అసలు పుట్టలో పాలు పోస్తే పిల్లలు పుడతారు అనే దాని వెనక సైన్స్* - Vishwagurunidhi

*అసలు పుట్టలో పాలు పోస్తే పిల్లలు పుడతారు అనే దాని వెనక  సైన్స్*


*అసలు పుట్టలో పాలు పోస్తే పిల్లలు ఎలా కలుగుతారనే పెద్ద సంశయము*.

*పంచమి/నాగుల చవితి నాడు* పుట్టలకు పూజ చేయించడం, పాలు పోయడం వంటివి చేస్తే వంశాభివృద్ధి కలుగుతుందని పండితులు అంటున్నారు.

పాము పుట్టలని పాములు ఎర్పరచవు, చెదలు ఏర్పరుస్తాయి.

వాటిలో ఈ పాములు చేరి వానాకాలములో పిల్లలను పెట్టి, వేరే చోటికి వెళ్తాయి.


చెదపురుగు పుట్ట పెట్టేటప్పుడు దాని నోటి నుంచి ఒక ద్రవము వస్తుంది.

ఆ ద్రవము మెత్తటి మట్టినందు కలిసి అది గట్టి పడుతుంది.

ఎంత గట్టి పడుతుంది అంటే వానలు వచ్చినా ఆ మట్టి కరుగదు.

ఈ మెత్తటి మట్టిలో రాయి రప్పలు ఉండవు. ఇదే దీని విశిష్టము.

వానాకాలములో ఈ పుట్టలందు సంచరించు పాముల నుండి విడుదల అగు రేతస్సు, రజస్సు ఈ మట్టిలో కలిసి ఉంటుంది.

పాము గుడ్లు పెట్టి అది పిల్లలను చేయదు.

ఎండ వేడికి అవి పిల్లలగును. ఇది ప్రకృతి నియమము.

ఈ మట్టిలో కలిసిన ఈ పదార్దములు మనము పోయు పాలు, తేనే, వివిధ రకాల ఫలములు కలిసి సువాసనల వెదజల్లును.

ఆ వాసనలు వలన మన శరీరమునందు తగు హార్మోనులు ఉత్పత్తి అయి పిల్లలు పుట్టుటకు దోహద పడుతుంది 

ఆయుర్వేద శాస్త్రములో నాగు పాము కుబుసములో అరటిపండు కలిపి మందుగా వాడుట ఉంది.

ఇది ప్రయోగశాలలో పరిశీలించడం జరిగింది అదులో తెలిసిన విషయమే  ఏమితంటే చర్మ రోగాలు నయము చేయుటలో ఈ మట్టి ఎంతో ఉపయోగ పడును.

ప్రత్యేకముగా నాగరు అనే చర్మ వ్యాధికి. ఇది ప్రకృతి సిద్ధమైన వైద్య.

రావి చెట్టుకింద ప్రతిష్ఠించబడిన నాగవిగ్రాహాలకి కూడా పూజచేస్తుంటారు.

 ఆయుర్వేద శాస్త్రములో గర్భము నిలువకున్న ఈ చెట్టు వేరుతో తయారు చేసిన మందులు వాడుతారు.

అంతే కాక ఈ వృక్షము అరుణోదయ కాలములో దాని వేళ్ళ నుండి ఘనీభుతమైన అమ్ల జనకములు విడుదల చేస్తాయి.

దీనిని ఒజోన్స్ అంటారు. ఈ ఒజోన్స్ మనోహరమైన వాసనలు మానవుడి ఆరోగ్యం మరియు స్త్రీలమీద మంచి ప్రభావము చూపిస్తాయి.

అందువలన రావిచెట్టుకి ప్రదక్షిణాలు చేయడం మొదలైన నియమాలు చేసారు.

40 రోజుల పాటు ఉదయమునే రావి చెట్టు ఆలింగనము, ప్రదక్షిణాలు చేసిన జననేంద్రియ దోషములు తొలగి, గర్భము ధరించుటకు సహాయకారిగా ఉంటుందని విశ్వసిస్తారు.

నాగుపాము మనిషి వెన్ను పాము ఆకారములో ఉంటుంది.

నాగ ప్రతిమను శాస్త్రోక్తముగా రావి చెట్టు మొదలులో ప్రతిష్ఠిస్తారు.

ప్రతిష్ఠించేసమయంలో పంచరత్నాలు, పంచాపల్లవములు, నవధాన్యములు, గో పంచాకాలతో ప్రతిష్ఠించుతారు.

నాగ ప్రతిమ చేసిన రాయి పురుష జాతిథి అయి ఉండాలి.

రత్నముల ద్వారా చెట్టునుండి విసర్జించబడిన ఒజోన్స్ శిలా ముఖంతరముగా మానవుని శరీరమీద ప్రభావము చూపుతుది.

అందువలన పంచమి/నాగుల చవితి  నాడు నాగంద్రుని పూజించడం మన హిందు సంప్రదాయం.

వీనిని తెలిసి ఆచరించినా, తెలియక ఆచరించినా మంచి ఫలితములు తప్పక పొందవచ్చును.


దేవాలయములో నాగా అష్టోత్తరములు, పంచామృతములతో అభిషేకం వంటి పూజా కార్యక్రమాలు చేయిస్తే సకల భోగభాగ్యాలు ప్రాప్తిస్తాయని విశ్వాసం.

చలి చీమ నుండి చతుర్ముఖ బ్రహ్మ వరకు, రాయి - రప్ప, చెట్టు -చేమ, వాగు-వరద, నీరు -నిప్పు, అన్నిటా అందరిలోనూ దైవత్వాన్ని దర్శించే విశిష్టమైన సంస్కుతి హిందువులది .

మానవ దృష్టిలో పాము కుడా పరమాత్మ స్వరూపమే.

వేయి పడగల ఆదిశేషుడు విష్ణుమూర్తికి పానువు.

వాసుకి పమేస్వరుడి కంఠాభరణం.

వినాయకుడు నాగ యజ్ఞోప వీతుడు.

ఈ విధంగా బ్రాహ్మణులూ, ఋషులు, మునులు ... మానవజాతిని సన్మార్గములో పయనించేటట్లు చేసారు.

Comments