Do Hindus worship the pig? The miracle in it is a mystery (హిందువులు పందిని పూజిస్తారా?)

హిందువులు పందిని పూజిస్తారా?
Do Hindus worship the pig
The miracle in it is a mystery

ఈమధ్య కొంతమంది మ్లేచ్చులు హిందువులను విమర్శించడానికి ఇటువంటి ప్రేలాపనలు పెలుతున్నారు. ఏ అవతారం చెప్పబడని ఆవును పూజిస్తూ గోమూత్రం సేవించేవారు విష్ణువు అవతారమైన పందిని పూజించినా ఆ వరాహ మూత్రాన్ని సేవించకుండా అవమానిస్తున్నారని ఎద్దేవా చేస్తూ విమర్శిస్తున్నారు. ఇదంతా సిరాజ్ , జాకీర్ నాయక్ చెప్పిన విషయాలను మరింత మసాలా జోడించి హిందువులను అవమానించెట్టు వ్యాఖ్యలు చేస్తున్నారు. వారి వెర్రి వ్యాఖ్యలు పక్కనబెట్టి అసలు మహావిష్ణువు అన్ని జీవజాలాలూ ఉండగా ఈ వరాహ అవతారం ఎందుకు స్వీకరించవలసి వచ్చింది, ఈ వరాహ అవతారం వారు చెబుతున్న కసువు తినే పందా అన్నది ఒక్కసారి చూద్దాము.

పురాణం ప్రకారం జయవిజయులు శాపవశాన హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగా జన్మించి హరి వైరంతో పెచ్చరిల్లి లోకాలను భయభ్రాంతులను చెయ్యగా, హిరణ్యాక్షుడు భూమిని చుట్టి  ప్రళయజలధిలో దాచగా దేవతలు వెళ్లి బ్రహ్మదేవునికి మొరపెట్టుకోగా ఆయన శ్రీహరిని శరణు వేడగా ఆయన నాసిక నుండి ఒక శ్వేతవరాహంగా ఆవిర్భవించి పెద్దదై ఆ సముద్రంలోనికి చీల్చుకు వెళ్లి భూమిని తన కోరపై నిలబెట్టి జలదినుండి బయటకు వచ్చి ఆ హిరణ్యాక్షుడిని సంహరించి భూమిని ఉద్ధరిస్తాడు. భూదేవి కోరిక మేరకు ఆవిడను చేపట్టి భూమిని ఏలుతాడు నారాయణుడు. ఈ విషయాన్ని అనుసంధానించి ఈ కల్పానికి శ్వేతవరాహ కలపమని పేరు. ఆయన భూమిని ఉద్ధరించిన తీరున వరాహస్వామి కోరలపై భూమిని నిల్పిన విగ్రహాలను మనం ఆరాధిస్తాము. కలియుగ ప్రత్యక్షదైవమైన శ్రీవేంకటేశుడు కూడా తిరుమల కొండలను ఆ వరాహస్వామి వద్ద అనుమతి పొంది తన ఆనందనిలయంగా చేసుకున్నాడు. అందుకే తిరుమలలో మొదటి నైవేద్యం వరాహస్వామికి ఆ తరువాతే వేంకటేశునికి. హిరణ్యాక్ష హిరణ్యకశిపులను నిగ్రహించడానికి అవతారం స్వీకరించిన వరాహ నృసింహ రూపాలతో వరాహనృసింహుడు సింహాద్రి అప్పన్నగా పూజలందుకుంటూ ఉన్నాడు.

ఇక భాగవతం చెప్పిన అవతారం వరాహం ( wild boar ). ఆ వరాహానికి రెండు కోరలు ఉన్నవని ఆ కోరల పై భూమిని నిలిపాడని. ఇక సైంటిఫిక్ గా చూస్తె అటువంటి వరాహాన్ని wathogs (Phacochoerus africanus ) అంటారు. అదే మనం బయట చూస్తె domestic pig ని సూకరం అంటాము. దాని సైంటిఫిక్ పేరు Sus scrofa domesticus. వరాహానికి ఒక చిరుతపులిని కూడా ఎదిరించి గెలవగాలిగిన శక్తి వుంటుంది. ఎలాగైతే homopan (చింపాంజీ) homosapien (మనిషి) కాదో, కానీ వాటి పోలికలు చెప్పుకోవడానికి ఒక రకమో ఇవి కూడా ఒక జాతికి చెందినవి కానీ ఒకటి కాదు. అందునా wathog అన్న జీవి మనకు చెప్పిన రెండు కోరల వరాహానికి సరిపోతుంది.(కింద ఆ చిత్తరువు చేర్చబడి వుంది) కాబట్టి అవి రెండూ వేరే వేరే. వాటికి రూప సాపత్యం తప్ప ఒక రకం కావు. అయినా వరాహ అవతారంలో స్వామి వరాహ శిరస్సుతో చతుర్భుజాలతో కింద భాగం మానవ దేహమ్గా అగుపిస్తాడు. ఆ వరాహ అవతారాన్ని స్వీకరించి భూమిని ఉద్ధరించడంలో ఎంతో తర్కం దాగి వున్నది. ఇటువంటి సూక్ష్మ విషయాలు సంపూర్ణంగా అర్ధం చేసుకుంటే తప్ప బోధపడవు కానీ వక్రీకరణ మాత్రమె తమ జీవన పరమావధిగా బ్రతుకుతున్న కొందరు మ్లేచ్చులు ఇటువంటి విషయాలు అవగతం చేసుకోలేరు.

హిరణ్యాక్షుడు అనగా ఎవడి అక్షులు(కళ్ళు) హిరణ్యం (బంగారం, భౌతిక సుఖాలు/సంపదలు) పై నిలిచి ఉన్నాయో అటువంటి వాడు దైవకార్యక్రమాలను నిలుపు చేసి కేవలం ధనార్జన మీద భౌతిక వనరుల మీద దృష్టి నిలిపి యజ్ఞయాగాదులను నిలిపేసి స్వార్ధంతో అంతా తనదే అని విర్రవీగుతూ ఉండగా ఓరిమి కలిగిన భూమి(అతడి ఆత్మ) కూడా దుఃఖసముద్రంలో  మునిగి వుండి హిరణ్యగర్భుని (బ్రహ్మను) వేడగా ఆయన తన బుద్ధిని ప్రచోదనం చేసే నారాయణుని శరణని ప్రార్ధించాడు. పంచభూతాలు పంచ కర్మెంద్రియాలకు అధిపతులై ఉన్నారని శాస్త్రం. ఎలాగైతే అగ్ని కంటికి, ఆకాశం చర్మానికి  అధిష్టాన దేవతో, పృథ్వి ముక్కుకు అధిష్టాన దేవత. పూర్తిగా శోకంలో మునిగి ఉన్న జీవుని ఉద్ధరించడానికి శ్వాసను నియంత్రించి భగవద్గీతలో భగవానుడు నుడివిన ధ్యాన పద్ధతి ద్వారా నారాయణుని ప్రసన్నం చేసుకుని అటువంటి హిరణ్యాక్ష  బుద్ధిని అంతమొందించి తిరిగి ఆ జీవుని ఉద్ధరించడం వరాహ అవతార అంతరార్ధం. తనలో బుద్ధి ప్రచోదనం చెందిన జీవుని ఉద్ధరించిన వరాహ స్వామి ఆ జీవుని కోరిక మేరకు అతడిలో సుప్రతిష్టుడై ఆత్మోద్ధారణ చేసాడు.

సనాతన ధర్మం అన్ని జీవజాలాలలోను దైవత్వాన్ని ప్రతిపాదిస్తుంది. తదనుగుణంగా స్వామి కూడా ఎన్నో జీవజాలాల్లో అవతరించి అంతా తన సృష్టే అని నిరూపించాడు. వానర అవతారంగా హనుమంతుడు కనబడ్డాడని ప్రతీ వానరాన్ని మనం పూజించం. తాబేలుగా స్వామి అవతార స్వీకారం చేసినందుకు ప్రతీ తాబేలును తీసుకువచ్చి ఇంట్లోనో గుడిలోనో పెట్టి పూజించం. మత్స్యావతారము స్వీకరించారని చేపలను తెచ్చుకుని పూజించం. అదే విధంగా ఆ సమయంలో స్వామి ఏ ఉపాధిలో అవతార స్వీకారం చేసారో ఆ అవతారాన్ని మనం స్మరిస్తాము తప్ప బయట తిరిగే ప్రతీ వరాహాన్ని పూజించమని కాదు. అన్ని జీవులలోను నన్ను దర్శించమని నా సృష్టిలో ఉచ్చనీచాలు లేవు అన్నింటా ఉన్నది స్వామి సందేశం. ఏ దారితప్పిన సూకరం మనల్ని చూసి ఘీంకరించినా అటువంటి వాటిని స్వీకరించక తిప్పి కొట్టి మనం నమ్మిన ఆ స్వామిని శరణు పొందడమే శుభకరం.

అందుకు స్వామే స్వయంగా భూదేవికి ఇచ్చిన అభయ మంత్రం

స్థితే మనసి సుస్వస్థే శరీరే సతి యో నరః

ధాతు సామ్యే స్థితే స్మర్తా విశ్వరూపం చ మామజమ్‌॥

తతస్తం మ్రియమాణంతు కాష్ఠపాషాణ సన్నిభమ్‌

అహం స్మరామి మద్భక్తం నయామి పరమాం గతిమ్ ॥

మరణ సమయం లో కాకపోయినా, ఎవరైతే శరీరంలో ఆరోగ్యం ఉన్నప్పుడే, మనస్సు స్వాధీనంలో ఉన్నప్పుడే విశ్వరూపుడైన నన్ను స్మరిస్తారో వారిని నేను రక్షిస్తాను. నా స్మరణ చేసిన వారి అంతిమ దశను నేనే గుర్తిస్తా ను. వారు దేహత్యాగాన్ని చేయబోయే సమయంలో స్పృహ లేకుండా కట్టె వలె, రాయివలె నిశ్చేష్ట్టులై ఉన్నను నేనే వారి చివరి దశను తెలుసుకుంటాను.. నా దివ్యధామానికి చేర్చుకుంటాను.

పిల్లిగాని నల్లిగాని పిన్న యెలుకైన గాని

కల్లగని నల్లిగాని కానియేమైన

బల్లిదుడై వేంకటాద్రి పైనున్న యాతడి

మమ్మెల్ల కాలము నేలేటి యింటిదైవము ||

Comments