మానవ శరీరం పై గ్రహాలు అసలు ఎలా ప్రభావం చూపిస్తాయి - Vishwagurunidhi


*గ్రహాలు/వాటిస్థితి/మానవ శరీరం పై వాటి ప్రభావం*


*గ్రహాలపై జీవపదార్ధ స్వరూప స్వభావాలు, ఉపగ్రహాలపై వున్నటువంటి వాటికి వేరుగా వుంటాయి*

సోలార్ యూనిట్లో (సౌర కుటుంబంలో) సూర్యుని ఉపరితలం – గ్రహాల కేంద్రానికి సంబంధించిన అయస్కాంత క్షేత్ర ఆకర్షణ – వికర్షణ కేంద్రీకృత స్థాయిని, అలాగే గ్రహాల ఉపరితలం – ఉపగ్రహాల కేంద్రాలను అనుసరించి – ఆయా గ్రహాల ఉపగ్రహాలకు సంబంధించిన జీవ పదార్ధ స్వరూప స్వభావాలు ఎక్కువగా ఆధారపడి వుంటాయి. అందుకే, సాధారణంగా, ఒక సోలార్ యూనిట్లో – ఎప్పటికప్పుడు – ఘనరూప జీవుల ఉత్పత్తి లేదా ఫలదీకరణ/దరిమిలా పునరుత్పత్తి 'కేవలం ఒకే గ్రహం' పై వుంటుంది కాని, ఆ గ్రహానికి సంబంధించిన ఉపగ్రహం/ఉపగ్రహాలపై, ఆ రకమైనటువంటి అవకాశం చాలా అరుదుగానే సాధ్యం. అయినా, గ్రహంపై జీవ పదార్ధం – జీవికి, ఉపగ్రహ ఉపరితలంపై ఫలదీకరణ ప్రక్రియకు, చాలా తేడా వుంటుంది. ఈ విషయంలో, హైడ్రోమాగ్నెటిక్ – ఎలక్ట్రోమాగ్నెటిక్ వుమ్మడి ప్రభావంగా – దాని సంబంధ అంశాలు, జీవుల వుత్పత్తి కార్యంలో 'స్టెమ్ సెల్స్' ఏర్పాటు అనేక రకాలుగా వుంటాయి. జీనోమ్ అమరిక విధానాన్ని పరిపూర్ణంగా పరిశీలించ గలిగితే, ఈ విషయం స్పష్టం అవుతుంది.

జీవ సృష్టి 'వునికి' వున్న ప్రతి గ్రహం – ఉపగ్రహంపై (అన్ని జీవులలో) మేధా సంపత్తి గల జీవుల జన్మ తప్పనిసరిగా వుంటుంది అని అనుకోవడానికి 'అవకాశం' లేదు. భూమిపై జీవుల ప్రస్తుత ఉత్పత్తి – దానికి సంబంధించిన ఆంత్రపాలొజి పరిశీలన, జీవ పరిణామ ప్రక్రియను క్షుణ్ణంగా పరిశీలన చేస్తే, జీవుల సృష్టి, ఉప సృష్టి వారసత్వ లక్షణాలు, కొంతవరకైనా తెలిసే అవకాశం వుంది.

'జీవ' సూత్రం, సోలార్ పరిధిలో అన్ని గ్రహాలకు, ఉపగ్రహాలకు ఒకే విధంగా వర్తించదు. ఈ విషయంలో, ప్రధానంగా, గ్రహ/ఉపగ్రహ మాస్ (mass) సాంద్రత, దాని సంబంధ వాతావరణం – వునికి, ప్రాప్తి, ఓజోన్ లక్షణాలు, దాని ఏర్పాటు – రక్షణ, సూర్యుని ఉపరితలం పై వున్న వేడిమి – వెలుతురు, వివిధ గ్రహాల, మధ్య వున్న, హైడ్రోమాగ్నెటిక్, అలాగే దాని ఫలితంగా ఏర్పడిన హైడ్రోఎలక్ట్రిక్, సోలార్ మేఘాలు – (వాటికి) భూమిపై వాతావరణ స్పందన ప్రతిస్పందన, ఇతర అనేక కారకాల స్థితిపై, గ్రహాల ఉపగ్రహాల స్వరూప స్వభావాలు – పరిస్థితి ఆధారపడి వుంటాయి.


*జ్యోతిష్యం శాస్త్రం – ఆధారాలు*
@@@@@@@@@

జ్యోతిష్యం మూఢనమ్మకంగా కొందరు భావించినా జ్యోతిష్యం “శాస్త్రం” అనడానికి చాలా ఆధారాలు ఉన్నాయి. మన మెదడులోని ద్రవాలలో నవ గ్రహాలకు సంబంధించిన ఖనిజాలు ఉంటాయి. గ్రహాలు పరస్పర ప్రభావం కలిగివుంటాయి. అదేవిధంగా మనిషిపై కూడా ఆ ప్రభావం ఇంకా కొనసాగుతుంది. మానవ మస్తిష్కం గ్రహ గతులకు స్పందిస్తుంది.


సూర్యోదయం ప్రభావంతో మన శరీరం హార్మోన్లను విడుదల చేయడంతో మనం మేల్కొంటాం. చంద్రగమనం కూడా మనపై ప్రభావం చూపిస్తుంది. సముద్రపు అలలు, స్త్రీల ఋతుచక్రం, మానవుల మస్తిష్కం చంద్రగమన ప్రభావానికి లోనౌతాయి. సీజనల్ మెంటల్ డిజార్డర్ గా పిలువబడే (Seasonal Affective Disorder -SAD) అనే మానసిక రోగం కూడా చలికాలంలో సూర్యుడు చాలాఎక్కువ సేపు కనపడకపోవడం వల్ల సంభవిస్తుంది.


అమావాస్య పౌర్ణమి రోజుల్లో చంద్రుడు భూమికి దగ్గరగా రావడం, దూరంగా జరగడం వంటి మార్పుల వల్ల సముద్రపు అలల్లో తేడాలు వస్తాయి. అదేవిధంగా మానవుల దేహంలోని నీరు కూడా ఆ ప్రభావానికి లోనవుతుంది. మానవులలో ఈ ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది అనడానికి రుజువు కొందరు అమావాస్య పౌర్ణమి రోజుల్లో విపరీత ప్రవర్తనను చూపడం. ముఖ్యంగా మానసిక రోగులకు ఆరోజుల్లో పిచ్చి ఇంకా ఎక్కువ అవడం. ఒక్క చంద్రుడే కాదు ఇతర గ్రహాలు కూడా మనపై ప్రభావాన్ని చూపిస్తాయి. అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ క్లైమెటాలజీ The American Institute of Medical Climatology వారు Philadelphia పోలీస్ డిపార్టామెంట్ వారికి సాయపడటానికి ఒక రీసెర్చ్ ని నిర్వహించారు.


మానవ ప్రవర్తనపై పౌర్ణమి ప్రభావం మీద జరిపిన ఆ పరిశోధనలో ఆసక్తికర విషయాలు వెలుగుచూసాయి. ఆ పరిశోధన ప్రకారం పౌర్ణమి రోజుల్లో హత్య, విచక్షణా రహితంగా వాహనాల్ని నడిపి ఇతరుల మరణానికి కారణమవడం, అవసరానికి కాకుండా హాబీగా, మరోరకంగా తప్పకుండా దొంగతనం చేసి తీరాలనే తపన, ఇతరులమీద పగతీర్చుకోవాలనే కోరిక మొదలైనవి ఎక్కువగా రికార్డయ్యాయి. ఆ రకమైన నేరాలు ఆ రోజుల్లో ఎక్కువగా జరిగాయి.


 Miami విశ్వవిధ్యాలయానికి చెందిన Arnold Lieber అనే మానసిక శాస్త్రవేత్త మియామీలో గత 15 సంవత్సరాలలో జరిగిన 1,887 హత్యలకు పౌర్ణమి, అమావాస్యలకు గల సంబంధాన్ని గూర్చి పరిశోధనలు చేసి పౌర్ణమి, అమావాస్య రోజుల్లో మానవహనన ధుర్ఘటనలు ఎక్కువగా జరిగి మిగతా రోజుల్లో అవి తక్కువగా ఉన్నాయని గుర్తించారు.


Buehler అనే జర్మన్ శాస్త్రవేత్త పరిశోధనలో నెలలో చంద్రుని భూమికి దూరంగా ఉన్నకాలంలో (పరిమాణం తగ్గుతూ కనిపించే సమయంలో) కన్నా చంద్రుని పరిమాణం పెరుగుతూ కనిపించే కాలంలో 10 శాతం అధికంగా స్త్రీలు గర్భం ధరించడం జరిగింది. నెలలో చంద్రుని భూమికి దూరంగా ఉన్నకాలంలో (పరిమానం త

గ్గుతూ కనిపించే సమయంలో) కన్నా చంద్రుని పరిమానం పెరుగుతూ కనిపించే కాలంలో గర్బం దాల్చినప్పుడు మగ సంతానం కలగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని కూడా పరిశోధనలు తేల్చాయి.


ప్రాచీన గణిత శాస్త్రవేత్త భాస్కరుడు తన కూతురు లీలావతి జాతకం ప్రకారం ఆమె భర్త మరణిస్తాడని తెలుసుకుని ఏ ముహూర్తానికి ఆమె వివాహం జరిగితే ఆమెకు వైధవ్యం ప్రాప్తిస్తుందో తెలుసుకుని ఆ ముహూర్తానికి కాకుండా వేరే ముహూర్తానికి వివాహం జరిపించాలని ఒక గడియారాన్ని తయారుచేస్తాడు. కుండలో నీరు పోసి అడుగున చిన్న రంధ్రం ద్వారా నీరు ఒక్కొక్క చుక్క కింద పడేలా ప్లాన్ చేస్తాడు. దాని ఆధారంగా కాలాన్ని తెలుసుకుంటాడు. కానీ చివరికి కుమార్తె వివాహం జరిగి ఆమెకు జాతకం ప్రకారం వైధవ్యం ప్రాప్తింస్తుంది.


జాతక దోషాన్ని నివారించలేకపోయానని చింతిస్తూ తాను గడియారంగా మలచిన కుండ ను పరిశీలిస్తాడు. ఆ కుండ అడుగున చిన్న ముక్కు పుడక కనపడుతుంది. జరిగిన వాస్తవం ఏమిటంటే భాస్కరుని కుమార్తె లీలావతి ఆడుకుంటూ కుండలోకి తొంగిచూసినప్పుడు ఆమె ముక్కుపుడక జారి కుండలో పడి గడియారం గతి తప్పుతుంది. అందువల్ల భాస్కరుడు తాను అనుకున్న ముహూర్తానికి కాకుండా జాతకం ప్రకారం దోషం ఉన్న ముహూర్తానికే తన కూతురు వివాహం జరిపించి తరువాత బాధపడతాడు. ఇది జ్యోతిష్య శాస్త్రం గురించి ఒక వృత్తాంతం.


జ్యోతిష్యం వేదంగాలలో ఒకటి. వేద పురుషునికి కన్ను వంటిది. అంటే వేదాలను అధ్యయనం చేసేటప్పుడు వేదంగామైన జ్యోతిష్యంలో ప్రావీణ్యం ఉండాలి. వేదకర్మలు నిర్వహించటానికి కాలం చాలా ముఖ్యమైనది. కాలాను గుణంగా యజ్ఞయాగాదులు నిర్వహించటం కోసం జ్యోతిష్య శాస్త్రం ఆవిర్భవించింది. “జ్యోతి” అంటే వెలుగు. జ్యోతిష్య శాస్త్రమంటే వెలుగును తెలిపే శాస్త్రం. కానీ ఈ శాస్త్ర విజ్ఞానమంతా నేడు భవిష్యత్తుని తెలుసుకొనే విద్యగా ప్రఖ్యాతి గాంచింది. జ్యోతిష్యశాస్త్రం ఒక అపురూపమైన విజ్ఞానం. అది నమ్మకం కాదు. భవిష్యత్తుని తెలపటం అందులో ఒక చిన్న భాగం మాత్రమే.


 ఆధునిక విజ్ఞానం గ్రహాల మధ్య ఉండే దూరాన్ని ‘”కాంతి సంవత్సరం”లో లెక్కిస్తుంది. కాంతి సంవత్సరం అంటే ఒక సంవత్సరంలో కాంతి ప్రయాణించే దూరం. ఒక నక్షత్రం మనకు కనిపిస్తూ ఉంది అంటే దాని నుంచి మనకు ప్రసారమయ్యే కాంతి కనపడటానికి కొన్ని వందల, వేల కాంతి సంవత్సరాల కాలం పడుతుంది. అట్లాగే మన ప్రాచీన భారతీయులు కూడా సూర్యకాంతి ఆధారం చేసుకొని కాలగణన చేసి గ్రహ గతులను నిర్ణయించారు. అలాగే శుభ, అశుభ కాలాలను, ప్రకృతి వైపరీత్యాలను, గ్రహగతులతో అనుసంధానం చేసి మానవ జీవితాలపై అన్ని గ్రహాల ప్రభావాన్ని కనుగొన్నారు. అదే నేడు “జ్యోతిష్య శాస్త్రం”గా ప్రసిద్ధి చెందింది. వరాహమిహురుడు తన జ్యోతిష్యశాస్త్ర గ్రంథమైన “బృహత్ జాతక”లో మొదటి శ్లోకంలో “జ్యోతిష్యశాస్త్రం” సంసారమనే సముద్ర యానాన్ని దాటేందుకు “దిక్సూచి” వంటిది అని అంటాడు. దీనిని బట్టి జ్యోతిష్యశాస్త్రం కాలాన్ని తెలియజేసే మార్గదర్శి అని మనకు అర్థమవుతున్నది. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం
9 గ్రహాలు,
27 నక్షత్రాలు,
 12 రాశులలో సంచరిస్తున్నపుడు మనిషిపై వాటి యొక్క భావాన్ని వివిధ కోణాల నుండి దర్శింపచేస్తుంది. మనిషి పుట్టిన స్థలాన్ని, కాలాన్ని అనుసరించి ‘జన్మకుండలి’ని రచిస్తారు. ఆ జన్మ సమయంలో ఉండే గ్రహాల స్థితిగతుల ఆధారంగా మనిషి యొక్క జాతకాన్ని సూచిస్తారు. ఈ విజ్ఞానం అంతా కూడా ఎన్నో జ్యోతిష్య గ్రంథాలలో పొందపరచబడి ఉంది. ఇది ఒక మహాసముద్రం వంటిది. ఇందులో ప్రసిద్ధి గాంచినవి..


పరాశరుని – ‘హోరశాస్త్రం’.
వరాహమిహురుని – ‘బృహత్ జాతక’.
కళ్యాణ శర్మ – ‘సారావళి’.
జైమినీ మహర్షి – ‘జైమినీ సిద్ధాంతం’.
మంత్రేశ్వరుడు – ‘ఫలదీపిక’.
భ్రుగు మహర్షి – ‘భ్రుగు సంహిత’.
భారతీయ జ్యోతిష్య విజ్ఞానం ప్రతి శాస్త్రంలోనూ అనుసంధానింపబడి ఉంది. ఆయుర్వేదంలో కూడా ‘రోగి’ జన్మకుండలిని అనుసరించి వైద్యం చేసే విధానం ఉంది.


 గృహ నిర్మాణం, వ్యవసాయం, ప్రయాణం, యుద్ధాలు, వివాహాది సంస్కారాలలో, చివరకు దైనందిన కార్యక్రమాలలో తిథి, నక్షత్రం చూడకుండా పనులు ప్రారంభించనంతంగా ఈ శాస్త్రం భారత జనజీవనంలో మమేకమైనది. జ్యోతిష్యశాస్త్రం ఒట్టి బూటకమని, అది మనుషులను మోసం చేసే ప్రక్రియ అని, ఇది అసలు శాస్త్రం కాదనీ, కేవలం మూఢ నమ్మకం అనీ ఎందరో విమర్శకులు చెబుతున్నా ప్రపంచ వ్యాప్తంగా జ్యోతిష్యశాస్త్రం ప్రాముఖ్యత తగ్గటం లేదు. ఆధునిక వైద్య శాస్త్రం కూడా అన్ని రోగాలకు నివారణ ఇవ్వదు. ఒక వైద్యుడు రోగం నయం చేసినట్టు మరో వైద్యుడు నయం చేయలేడు. ఒక వైద్య విధానం చెప్పిన దానిని మరో వైద్య విధానం వ్యతిరేకిస్తుతింది. అయినా వైద్యాన్ని విజ్ఞానం అంటాముకాని నమ్మకం అనం. అలాగే జ్యోతిష్యం విజ్ఞానమా? నమ్మకమా? అన్నది వాళ్ళ విచక్షణకే వదిలివేద్దాం. దీనిని ఉపయోగించుకొని ముందుగా పోయే వారిని ఎవరూ నిరోధించలేరు.

*నాడీ జ్యోస్యం:-*
@@@@@@@@@

మనయొక్క భూత భవిష్యత్ వర్తమానాలను తెలియజేసే తాళపత్ర గ్రంథాలు భారతదేశంలో కొన్ని కుటుంబాల వద్ద ఉన్నాయి. ఆ కుటుంబాలు వాటిని వంశ పరంపరగా, చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నాయి. “శివపార్వతుల”

సంభాషణగా, సిద్ధులందించిన ఈ విజ్ఞాన నిధిని “నాడీ జ్యోతిష్యం” అంటారు. దక్షిణ భారతదేశంలో తమిళనాడులోని ‘చిదంబరం’ పట్టణానికి దగ్గర గల ‘వైదీశ్వరన్ కోయిల్’ అనే గ్రామంలో కొన్ని కుటుంబాల వద్ద ఈ తాళపత్రాలు ఉన్నాయి. ఈ తాళపత్రాలనే నాడీ పత్రాలు అంటారు. ఇప్పుడు మనకు లభిస్తున్న తాళపత్రాలు కొన్ని మాత్రమే. కనుక అందరి వృత్తాంతాలు ఈ నాడీ పత్రాలలో ఉండవు. కొన్ని తాళపత్ర గ్రంథాలను ఆనాటి తంజావూరు మహారాజు ‘రెండవ షర్ఫోజి’వారు ‘సరస్వతీ మహల్’ గ్రంథాలయంలో ఉంచగా, వాటిని బ్రిటిషు వారు స్వాధీన పరుచుకొన్నట్టు తెలుస్తున్నది. బ్రిటిషు వారి నుంచి వాటిని సంపాదించి కొందరు విదేశీయులు వీటితో వ్యాపారం చేస్తున్నారు. ఈ నాడీ ‘జోస్య’ విధానం మొదట వ్యక్తి తన చేతి బొటన వేలిముద్ర ఇవ్వాలి. దీని ఆధారంగా నిపుణులు తాళపత్ర గ్రంథాలను పరిశీలించి ఆ వ్యక్తి వివరాలను తెలియజేస్తారు, అవి సరిపోలితే తదుపరి పరిశీలన ప్రారంభిస్తారు. ఆ లభించిన వారికి తండ్రి పేరు, తల్లి పేరుతో సహా పుత్రుల, భార్య పేరు తెలియజేయటం కూడా అబ్బురపరచే విషయం. ఇందులో కూడా నేడు కొందరు నకిలీ నాడిజోస్యులు ప్రవేశించి శాస్త్రాన్ని వ్యాపారపరంగా వాడుకుంటున్నారు.


ఏది ఏమైనప్పటికీ, ఈ ప్రక్రియను కనుగొన్న సిద్ధులను, పరంపరగా దీనిని కాపాడు కుంటున్న కుటుంబాలను మనం అభినందించాలి. కృతజ్ఞతలు తెలియజేయాలి.



భూమి అన్ని వస్తువులను ఆకర్షించడానికి కారణం దానికి గల గురుత్వాకర్షణ ధర్మం. ఇటువంటి గురుత్వాకర్షణ ధర్మం విశ్వంలో ప్రతి వస్తువుకు ఉంది. ఈ వస్తువులో ద్రవ్యరాశి ఎంత ఎక్కువ ఉంటే దానికి అంత ఎక్కువ గురుత్వాకర్షణ ఉంటుంది. భూమి ఎక్కువ ద్రవ్యరాశి గల వస్తువు కాబట్టే మూడు లక్షల ఎనభై నాలుగు వేల నాలుగు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న చంద్రుడిని ఆకర్షించి తన చుట్టూ తిప్పుకోగల్గుతోంది.
భూమి కన్నా దాదాపు మూడు లక్షల ముప్ఫయి మూడు రెట్లు ఎక్కువ ద్రవ్యరాశి గల సూర్యుడు తన గురుత్వాకర్షణతో గ్రహాలన్నింటిని, తోక చుక్కల్ని కూడా ఆకర్షించి తన చుట్టూ తిప్పుకోగల్గు తున్నాడు.


భూమికి గురుత్వాకర్షణ ధర్మం మాత్రమే గాక అయస్కాంత ధర్మం కూడా ఉంది. అందుకే ఇది అయస్కాంత సూచికను ఆకర్షించడం లేదా వికర్షించడం చేయగల్గుతోంది. ఈ ధర్మం ఆధారంగానే దిక్సూచి పని చేస్తుంది. చంద్రుడికి ఈ అయస్కాంత ధర్మం చాలా బలహీనంగా ఉంటుంది. భూమి అన్ని వస్తువులను ఆకర్షించడానికి కారణం దానికి గల గురుత్వాకర్షణ. అయస్కాంత ధర్మం కాదు. అయస్కాంతం ఇనుము, కోబాల్ట్‌లతో తయారయిన వస్తువులను ఆకర్షించడానికి కారణం అయస్కాంత ధర్మం.



*గ్రహాల ప్రభావం/మానవ శరీరం*
@@@@@@@@@

*మన నిత్య జీవితం లో తరచూ మనం గ్రహాల గురించి వింటుంటాం, అయితే నిజంగా గ్రహాల ప్రభావం మనపై ఉంటుందా అంటే ఉంటుందనే చెబుతుంది మన జ్యోతిష్యం. ఏయే గ్రహం మనపై ఏ విధంగా ప్రభావం చూపుతుందో తెలుసుకుందామా..*

*మొదటి గ్రహం సూర్యుడు : సూర్యుడు గ్రహాలలో మొదటివాడు ఈ సూర్య గ్రహం ప్రభావం అనుగ్రహ చేత మనిషి యొక్క ఆత్మ పీడలు తొలిగిపోతాయి.*


*రెండవ గ్రహం చంద్రుడు : రెండవ గ్రహమైన చంద్రుడు మనసుకు కారకుడు చంద్ర గ్రహ అనుగ్రహ ప్రభావం చేత మనస్సు కు ప్రశాంతత చేకూరును.*


*మూడవ గ్రహం కుజుడు : మూడవ గ్రహమైన కుజుడు రోగ కారకుడు కుజ గ్రహ అనుగ్రహ ప్రభావం చేత రోగ పీడలు తొలిగి పోవును.*


*నాలుగవ గ్రహం బుదుడు : నాల్గవ గ్రహమైన బుదుడు బుద్ది కారకుడు బుధ గ్రహ అనుగ్రహ ప్రభావం చేత బుద్ది మంచి వైపు ఆలోచించును.*


*ఐదవ గ్రహం గురుడు : ఐదవ గృహమైన గురుడు విద్యా కారకుడు గురు గ్రహ అనుగ్రహ ప్రభావము చేత మంచి విద్య కలుగును.*


*ఆరవ గ్రహం శుక్రుడు : ఆరవ గ్రహమైన శుక్రుడు పత్ని పీడలను తొలగించును.*


*ఏడవ గ్రహం శని : ఏడవ గ్రహమైన శని అయన అనుగ్రహ ప్రభావం చేత ప్రాణ పీడలను తొలగించును.*


*ఎనిమిదవ గ్రహం రాహువు : ఎనిమిదవ గ్రహమైన రాహువు తన అనుగ్రహ ప్రభావం చేత నేత్ర సంబంధిత పీడలను తొలగించును.*


*తొమ్మిదవ గ్రహం కేతువు : తొమ్మిదవ గ్రహమైన కేతువు తన అనుగ్రహ ప్రభావం చేత మనకు జ్ఞానాన్ని ప్రసాదించును.*



అనంతమైనదీ విశ్వం. సూర్యచంద్రాదుల్లాంటి గ్రహాలు మన కంటికి కనిపిస్తే, కనిపించని గ్రహాల్లాంటి గ్రహాల సమూహాలు కోటానుకోట్లు ఈ విశ్వంలో ఉన్నాయట. తాము సూర్య, చంద్రాదుల్లాంటి గ్రహాలకు కోటిరెట్లు పెద్దవైనా, తమను అతి చిన్నవిగా చూపుకుంటూ, మినుకు,మినుకుమంటూ కనిపించే నక్షత్రాలైతే లెక్కకు లెక్కపెట్టలేనన్ని వున్నాయిట ఈ విశ్వంలో.


 ఒక నక్షత్రం వెలుగులు చిమ్ముతూ రాలిపోతే, మరో పది నక్షత్రాలు ఈ విశ్వంలో పుట్టుకొస్తుంటాయట. కొన్ని చిన్న, పెద్దా గ్రహాలు సూర్యుడిలాంటి గ్రహాలచుట్టూ ఆకర్షింపబడి తిరుగుతూవుంటే, అటువంటి సూర్యుడులాంటి కోటానుకోట్ల గ్రహాలు ఈ విశ్వంలో అంతులేనన్ని వున్నాయిట. ఇటువంటి కోటానుకోట్ల సూర్యుళ్ళని ఆకర్షించి, ఒక పరిధిలో సంచరించేలా చేసేదెవరు? ఇంకెవరు? అనంతమైన ఈ విశ్వం – విశ్వచైతన్యశక్తే!! ఈ శక్తి కంటికి కనిపించనది.


దీనినే నేటి
శాస్త్రజ్ఞులు ‘చీకటి బిలాలు’ (BLACK HOLES) అని అంటున్నారు. ఈ చ

ీకటి బిలాలు రెండువైపులా తెరుచుకొని వుంటాయి. అయితే, పైవైపు వెడల్పాంటి మూతిలాగా తెరుచుకొనివుండి, తమ సమీపానికి వచ్చిన గ్రహాలను అమాంతం మింగివేసి, వాటిలోని శక్తినికూడా తమలో లీనం చేసుకొని, తిరిగి, తమ రెండోవైపు, సూదిమొనంత మాత్రమే వుండే ద్వారంగుండా శక్తిని, పదార్ధాలని క్రొత్తరూపంలో అనంతమైన విశ్వంలోకి వదులుతుంటూ వుంటాయిట. కొన్ని గ్రహాలు తమ చుట్టూ తాము తిరిగేవైతే, మరికొన్ని తమచుట్టూ తాము తిరిగుతూ, ఒక ముఖ్య గ్రహం చుట్టూ కూడా తిరిగుతుంటాయి;


 ఇంకొన్ని గ్రహాలు కేవలం ఇతర గ్రహాల చుట్టూ తిరిగేవిగా మాత్రమే వుంటాయి; కొన్ని గ్రహాలు స్వయంగా కాంతిని, శక్తినిచ్చేవయితే, మరికొన్ని ఇతర గ్రహాలనుంచి కాంతిని, శక్తిని పొందుతూ వుంటాయిట ఈ విశ్వంలో.


అనంతమైన విశ్వంలాంటిదే మన మనస్సుకూడా. పుట్టుకరీత్యా వచ్చిన జ్ఞానంకొంత; బాహ్య ప్రపంచంలోని వస్తు, విషయ, దృశ్య, శ్రవణాదులద్వారా లభించిన జ్ఞానంద్వారా ఈ మనస్సులో సంకల్పాలు మొదలై, అవి ఆలోచనాకృతిని పొందుతాయి. అలా పుట్టిన ఆలోచనల్లో కొన్ని క్షణకాలం మాత్రమే జీవించేవి అయితే; కొన్ని ఆకృతినిపొంది, కొంత కాలానికే, ఆకాశంలోంచి రాలిపడిపోయే చుక్కల్లాంటివి; మరికొన్ని ఆలోచనలు ఫలరూపాన్ని పొందుతాయి. విశ్వంలోని చైతన్యశక్తి ఆకర్షణ, వికర్షణ, విద్యుత్, అయస్కాంత శక్తులను కలిగివుంటుంది.


 అదేవిధంగా, మన శరీరం, మనసుకూడా ఇవే ఆకర్షణ లక్షణాలను కలిగివుంటాయి. కొన్ని ఆలోచనలు చిన్న గ్రహాల్లాంటివి అయితే, కొన్ని పెద్ద ఆలోచనలు, చూడటానికి/తెలుసుకోవటానికి, మినుకుమినుకు మనే చిన్న నక్షత్రాల్లాగా అనిపించినా, వాటి సామర్ధ్యం మాత్రం ఘనంగానే వుంటాయి, వాటి ఫలితాలుకూడా గొప్పగానే వుంటాయి.


విశ్వానికి (లేదా ఆకాశానికి); సముద్రానికి; మనస్సుకీ ఒక సామాన్య లక్షణం వుంది. అది చీకటి. అంటే, వీటి లోతు, పరిధి ఎంతో మనకీ తెలియదు; వాటికికూడా తెలియదు. విశ్వం లేదా ఆకాశంలోకి భూమినుంచి చూస్తే, సూర్యుని వల్ల వెలుతురు కనిపించినా, కొంత పరిధి దాటిన తరువాత, విశ్వం/ఆకాశంలోకి ప్రయాణించే వారికి చీకటి మాత్రమే కనిపిస్తుంది. అదేవిధంగా, సముద్రంపైన, కొంత లోతువరకు వెలుతురు కనిపించినా, ఎక్కువ లోతుకు వెళ్ళేసరికి అంతా చీకటిమయమే; మరి మనస్సు విషయానికివస్తే, అసలు మనస్సే కనిపించనది; అంటే కనిపించనది చీకటేకదా!! ఇందులోనే ఒక విశ్వరహస్యం వున్నది.


కనిపించని, చీకటిగా వున్న విశ్వంలోంచే, వెలుగునిచ్చే సూర్యుళ్ళు, నక్షత్రాలు పుట్టుకువచ్చాయి; చీకటి సముద్రపు లోతుల్లో, అనంతమైన, విశేషమైన జీవరాశులున్నాయి; అదేవిధంగా, కనిపించని మనస్సులోంచే, చీకటిని అధిగమించే, సముద్రాల్ని పరిశోధించే, విశ్వాన్ని తెలుసుకోగోరే అతి గొప్ప ఆలోచనలు పుట్టుకువస్తుంటాయి. చూసారా, శూన్యమనే ఆకాశానికి, అగోచరమైన మనస్సుకు ఎంత సారూప్యమో!! ఈ వింతైన సారూప్యం వుండటానికి, దీనివెనుక ఏదైనా విశ్వరహస్యం, లేదా చిదంబర రహస్యమేదైనా వుందంటారా? వుందనే చెప్పాలి. అసలు జీవి పుట్టుకకు మూలమైన మూలకణాలు, విశ్వంనుంచి పుట్టినవేకదా!!


 “చాందోగ్యోపనిషత్త్ లో (chapter VI – Section-2.3) జీవానికి మూలం ‘ఆకాశం-వాయువు-అగ్ని-నీరు-భూమి’ అని సోదాహరణంగా చెప్పబడితే, నేటి ఆధునిక శాస్త్రజ్ఞులు, విశ్వంలో 14 బిల్లియన్ల సంవత్సరాల క్రితం విశ్వంలో ‘బిగ్-బ్యాంగ్’ అనేది జరిగిందని, అందులోంచే, వాయువులు, మూలకణ పదార్ధాలు పుట్టుకు వచ్చాయనీ, వాటినుంచి నీరు, భూమిలాంటివి పుట్టాయని, వాటినుంచి ఏక కణ జీవులు, తరువాత బహుకణ జీవులు పుట్టుకువచ్చి, కొన్ని కోట్ల సంవత్సరాల పరిణామంలో, నేటి ప్రపంచం, జీవులు ఏర్పడ్డాయని చెబుతున్నారు. అందుకనే, విశ్వానికి, మన మనస్సుకీ సారూప్యం కనిపిస్తుంది.


గ్రహాలు తిరుగుతూ వున్నట్లే, మనస్సు కూడా తనలో తాను తిరుగుతూ, ఇతరుల మనసు చుట్టూ
కూడా తిరుగుతూ వుంటుంది. అంతే కాదండీ, ఇది ఒక్క క్షణంలో ప్రపంచం మొత్తాన్నికూడా తిరిగిరాగల శక్తిమంతురాలు. గ్రహాలకున్నట్లే, దీనికికూడా ఆకర్షణశక్తి వున్నది. తనకున్న శక్తి, ఆకర్షణతో ఇతరుల మనస్సును ఇట్టే వశపరుచుకోగలదు. కొన్ని మనస్సులకు ఈ రెండు లక్షణాలు సరిపడంత లేక, ఇతరుల మనస్సుకే లొంగిపోయి, వాటిపైనే ఆధారపడివుంటాయి. కొన్ని గ్రహాలుకూడా ఇదేవిధంగా వుంటాయని చెప్పుకున్నాం.


ఒక రకం మనస్సు తగినంత స్వీయ శక్తి, ఆకర్షణ లేక, ఇతరుల మనస్సుకు ఆకర్షింపబడి, లొంగిపోయివుంటాయి. అయినప్పటికీ, చల్లని, శాంతస్వభావం కలిగివుంటుంది. ఇటువంటి మనస్సును చంద్రునితో పోల్చవచ్చు.


 రెండవరకం మనస్సు:- ఇది తన చుట్టూ తాను తిరుగుతూ, గొప్పవారి మనసుల చుట్టూకూడా తిరుగుతూవుంటుంది. దీనికి స్వయం ప్రకాశ శక్తి, ఆకర్షణలుకూడా వుంటాయి. ఈ రకం మనస్సులు చాలా ఎక్కువగానేవుంటాయి. ఈ మనస్సుని భూమిలాంటి గ్రహాలతో పోల్చవచ్చు. ఆధ్యాత్మికంగా ఆలోచిస్తే, ఇటువంటి మనస్సుగలవారిని ఉత్తములుగా పరిగణించవచ్చు. ఎందుకంటే, వీరు తమకున్న జ్ఞాన, శక్తిసంపత్తులతో జీవనాన్ని సాగిస్తూ, అవసరమైనమేరకు, సద్గురువులను (సూర్యుడు లాంటివారిని) ఆశ్రయించి, వారినుంచి మరింత శక్తిని, జ్ఞాన సంపదను పొందుతూ, జీవితాన్ని సఫలం చేసుకుంటుంటారు.


 మూడోరకం మనస్సు:– ఈ రకం మనస్సు గలవారు పుట్టుకతోనే అత్యంత శక్తి కలిగి, ఆకర్షణ కలిగి, ఇతరులను తమ చుట్టూ తిప్పుకోగలిగిన వారైవుంటారు. వీరిని ధృవ నక్షత్రాల్లాంటి నక్షత్రాలతో సరిపోల్చవచ్చు. వీరు, గురుస్థానంలో వుండి, సామాన్య జనులకు మార్గనిర్దేశాన్ని చేస్తుంటారు. తమ ఆకర్షణ శక్తితో, సామాన్య జనులను తమ,తమ జీవన పరిభ్రమణంలో గతి తప్పకుండా కాపాడుతుంటారు. వీరు విశ్వమహనీయులు.


ఒక సీసానిండా ఏదైనా వాయువును నింపిన తరువాత, అందులోకి కొన్ని ఘన పదార్ధాల్ని నింపటానికి ప్రయత్నిస్తే, సీసాలోని వాయువు తనకుతాను లేదా తనలోతాను కొంతమేరకు కుంచించుకొని, ఘనపదార్ధాలు వుండటానికి సీసాలో కొంత చోటును కల్పిస్తుంది.


 అదేవిధంగా, ఒక ఓడను సముద్రం నీళ్ళల్లోకి వదిల్తే, ఓడ బరువుకు సమానమైన పరిమాణంగల నీటిని, సముద్రం ప్రక్కకు జరిపి, ఓడ తనలో తేలటానికి చోటిస్తుంది. మరి, ఇదేక్రమంలో, ఈ విశ్వం ( లేదా అనంతమైన ఆకాశం ) కూడా, తనలో అనంతమైన గ్రహరాశులకు ( భూగ్రహంతో సహ ) చోటును కల్పిస్తూనే వుంటుంది. దీనిలోని తత్త్వం ఏమిటి?


 ఒక గ్లాసులో మంచి నీటిని నింపాలంటే, ఆ గ్లాసు ఖాళీగానన్నా వుండాలి, లేదా, వున్న పాతనీటిని తీసివేసి, క్రొత్త మంచినీటితో నింపటానికి గ్లాసును ఖాళీగా వుంచాలి. అదేవిధంగా, మన మనస్సును అత్యుత్తమమైన ఆలోచనలతో నింపాలంటే, దానిని ఎప్పుడూ పూర్తిగాగానీ, లేదా కొంతమేరకైనా ఖాళీగా వుంచాలి. అప్పుడే, మన మనస్సు, విశ్వతత్త్వాన్ని కలిగివుంటుంది; విశ్వంలాగా వ్యాప్తి చెందుతూవుంటుంది.

🕉🌞🌎🌙🌟🚩

*జ్యోతిశ్శాస్త్రం ప్రకారం సౌర కుటుంబంలోని అన్ని గ్రహాలు మానవ శరీరంపై ప్రభావం చూపుతాయి. ప్రతి గ్రహానికి శరీరంలోని ఒక్కో ప్రత్యేక ప్రాంతానికి సంబంధం ఉంటుంది. వీటిని స్థితి అనుకూలంగా ఉంటే ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండవు. అదే వీటి స్థితి బలహీనంగా ఉంటే అనారోగ్యం బారిన పడతారు.*


*సాంకేతికంగా సూర్యుడు ఒక నక్షత్రం. వెలుగు, వేడి ప్రసాదించడమే సూర్యుడి కర్తవ్యం. సూర్యుని నుంచి గ్రహించే శక్తి భౌతిక, మానసిక చర్యలే కాదు గుండె పనితీరును కూడా సూచిస్తుంది.*


*సూర్యుడికి చంద్రుడు విరుద్ధం. శరీరానికి చల్లదనం, బలం, సమతౌల్యాన్ని చంద్రుడు అందిస్తారు. జీర్ణక్రియ, అధిక ఉప్ణం నుంచి ఉపశమనం, శరీరంలోని రక్త ప్రసరణ అనేవి చంద్రుడి ప్రసాదించే శక్తిపై ఆధారపడి ఉంటాయి.*


*సౌర కుటుంబంలోని ప్రకాశవంతమైన గ్రహాల్లో బుధ గ్రహాం కూడా ఒకటి. మెదడు పనితీరు, తెలివితేటలు, నిర్ణయాలు తీసుకునే సామర్ధ్యం బుధుడిపై ఆధారపడి ఉంటుంది.*


*శుక్రుడు ప్రేమకు చిహ్నం. ఈ గ్రహ స్థితి సాధారణంగా ఉంటే శరీరంలో చక్కెర నిల్వల్లో సమతౌల్యత ఉంటుంది. బలహీనంగా ఉంటే డయాబెటిస్‌కు దారి తీస్తుంది.*


*కిడ్నీల పనితీరు, మూత్రాశయం, క్లోమం పనితీరు అంగారక గ్రహంపై ఆధారపడి ఉంటుంది. అలాగే రక్త ప్రసరణ పనితీరును కూడా ఇది నియంత్రిస్తుంది. గ్రహ స్థితి బలహీనంగా ఉంటే ఉదర సంబంధ వ్యాధులకు కారణమవుతుంది.*


*సౌర వ్యవస్థలో అతి పెద్ద గ్రహం బృహస్పతి. భౌతిక సామర్థ్యం, బలం, హృదయం పనితీరు కూడా దీనిపై ఆధారపడి ఉంటుంది. జాతకంలో ఈ గ్రహం బలహీనంగా ఉంటే నీరసం, గుండె సంబంధ రోగాలకు దారితీస్తుంది.*


*శరీరంలోని విటమిన్లు, ఖనిజ లవణాలు సమతౌల్యతకు, శని గ్రహానికి సంబంధం ఉంటుంది. ఎముకల గట్టిదనం, శరీరంలో కాల్షియం స్థాయిలను కూడా ప్రభావితం చేస్తుంది. ఈ గ్రహం బలహీనంగా ఉంటే శరీరంలో పగుళ్లు ఏర్పడతాయి.*


*గ్రహాల చలనం, స్థాన మార్పిడి వ్యక్తి మీద ప్రభావం చూపుతాయి.*


*ఈ గ్రహాలన్నీ ఆరోగ్యంతోపాటు మానవ శరీరానికి/సంబంధించి ఉంటాయఉంటాయి

Comments