రు. అవస్థా పంచకము, చంద్ర విద్య, భానువిద్య, భువనేశ్వరి విద్య, కాత్యాయనీ విద్య, వాగ్వాదినీ విద్య, శివదూతి విద్య, గాయత్రీ మంత్రం, ఆత్మ విద్య... ఈ విధంగా అనేకానేక అంశాలను లలితా సహస్రంలో పొందుపరచబడినవి. ఒక్క లలితా సహస్రాన్ని పూర్తిగా పరిశీలిస్తే శ్రీ విద్య తెలుస్తుంది. అందుకే లలితా సహస్రము శ్రీ విద్యకు సారధి వంటిది.

1 నుండి 10 అక్షరములు గల మంత్రాలను బీజ మంత్రాలు అంటారు. 11 నుంచి 21 వరకు అక్షరాలు గల వాటిని మంత్రములుగా వ్యవహరిస్తారు. 21 మించి అక్షరములు గల వాటిని మాలా మంత్రాలు అంటారు. ఖడ్గములు అంటే స్తుతి వచనాలు అని అర్థం.

అందుకే 21 మించిన అక్షరాలు ఉన్నందునే ఖడ్గమాలగా వ్యవహరిస్తాం. లలితా త్రిశతిలో మూడవ హ్రీం కారాన్ని గురించి చెప్పేటప్పుడు పరమేశ్వరి హ్రీంకారకోశాసిలతా అని స్తుతించబడింది. అసి అంటే ఖడ్గము. అసిలతా అంటే ఖడ్గధారి. హ్రీంకారమనే కోశానికి పరమేశ్వరి ఖడ్గధారి . హ్రీంకారమనే కోశంలోనే ఆమె ఖడ్గము (కత్తి). తన భక్తులకు కలిగే రాగ ద్వేషాలను, అరిషడ్వర్గ వైరులను, బాధలను, దుఃఖాలను పరమేశ్వరి తన ఖడ్గంతో చేదిస్తుంది, తొలగిస్తుంది. అందుకే ఆ తల్లిని శ్రీ దేవి ఖడ్గమాలతో స్తుతిస్తాము.

Comments