దేవాలయం అనగానే గుర్తుకువచ్చేది విమానం/గోపురం. - Vishwagurunidhi

సాధారణంగా మనకు దేవాలయం అనగానే గుర్తుకువచ్చేది విమానం/గోపురం.అవి పిరమిడ్ ఆకారంలోనే ఎందుకుంటాయి?

అని మనలో చాలా మందికి సందేహం కలుగుతుంది.మాములుగా ఉండచ్చు కదా కూడా అనిపిస్తుంది.అసలు ఆలయ విమానం నిర్మాణం అలా ఎందుకుంటుంది?

ఆలయవిమానం పిరమిడ్ ఆకారంలో ఉంటుంది.కాకపోతే ఆ విమానం మీద రకరకాల శిల్పాలను,దేవతావిగ్రహాలను చెక్కబడి ఉంటాయి కనుక మనం అంతగా అది గమనించం.పిరమిడ్ అంటే "మధ్యలో అగ్ని" అని అర్ధం.ఏ ఆకారాన్ని ఆధారంగా/కేంద్రస్థానంగా చేసుకుని శక్తి ప్రసారమవుతుందో అదే పిరమిడ్.ఈజిప్షియన్(egyptian) భాషలో పిరమిడ్ అంటే దివ్యప్రకాశం అని అర్ధం.ఈ పిరమిడ్ కి ఉన్న శక్తి శాస్త్రవేత్తలకు కూడా అర్ధం అవ్వక,దానిని ఆశ్చర్యజనకము,సర్వాతీతము,వివరించడానికి సాధ్యం కానిది" అని వర్ణించారు.

1931లో బ్రిటిష్ శాస్త్రవేత్తల బృందం పిరమిడ్లపై పరిశోధన జరిపింది.రెండూ వేర్వేరు పాత్రలలో అప్పుడే పితికిన పాలు సమానపరిమాణంలో నింపి ఒకదాన్ని గదిలో,ఇంకొకద్నిని పిరమిడ్ కిందా ఉంచారు.

6 రోజుల తరువాత ఈ రెండుపాత్రలను పరిశీలించినప్పుడు,పిరమిడ్ పాత్రలో ఉన్న పాలువిరిగిపోయి "పాలవిరుగు"గాను,నీరుగాను రెండుపొరలుగా విడిపోయాయి.గదిలో ఉంచిన పాలు ఇంత స్పష్టమైన పొరలుగా విడిపోలేదు.అంతేకాదు గదిలో ఉంచిన పాలమీద ఫంగస్ ఏర్పడింది.మరొకరోజు పాలను అలాగే ఉంచారు.పిరమిడ్ బయటున్న పాలపై మరింత ఫంగస్ ఏర్పడింది.పిరమిడ్ లో ఉంచిన పాలపై ఎలాంటి ఫంగస్ లేదు.ఆ పాలను 6వారాలపాటు అలానే ఉంచారు.తెల్లవారితే విరిగిపోయే పాలు,పిరమిడ్ లో అన్నిరోజులు ఉంచినా ఏమాత్రం చెడిపోలేదు.తరువాత అది తోడుకొని రుచికరమైన పెరుగుగా మారడం చూసి పరిశోధకులు ఆశ్చర్యపోయారు.

ఈ విషయం గమనించిన ఇటలి,ఫ్రాన్స్ కు చెందిన పరిశోధకులు ద్రవపదార్ధాలపై(liquids) పిరమిడ్ కున్న శక్తిని విసృతంగా వివరించి,వాటికి అమోఘమైన శక్తి ఉండడం నిజమేనని తెలిపారు.కాఫీ,పళ్ళరసాలు వంటివి దీర్ఘకాలం పిరమిడ్ల క్రింద నిలువ ఉంచడం వలన వాటి రుచి గణనీయంగా పెరుగుతుందని షికార్డి శాస్త్రవేత్త తేల్చిచేప్పారు.

ఇంత గొప్పశక్తి కలిగినవి పిరమిడ్లు,మన ఆలయవిమానాలు..భారతీయులు పిరమిడ్లను చూసి ఆలయవిమానాలను ఆ ఆకారంలో కట్టారనుకుంటే మీరు పొరబడినట్టే.పిరమిడ్ల నిర్మాణానికి ప్రేరేపణ చేసినవి సనాతన భారతీయ సంప్రదాయంలో ముఖ్యస్థానం సంపాదించుకున్న "నిత్యాగ్నిహోత్రం".మరొకటి "శ్రీ చక్రం".ఇప్పటికే అగ్నిహోత్రం మీద పరిశోధనలు జరిగి దాని గొప్పతానాన్ని "ఆధునిక సైన్సు" కూడా అంగీకరించింది."శ్రీ చక్రం" మీద ఎప్పటినుంచో అనేకానేక పరిశోధనలు జరుగుతూనేవున్నాయి."శ్రీ చక్రం" నిర్మాణం చాలా కష్టతరమైనదని,దాని నిర్మాణాన్ని ఆధారంగా చేసుకునే పిరమిడ్ల నిర్మాణం జరిగిందని విదేశిశాస్త్రవేత్తలే దృవికరించారు.మన ముందు ఒక పాత్రలో నీటిని నింపి,"ఓం"కారం ఉచ్చరించడం చేత ఆ నీటిలో ఉన్న పరమాణువులు శ్రీచక్రం ఆకారం సంతరించుకుంటాయని,ఆ నీటికి అమోఘమైన శక్తి లభిస్తుందని tonoscope సహాయంతో జపాన్ కు సంబంధించిన మసరు ఏమొటొ అనే ప్రొఫెస్సర్ నిరూపించారు

Comments