కరాంగుళినఖోత్పన్ననారాయణదశాకృతిః. - Vishwagurunidhi

 కరాంగుళినఖోత్పన్ననారాయణదశాకృతిః -Vishwagurunidhi
ఇది పదహారు అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించే టప్పుడు “కరాంగుళినఖోత్పన్న నారాయణ దశాకృత్యై నమః అని చెప్పాలి.

కరాంగుళి= చేతివ్రేళ్ళ
నఖోత్పన్న = గోళ్ళ నుండి పుట్టిన,
నారాయణ : విష్ణుమూర్తి యొక్క
దశాకృతిః = దశావతారములు గలది.

అమ్మవారి రెండు చేతివ్రేళ్ళ పదిగోళ్ళ నుండి నారాయణుని పది అవతా మూర్తులు - అంటే - మత్స్య, కూర్మ, వరాహాది అవతార మూర్తులు ఉత్పన్నమైనట్లు  బ్రహ్మాండ పురాణంలో వుంది. అటువైపు నుండి భండాసురుడు సర్వాసురాస్త్రాన్ని  ప్రయోగించునపుడు - సోమక, హిరణ్యాక్ష, హిరణ్యకశిపు, రావణాది రాక్షసులు పుట్టి - శక్తిసేనలతో యుద్ధానికి సన్నదులైతే - అమ్మవారి చేతి వ్రేళ్ళ నుండి పుట్టిన ఆ పది అవతార మూర్తులు వారిని సంహరించారు. అంటే అమ్మవారు నోరు మెదపకుండా, వ్రేలు  గూడా ఉపయోగించకుండా, అవసరమైనపుడు గోరు  కదిపితే చాలు గొప్ప గొప్ప అవతార మూర్తులే పుట్టి 'ఏం చెయ్యమంటారు? అని ఎదురుగా నిలబడతారన్నమాట ! అమ్మవారు అంతటి శక్తి స్వరూపిణి అని తెలుసుకోవాలి.

'దశ - అంటే 'అవస్థ' అని, 'కృతి' - అంటే 'కృత్యం' అనీ అర్థాలు చెప్పుకుంటే - ఈ నామానికి వేరొక అర్థం చెప్పుకోవచ్చును. దేవుడైన నారాయణుని అంశలే జీవులు. కాబట్టి అటు - దేవుని పరంగా నారాయణునికి పంచకృత్యా లుంటాయి. వాటిని - 'సృష్టి, స్థితి, లయ, తిరోధాన, అనుగ్రహా’ లంటారు. ఇటు - జీవుని పరంగా పంచ అవస్థలుంటాయి. వాటిని - 'జాగ్రత్, స్వప్న, సుషుప్తి, మూర్ఛ, మరణాలు' అంటారు. కాబట్టి, మొత్తం మీద నారాయణునికి దైవలక్షణంగా ఐదు కృత్యాలు, జీవి లక్షణంగా ఐదు అవస్థలు వుంటాయి. ఈ పదీ - అమ్మవారి రెండు చేతి వేళ్ళ పది గోళ్ళ నుండి రూపుదాల్చినట్లుగా అర్థం " చెప్పుకోవచ్చును.

అహంకార ప్రజ్ఞ అమ్మ సంకల్పితమే. దాని నివారణము ఆమె సంకల్పమే.
ముందు నామమున భండాసురుడు అహంకారాది అస్త్రములను సంధించుచుండగ, అమ్మ వానిని నిర్జించి నిర్మూలించు ప్రత్యస్త్రములను కురిపించుచున్నది అని తెలుపబడినది. దాని ఉదాహరణమే ఈ నామము. భండాసురుడు సర్వ అసురాస్త్రము. దానికి విరుగుడు అమ్మ నారాయ శాస్త్రము. అమ్మ నుండియే నారాయణుడు అవసరమైనపుడెల్ల దిగి వచ్చును. అహంకారమునుండి రక్షించును. అహంకారులకు పరిష్కారము నారాయణ మంత్రమే. అది అమ్మ అనుగ్రహముగ పనిచేయును.

దైవమే జీవుడగుటకు పది స్థితులుగ ఏర్పడుచున్నవి. ఇవి దేవుని పది అవస్థలు. దైవము, జీవుడు, అహంకారము, బుద్ధి, పంచేంద్రియ ములు, మూలప్రకృతి. ఈ పది అవస్థలు నారాయణుని దశావతార ములు. అవి అమ్మనుండే ఏర్పడును. దైవము సృష్టిగ మారుటకు, జీవు లుద్బవించుటకు అమ్మయే కారణము. మరల జీవులు, సృష్టి దైవమును చేరుటకు అమ్మయే మూలము. భండాసురుడు అమ్మ అవరోహణ మార్గమునకు చెందినవాడు. నారాయణుడు ఆరోహణ మార్గమునకు చెందినవాడు. సృష్టించుటకు భండాసురుని, ఉద్దరించుటకు నారాయణుని తన రెండు అస్త్రములుగ (శక్తులుగ) అమ్మయే నిర్వర్తించు చున్నది. పది స్థితులలో సృష్టి నేర్పరచుట పది విధములుగ సృష్టిని ఉద్ధరించుట. ఇదియే అమ్మ మండలాకృతి. దశాకృతి. ఈ నామము అత్యంత గంభీరమగు నామము. ఈ ఒక్క నామస్మరణలోనే నరాయణుడి దశావతరములు ఇటు అమ్మవారి ని సమతించుకుంటున్నాము..ఆ తల్లి సృష్టి యందు అటు ప్రకృతి గాను ఇటు నారాయణుడిగా పాలన కర్తగాను , అటు తల్లిగా సృష్టి కర్తగాను ఇటు శివశక్తిగా సంహరకర్తగాను..తానై నడిసిపిస్తున్నది...తల్లి సృష్టి లో మహా అద్భుతమైన సృష్టి పిండము.. ఈ అండము బ్రహ్మాండము కన్నా గొప్పది సృష్టి రహస్య అంతా పిండాకరం నుండి గ్రహించాలి...అక్కడ నుండి ఆ తల్లి అన్ని విధాల ఎదుగుదలకు ఒక్కో స్థాయిలో ఒక్కో విధంగా జీవుణ్ణి పోషించుచునే ఉన్నది..ఆమె తల్లి తండ్రి గురువు.. జీవుడికి కావలసిన అన్న పానీయాలు అవసరాలు కూడా అనేక రూపాలలో తానే తొడవుతుంది. అమ్మ తానే ఆకలికి అన్నాముగా మారుతుంది ఆమె..బంగారం స్వచ్ఛముగా అపరంజిగా మారుతున్న సమయంలో అందులోని మురికి కూడా వెలుపలికి వస్తుంది అలాగే మంచి సృష్టి నిర్మాణ క్రమము లోనూ ఒక మంచి ప్రయోగం లోను మురికి కూడా వెలుపలికి వస్తుంది అదే రాక్షస లక్షణము ఈ రెండు మాయలు కూడా ఆ తల్లే ఆ చెడు మంచికి హాని కలిగించకుండా మళ్ళీ ఆమె అన్ని అవతారములను దాల్చి దుష్ట సంహరము చేస్తున్నది....

సృష్టి కార్య నిర్వాహకులు ఆ తల్లి రూపలే వారి యందు కూడా అహకారము అనే గుణము వల్ల అటు మంచితో పాటు చెడు కూడా ఉద్భవిస్తూనే ఉంటుంది.. మనిషిలో కూడా అహంకారము వల్లనే అజ్ఞ్యనులు అవుతుంటారు ఆ తల్లి ని ధ్యానించి పూజించి అమ్మవారిని గుర్తించే ప్రయత్నం చేయువారు వారిలోని దుర్గుణములు ఆ తల్లే నాశనము చేస్తుంది..చేయవలసినదల్లా సత్య మార్గములో శరణు వేడుకోవడం...వెలుపలి శత్రువును నుండి తానే రక్షణ గా ఉండి దూరం చేసి రక్షిస్తుంది..

 నీలోని శత్రువులను నువ్వు సంహరించు కోవాలి అని నిర్ణయించు కున్నప్పుడు నీతో నువ్వు పోరాడి గెలవాలి అని సాధన మొదలు పెట్టి నప్పుడు ఆ తల్లి నీలోనే నరాయణుడికి సృష్టిస్తోంది నీలోఉన్న అసర గుణములను తన వ్రేలి గొర్లను కదిలించి నరాయణుడి రూపాన్ని నీలోనే కల్పిస్తుంది.. అంటే ఎప్పుడైతే జీవుడు  అసుర ప్రవృ

స్థులను తనలో తాను సంహరించుకుని సన్మార్గము సత్ప్రవర్తన కలుగుతుందో అప్పుడు అతనిలో సాధు ప్రవర్తన ధానగుణము, ధైర్యము, సహాయ పడే లక్షణము... ఆధ్యాత్మిక ఆత్మ చైత్య మార్గము ఇవన్నీ అతనిలో నిలిచిపోతాయి ఈ లక్షణాలన్నీ అమ్మవారు మనలో సాధన ద్వారా అసుర సంహారం కోసం అమ్మవారు సృష్టించిన రూపాలు ఆ రూపమే జీవుడిలో శాశ్వతంగా సాధన ద్వారా నిలిచిపోతే నరుడే నారాయణుడు...అవుతాడు..నిన్ను నువ్వు ఎలా ఉద్ధరించు కోవాలి అని సాధన చేస్తావో నీలో ఆ లక్షణమే వెలుపలికి వస్తుంది అది ఉన్నతమైనది అయితే తల్లిచే సదా రక్షింపబడతావు ,దుర్గుణములు అయితే తల్లిచే శిక్షింప బడతావు ఎలా అయినా రక్షించేది శిక్షించేది కూడా ఆ తల్లే, ఇది ఈ నమంలోని గొప్ప రహస్యము.

మొత్తం మీద ఈ నామానికి ఈక్రింది అర్ధాలు చెప్పుకోవచ్చును.
1) రెండు చేతుల వేళ్ళ గోళ్ళ నుండి - ఉద్భవించిన నారాయణుని పది -అవతార మూర్తులను కలిగినది.
2) రెండు చేతుల వేళ్ళ నుండి అటు - జీవుని పరముగాను, ఇటు - దేవుని పరముగాను నారాయణుని దశా (అవస్థల) కృతుల (కృత్యముల) పుట్టుక కలిగినది.

Comments