వారాహి దేవత
వారాహి దేవత వరాహావతారం యజ్ఞ స్వరూపం, దశ మహా విద్యలలో లేదు. ఆమె మాతృకా దేవత. బగలా ముఖి స్తంభన శక్తి. వారాహి యోగ సిద్ధికరి. సముద్రపు లోతులలో దాచి పెట్ట బడిన భూమిని బయటకు తెచ్చిన అవతారం. అలాగే వారాహి కూడా మనిషిలో దాగి ఉన్న ఆత్మ తత్వాన్ని బయటకు తెచ్చి యోగ సిద్ధిని ఇవ్వగల విద్య. అతి బలవత్తరమైన శక్తి. సమస్యలను కూకటి వేళ్ళతో పెకలించి పారేయగలదు.
*రాత్రివేళల్లో పూజలందుకునే వారాహి దేవత*
మన పురాణాల ప్రకారం శక్తికి ఉన్న ఏడు ప్రతిరూపాలే సప్తమాతృకాలు. వీరే బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి. కొన్ని నమ్మకాల ప్రకారం ఎనిమిదో మాతృకగా నారసింహినీ మరికొన్ని సంప్రదాయాలలో తొమ్మిదవ మాతృకగా వినాయకిని ఆరాధించడం జరుగుతోంది. దుష్టశిక్షణ కోసమూ, భక్తులకు కాచేందుకు ఈ సప్తమాతృకలు సిద్ధంగా ఉంటారు. వీరిలో ఒకరైన వారాహి విశేషాలు...
*వరాహుని స్త్రీతత్వం*
పూర్వం హిరణ్యాక్షుడనే రాక్షసుని సంహరించి, భూలోకాన్ని ఉద్ధరించిన విష్ణువు అవతారమే వరాహమూర్తి. ఆ వరాహమూర్తికి ఉన్న స్త్రీతత్వమే వారాహి అంటారు. దేవీ భాగవతం, మార్కండేయ పురాణం, వరాహ పురాణం వంటి పురాణాలలో ఈమె ప్రసక్తి కనిపిస్తుంది. ఆయా పురాణాలలో అంధకాసురుడు, రక్తబీజుడు, శుంభనిశుంభులు వంటి రాక్షసులను సంహరించడంలో ఆమె పాత్ర సుస్పష్టంగా కనిపిస్తుంది.
*రూపం*
వారాహి రూపం ఇంచుమించు వరాహమూర్తినే పోలి ఉంటుంది. ఈమె శరీరఛాయను నల్లని మేఘవర్ణంలో ఉన్నట్లు పేర్కొంటారు. సాధారణంగా ఈ తల్లి వరాహ ముఖంతో, ఎనిమిది చేతులతో కనిపిస్తుంది. అభయవరద హస్తాలతో... శంఖము, పాశము, హలము వంటి ఆయుధాలతో దర్శనమిస్తుంది. గుర్రము, సింహము, పాము, దున్నపోతు వంటి వివిధ వాహనాల మీద ఈ తల్లి సంచరిస్తుంది.
*ఆరాధన*
తాంత్రికులకు ఇష్టమైన దేవత వారాహిమాత. అందుకే ఈమెను రాత్రివేళల్లో పూజించడం కద్దు. వారాహిమాత ముఖ్య దేవతగా ప్రతిష్టించిన కొన్ని ఆలయాలలో దర్శనం సైతం రాత్రివేళల్లోనో, తెల్లవారుజామునో మాత్రమే ఉంటుంది. దేశంలోని వివిధ ప్రాంతాలలో ఈమె ఆలయాలు ఉన్నప్పటికీ చౌరాసి (ఒడిశా), వారణాసి, మైలాపుర్లలో ఉన్న ఈమె ఆలయాలకు ప్రాధాన్యత ఎక్కువ.
*సైన్యాధ్యక్షురాలు*
లలితాదేవికి సైన్యాధిపతిగా వారాహిదేవిని వర్ణిస్తారు. అందుకే ఈమె ప్రస్తావన లలితాసహస్రనామంలో కూడా కనిపిస్తుంది. ఆ లలితాదేవి తరపున పోరాడేందుకే కాదు, భక్తులకు అండగా ఉండేందుకు కూడా ఒక గొప్ప యోధురాలిగా నిలుస్తుంది వారాహి. ఈమెను ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయనీ, శత్రుభయం ఉండదనీ, జ్ఞానం సిద్ధిస్తుందనీ, కుండలినీ శక్తి జాగృతమవుతుందనీ... తరతరాలుగా నిలిచి ఉన్న నమ్మకం. వారాహిదేవి పేర ఉన్న మూలమంత్రాలను, అష్టోత్తరాలనూ పఠిస్తే సకలజయాలూ సిద్ధిస్తాయన్నది భక్తులకు అనుభవమయ్యే విషయం.
వారాహిదేవి
ఈ చిత్రంలో మీరు చూస్తున్నది వారాహి దేవి.. ఈ అమ్మవారు శాక్తేయం లో కనిపిస్తారు. శక్తిని ఉపాసించే ప్రక్రియే శాక్తేయము. వారాహి అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి సైన్యాధిపతి,దండనాధ పేరుతో పిలువబడే వారాహి మాత శంఖం,చక్రం,నాగలి,గునపం,అభయ వరదాలతో దర్శనమిస్తుంది. బ్రాహ్మి,మాహేశ్వరి, కౌమారి,వైష్ణవి, వారాహి.,ఇంద్రాణీ,చాముండి, వంటి సప్త మాతృకలలో వారాహి ఒకరు.
శాక్తేయులు వారాహీ దేవి పార్వతీ దేవి మాతృక అని నమ్ముతారు . ఈ మాతృకలు దానవులపై యుధ్దానికి వెళ్లే టప్పుడు అవసరానుగుణంగా దేవతలయొక్క శక్తులను సమీకరించి సృష్టించి తమతమ ఆయుధాలను యిచ్చినవి . శక్తి స్వరూపిణి అయిన దుర్గాదేవి తనచే సృష్టించబడ్డ అన్ని మాతృకలను తనలో ఐక్యం చేసుకొని శంభుని సంహరించెనని శక్తి పురాణం లో ఉంది.
దేవీ భాగవతం ప్రకారం చండీమాత రక్తబీజుని సంహరించేటపుడు వారాహీ మాతృకను సృష్టించెనట . దేవీ పురాణం లో వారాహి దేవిని వరహాజనని , క్రితంత తనుసంభవ ( మృత్యుసమయములో వచ్చేశక్తి అంటే యమశక్తి) గా కూడా వర్ణించేరు . వారాహి దేవి వాహనం యెనుము , పాశం ధరించి వుండడం కూడా పై వాదనను బలపరుస్తుంది . ఈమెను కైవల్యరూపిణి , వైవస్వతి అని కూడా అంటారు . ఈమెను వాగ్దేవి రూపిణిగా కూడా వర్ణిస్తారు .
వారాహి దేవి వరాహ ముఖం అనగా పంది ముఖం కలిగి , చక్రం , కత్తి ధరించి భక్తులకు దర్శనమిస్తోంది .లలితాసహస్రనామాలలో ఈ వారాహి దేవి నామం వుండడం కనిపిస్తుంది .వారాహి దేవి మందిరాలలో ముఖ్యంగా , తాంత్రిక పూజ జరగపడం సర్వసాధారణం . ప్రతీ మనిషిలోనూ వారాహీశక్తి నాభి ప్రాంతంలో వుండి మణిపూర , స్వాధిష్ఠాన , మూలాధార చక్రాలను ప్రభావితం చేస్తుంది .
వారాహి దేవి కవచం పారాయణం చేయిస్తే ఎంతటి కష్ట సాధ్యమైన పనులైన త్వరగా పూర్తి అవుతాయి.
వారాహి దేవి .. ఈమె సప్త మాతృకలలో ఒకామె
అమ్మవారి శక్తి స్వరూపాలలో ఒకటిగా కొలుచుకుంటాము .. వరాహస్వామి అర్ధాంగి .. శ్రీమహాలక్ష్మి స్వరూపం .. నేపాలీయులు ఈమెనే బారాహి అనే నామధేయం తో కొలుచుకుంటారు .. బౌద్ధ మతం వారు వజ్ర వారాహి .. మరీచిగా ఈమెనే పూజిస్తారు ..
బ్రాహ్మీ .. మహేశ్వరీ .. కౌమారీ .. వైష్ణవి .. వారాహి .. ఇంద్రాణి .. చాముండీ .. సప్త మాతృకలు
మార్కండేయ పురాణంలో దేవీమహత్యం లో .. శుంభ నిశుంభ వధ కధ ప్రకారం .. దేవుళ్ళ శరీరాల నుంచి వారి స్త్రీ రూప శక్తులు బయటకు వస్తాయి ..
శివుని నుంచి శివానీ .. విష్ణువు నుంచి వైష్ణవి
బ్రహ్మ నుంచి బ్రాహ్మణీ .. వరాహస్వామి నుంచి వారాహీ ఉధ్భవించారు .. ఈమె ఉత్తర దిక్కుకు అధిదేవత .. ఈమె చేతిలో నాగలి రోకలి ఉంటుంది .. నాగలి భూమిని దున్ని సేధ్యానికి సంకేతం .. రోకలి పండిన ధాన్యాన్ని దంచి మనకు ఆహారంగా మారడానికి సంకేతం .. ఇది బాహ్యార్ధం .. అంతరార్థం ఏమిటంటే ..
* అహంకార స్వరూప దండనాధ సంసేవితే
* బుద్ధి స్వరూప మంత్రిణ్యు పసేవితే *
ప్రతీ మనిషిలోనూ వారాహీ శక్తి నాభి ప్రాంతంలో ఉంటుంది .. మణిపూర .. స్వాధిష్టాన .. మూలాధార
చక్రాలను ప్రభావితం చేస్తుంది .. కుండలినీ శక్తిని జాగృతం చేస్తుంది .. మనలో అస్తవ్యస్తంగా ఉన్న పృధ్వీ అనే బుధ్ధినీ .. రక్తబీజుడులాంటి పిచ్చి మొక్కలతో అక్కరలేని మనలో వరసగా ఉధ్భవించే ఆలోచనలను .. లలితామాత సైన్యాధ్యక్షురాలైన దండనాయకి శక్తి అనే నాగలితో దున్నుతూ ఉంటే .. తన సైన్యం అయినటువంటి .. రధ గజ తురగ పదాతి దళాల సహాయంతో మనలో ఉన్న మానసిక వికారాలను అన్నింటినీ నాశనం చేసి .. జ్ఞానమనే సేద్యానికి అంకురార్పణ చేసి .. ధాన్యం అనే కుండలినీ శక్తిని పెంపొందించి .. రోకలితో ధాన్యం నుండి బియ్యాన్ని వేరు చేసి మన ఆకలికి అన్నమైనట్లుగా .. అలాగే మన జన్మాంతరాలలో చేసిన కర్మ ఫలాలను ( ధాన్యపు పొట్టు నుంచి బియ్యాన్ని వేరు చేసి నట్టు ) .. వేరు చేసి మోక్ష జ్ఞానాన్ని క్షుధ్భాధ తీర్చే బియ్యంలా మనకు అంద చేస్తుంది ..
వారాహి .. అనగా భూదేవి శ్రీమహాలక్ష్మి ..
వారాహీదేవి కైవల్యరూపిణి .. వైవస్వతి అని కూడా అంటారు .. అసలు ఇప్పుడు మనకు జరిగే కల్పం పేరే .. శ్వేత వరాహ కల్పం ఆయన దేవేరే ఈఈ వారాహీ ..
ఇఛ్ఛా శక్తి లలిత
జ్ఞానశక్తి శ్యామల
క్రియా శక్తి వారాహి
కేవలం రాత్రి వేళల్లో మాత్రమే పూజలందుకునే ఏకైక వారాహీ స్వరూపం లో ఉన్న లక్ష్మిదేవి ..
* ఆయు రక్షతు వారాహి * ప్రాణ సంరక్షిణి
వసంత నవరాత్రులు గణపతి నవరాత్రులు శరన్నవరాత్రులే కాక వారాహీ నవరాత్రులు కూడా మన సనాతన ధర్మంలో శాక్తేయులూ శైవులూ వైష్ణవులూ కూడా ఆషాఢ పాడ్యమి నుంచి ఈ వారాహీ నవరాత్రులలో వారాహీ దేవిని కొలుస్తుంటారు ..
భక్తుల కష్ట నష్టాలతో పోరాడే యోధురాలు ..
ఈమెను ఆరాధిస్తే శతృ భయం ఉండదు .. జ్ఞానప్రదాయని .. ధాన్యలక్ష్మీ స్వరూపమైన వారాహీని ఆరాధన చేసి దేశం సుభిక్షంగా ఉండాలనీ మనం అంతా చల్లగా ఉండాలనీ అమ్మ వారాహీని పాదాలు పట్టి ప్రార్ధన చేద్దాం ..
వారణాసీ క్షేత్ర పాలిక .. ఈ వారాహీ .. రాత్రి 11 గంటల నుంచి దర్శనం ప్రారంభం అవుతుంది .. మాకు తెల్లవారుజామున 3 గంటలకు అమ్మ వారాహీ దర్శన భాగ్యం లభించింది .. తెల్లవారుజామున 4 గంటలకు వారాహీ దేవాలయం మూసి వేస్తారు ..
కేవలం రాత్రి వేళల్లో మాత్రమే వారాహీ దర్శనం రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 4 వరకు

Comments
Post a Comment