Creation Structure - Big Bang Explosion? Is it God's will? The evolution of cosmology - Vishwagurunidhi
సృష్టి నిర్మాణం – బిగ్ బ్యాంగ్ విస్ఫోటమా? దేవుడి సంకల్పమా? విశ్వశక్తి పరిణామమా?
సృష్టించడం – కలిగించడం – చేయడం... ఈ మాటలకు, విడివిడిగ, అర్ధం, స్పష్టం కావాలి. లేనిదానికి, ఉనికిని చూపడం, సృష్టించడం, ఇది మొదటిది, నిరాకారానికి, ఆకారాన్ని కలిగించడం రెండవది; ఉన్నదాని నుండి మరో ఆకారాన్ని తయారు చేయడం, మూడవది.
హద్దు వుంది ప్రతిదానికి... ప్రకృతి ఉంది శాసించడానికి. అది తెలియడమే బుద్ధి చాతుర్యం – అసలు జ్ఞానo. సృష్టించడo – సృష్టిని చేయడం (నిర్మించడం) ఒకటి కాదు. దేవుడు (నమ్మకం) చేసిందేమిటో మొదట తెలుసుకొని, మనిషి తాను చేయగలిగిందేమిటో తెలుసుకోవాలి! కుండను చేస్తే మట్టిని చేసినట్టు కాదు. వస్తువును తయారిస్తే కొయ్యను కల్పించినట్లు కాదు. నగను చేస్తే, ‘మేటర్’ సృష్టించినట్లు కాదు. ఫలదీకరణ కలిగితే ప్రకృతిని సృష్టించినట్లు కాదు. ‘అండం – స్పెర్మ్’ ఎలిమెంటు – వీటి ఆరిజిన్ ఏమి? హేతువేమి వాటి ప్రారంభానికి.....
పూసల దండలో – పూలహారంలో ఉండేది కూర్పూ – నేర్పేగాని... అందులో పూసలకు – పూవులకు సృష్టి లేదు. పూసలు కృషితో తయారవుతాయి, పూవులు వాటికవే పూస్తాయి. యిందులో సృష్టి లేదు – అది ప్రకృతి సహజత్వమే. వివిధ తత్వాలతో సమీకృతం పదార్ధం, వస్తువు తయారవుతుంది పలు ఆకృతులతో. యేర్పడతాయి తారలు – తయారవుతుంది టెలిస్కోప్ – రెండింటిలోనూ లేదు – ‘సృష్టి’ – సృష్టి కార్యం. శరీరమూ అంతే – ఫలదీకరణం – ఫార్మేషన్. అందులోని ప్రాణశక్తిని చలనశక్తిని సృష్టి అని అనలేము [పదార్ధపుటునికికి – నిత్య మార్పుకు (బీయింగ్‌నెస్, నాట్ ఎగ్జిస్టెన్స్) ఆధారమేమిటి?].
A. సృష్టి – “బిగ్ బ్యాంగ్” విస్ఫోటమా?
‘‘బిగ్‌బ్యాంగ్’ ద్వారా విశ్వం యేర్పడి... వ్యాప్తి చెందుతోందనేది సైన్స్ నిర్ణయం! అందుకు ‘దేవుడి సంకల్పం’… అనేది మత విశ్వాసం! ఈ రెండిటిలోనూ సమగ్రత కొరవడింది... అయితే, అది ఏదైనా కారణ కార్యానికి అతీతమైనది, కాకూడదు. బిగ్ బ్యాంగ్, జరగడానికి పూర్వ స్థితి ఏమిటనేదే కారణంగ భావించాలి. అది తెలియాలి. కూడింది ఏదైనా విడిపోతుంది, చేరింది చెదిరిపోతుంది. యిది పదార్ధ సాధారణ ధర్మం! అలా విడిపోయింది... లేక చెదిరిపోయింది, తిరిగి, ఒకచోటకు చేరడం జరిగితేనే గదా, మళ్ళీ పూర్వ స్థితి సంభవించేది?
విశ్వం, పదార్ధ నిర్మితం! పదార్ధం ‘శక్తి’ (ఎనర్జీ) నిర్మాణం (ఫార్మేషన్). శక్తి నిర్మితం కాదు. ఒకదానితో నిర్మితమైనది, మరొక దానిని ఫార్మ్ చేయలేదు (పదార్ధ వస్తు న్యాయం కాదు) – పుట్టినది, తిరిగి పుట్టించగలదు గాని సృష్టించలేదు గదా! క్రియేషన్ ప్రోక్రియేషన్ – ఒకటి కాదు. అలాగే ప్రొడక్షన్ – మాన్యుఫాక్చర్ – మానిప్యులేషన్ (కన్‌స్ట్రక్షన్), వీటి మధ్య బేధం వుంది గదా!
‘వికర్షించే గురుత్వాకర్షణ వున్న, అధిక శక్తి,..... జీరో ఎనర్జీ, శూన్యతగా మారినప్పుడు, ‘బిగ్‌బ్యాంగ్’ (మహావిస్ఫోటకం) సంభవించి, విశ్వావిర్భావం, జరిగినట్లు, సైన్స్ సిద్ధాంతం. సిద్ధాంత సంగతి అలా వుంచితే, ఆవిర్భావం లేదా ప్రారంభం కలిగినదానికి, అంతం వుంటుంది; అనివార్యం! విశ్వం, అనంతం! దానికి, ఆవిర్భావిత(o) వుండదు. కనుక, 'బిగ్ బ్యాంగ్', సంబంధమైన సైన్స్ సిద్ధాంతం, విశ్వానికి, సంబంధించి కాదు..... అనంతం – అంతం, క్రమంలో, శక్తి – పదార్ధ సమ్మేళన, ఆకార సహితమైన సృష్టికి, అంతర్గత మార్పు, అనివార్యం కనుక, దానికి అంతం సహజమే! 'అంతం', అంటె..., అప్పటి ఉనికి మార్పిడేగాని, శూన్యతకాదు. శక్తి – పదార్ధంగా, జరిగిన మార్పిడి ఆకార పదార్ధమె, సృష్టి నిర్మాణం... శక్తి సూక్ష్మత, పదార్ధ స్థూలతే, సృష్టి ఆకారం. పదార్ధం, పునః శక్తిగా మార్పుచెంది, (permutation), అది, అనంత విశ్వశక్తిలో, లీనం అవుతుంది.
‘బిగ్‌బ్యాంగ్’తోనే సృష్టి ప్రారంభమని, సైన్స్ చెబుతోంది కదా! అది, జరిగిన సెంటర్‌పాయింట్ ఎక్కడో చెప్పలేదు సైన్స్? బాంబు, పేలాలంటె అది అంతకు ముందే తయారై వుండాలి గదా! అందుకు అవసరమైన పరికరాలు, అదివరకె, అందుబాటులో వుండాలి, మరి! అందుకు తయారీకీ, దాని మెకానిజం, తెలిసిన వాళ్ళు వుండాలి; వస్తుసేకరణ జరగాలి. బిగ్‌బ్యాంగ్‌తో సృష్టి మొదలైతే, దాని తయారీ, అంటే, దాని ఫార్మేషన్, ఎప్పుడు ఎక్కడ జరిగింది? నిండుకుండ పగిలిందంటె, అంతకు ముందే, దాని తయారీ వుండాలి..., దానిని, నీటితో, నింపివుండాలి, అందుకు, అలా చేసే వ్యక్తులూ, సాధనాలూ మెటీరియలూ వుండాలి, మరి! నీటికుండ పగలడానికి ముందే, మట్టి, నీరు వుంటె... దానిని చేసే వారూ వుంటె..., బాంబు పేలడానికి ముందు, దాని తయారీ, అవసర మెటీరియల్ వున్నట్లే, ‘బిగ్‌బ్యాంగ్’ జరగడానికి ముందు కూడ, దాని ఫార్మేషన్‌కు, ఏదోవిధమైన పదార్ధం, మేటర్ వుండి వుండాలి, మరి! అలాకాక, బిగ్‌బ్యాంగ్‌తోనే, సృష్టి ప్రారంభమైందంటున్నారంటె, దానికి ముందు ఏమీ లేనట్లే గదా? దేనికైనా, ముందుగా, దాని సంబంధ ముడి పదార్ధం లేకుండా... దాని తయారీ ఎలా వుంటుంది? బిగ్ బ్యాంగ్‌కి ముందు, దానికి కర్తగ ఎవరున్నారు? పోనీ, ఏదో వుందంటే, అదివరకే వున్నదానికి, ప్రారంభం ఏఁవిటి? ‘సృష్టి’అంటె, అదివరకు లేనిది, కలగడమే! ‘
కర్త’లేక కార్యం(కర్మ) జరగదు. అలాగే, కారణం లేక, కర్త కర్మ చేయడు, వాస్తవమేకదా! ఏదీ లేక, ఏదీ జరగదు; సత్యమే గదా! ఏది, దేనికి ప్రారంభం?
విశ్వశక్తి పరమసూక్ష్మత,(విశ్వమాత/యూనివర్సల్ న్యూక్లియస్/The Absolute Zero) నుండి, అంతరిక్ష శక్తి సూక్ష్మత – దాని పరమాత్మ(The Supreme Soul) – శక్తి – పదార్ధ సూక్ష్మత (The Microcosm) దెన్, 'Mutatis-Mutandis'; (కావలసిన మార్పులతో) ప్రాసెస్‌గ అఖిలాండ – బ్రహ్మాండం – అఖిల/నిఖిల ప్రపంచం – జగత్ (Cosmos-Cosmogony-Genesis)గ, Macrocosm, సృష్టిలో, తన ఉనికిని కలిగియున్నది – ఇలా, నిత్యం అవిచ్ఛినంగా, జరిగిపోతూనే వుంటుంది. ఇది, సృష్టి సంబంధమేగాని, విశ్వం కాదు. విశ్వం, అనంత శక్తి కనుక, దానికి , అంతర్గత మ్యూటేషన్ హేతువుగ, సృష్టిగ/ఉనికి – స్థాన – స్వరూప స్వభావ భిన్నతే గాని, బిగ్‌బ్యాంగ్ ప్రారంభం..., ప్రళయ సమాప్తం, వుండదు – అనంతం (Infinite) అనడంలోనే, యీ స్థితి వుంది. నిత్య నిర్మాణ – నిర్మూలనే తప్ప, శాశ్వత అంతం, లేదు. మైక్రో – మ్యాక్రో (సూక్ష్మ – స్థూల) ప్రోసెస్‌లో, వ్యాప్తతకు, అంతర్గత ప్రేరణ, యూనివర్సల్ న్యూక్లియస్ (Absolute Zero)లోనే, శాశ్వత స్థితి వుంది. పెర్‌వేషన్ (pervasion) and its కాంట్రాక్షన్(contraction) is the permutable perpetuity. చేరినదే చెదిరిపోతుంది; కూడినదె, విడిపోతుంది. అలా, చేరడానికి, కూడడానికి సంబంధించి, 'ఏదో', అంతకు ముందే, వుండి వుండాలి. 'బిగ్‌బ్యాంగ్', జీరోగ్రావిటీకి, శక్తి (ఎనర్జీ) క్యుములేట్ అయి వుండాలి; అదివరకే ఉన్నదానికి, ప్రారంభం ఏఁమిటి? (నిర్మాణ విషయం కాదా).
B. సృష్టి – దేవుడి సంకల్పమా(?)
“ద, గాడీజ్ నథింగ్ బట్, ద యూనివర్సల్, పెర్‌ఫెక్ట్ సర్కిల్ అండ్ విత్ యిట్‌సెల్ఫ్ – దటీజ్ ది యాబ్సెల్యూట్ జీరో! నథింగ్ ఎల్స్” [విశ్వ వ్యాప్తంగా, ఏదో, నిరాకార మహాశక్తి వుందని, దానికే మనిషి ఊహించిన, ఆకారదృశ్యతే దేవుడని – మనిషి మానసిక జ్ఞానభిన్నతను బట్టి, దేవుడి ఆకారాలు, అనేకంగా, మారిపోతున్నాయి]
జీవ పదార్ధానికి సంబంధించి, సృష్టి – స్థితి, లయకు ఆధారమైన, శక్తి విన్యాసాన్ని, మూర్తి త్రయంగా భావించి, త్రిమూర్తి క్రమంలో బ్రహ్మ – విష్ణు – మహేశ్వర పేర్లతో, సాకార దేవుళ్ళుగ, ప్రతిష్టించడం, జరిగింది. కాలక్రమంలో, మత ప్రత్యేకతతో, మూర్తి త్రయం వివిధ అవతారాలుగ, వ్యాప్తి జరిగి, అందుకు తగిన విధంగా, స్థలపురాణాలతో సహా, దేవాలయ నిర్మాణాలు – ఆచారాలు – పూజా – ఆరాధనా క్రమాలు – అందుకు, వివిధ రీతులుగ, సాహిత్య కథనాలు, శాస్త్ర ఆవిష్కరణలు, ప్రచారంలోకి వచ్చాయి. క్రమంగా మతం – మత శాఖలు – వేదాంతం – భౌతిక ఆధ్యాత్మిక విభజనగ... మనిషి జీవితకాలం, మరణానంతర, ఊహావిశేషాలు, ప్రచారమై... ‘జన్మ – కర్మ – జన్మ’ భావనగ, స్థిరమై తరాలుగ, వివిధ రీతులుగ – మానవ జీవితం – దేవుడి ‘లీలా’, విన్యాసంగ, మారింది. ఇది, ముఖ్యంగా మతం – దేవుడు – మానవులు.... కర్మ – పాపం, పేర్లతో, మానవజాతి, యుగాల పేర, సాగివస్తోంది. వివిధ ప్రక్రియలతో, సాహిత్యం, యిందుకు శాశ్వత స్థితిని ప్రతిష్టించి, ఆవిష్కరించింది.
దేవుడు సృష్టికర్తా లేదా సృష్టికర్తే దేవుడా?
దేవుణ్ణి – సృష్టికర్త... అనుకుంటె; లేక సృష్టికర్తను, దేవుడని అనుకుంటే...; ఆకార పరిధిలో, అది యిమిడిపోతుంది. కాని మతం, దేవుణ్ణి ‘తమదేవుడి’గ, ఊహించుకోవడంతో, మత ద్వేషానికి, అవకాశం వుంటుంది; మత ఘర్షణలకు... మత యుద్ధాలకు కూడా, దారితీస్తుంది.
గుణం,(ఆకార) పదార్ధ – లక్షణం. మనసు, అందుకు, మూలం. పేరు ఏదైనా, ఆకారంలో, పదార్ధమే వుంటుంది. సజీవ, నిర్జీవ భేదం, గుణ భిన్నతను కలిగియుండవచ్చు. ఆకారం – అది ఏదైనా, ‘ఉనికి’, పరిమితిని కలిగివుంటుంది. అలా వుండడమే, దాని వ్యాప్తతకు విరుద్ధం. సృష్టికర్త సృష్టి వ్యాప్తతను కలిగి యుండాలేగాని, లిమిట్ ఆకారం కాదు. దేవుణ్ణి సృష్టికర్తగ, సర్వవ్యాప్తతగ వర్ణిస్తూనే... ఆకార, వికార, మనో విశేషణాలను, ఆరోపించడం, పరస్పర విరుద్ధం. గుణం, మనసుకు చెందినదే! మనసు, శరీర సంబంధమైనదే... శరీరం, పంచభూతాత్మక, పదార్ధ, లిమిట్‌ను కలిగినదే! కనుక, దేవుణ్ణి, సృష్టికర్తగా, భావించడం సమర్థనీయం కాదు.
ఒకవేళ, సృష్టికర్తనే, దేవుడిగా, భావించినా... ఆ సృష్టికర్త ఎవరు, అనే ప్రశ్న వస్తుంది. దానితో, మతాలపోటీ తప్పనిసరి. సాధారణంగ, క్రియకు మాత్రమే, కర్త ఉనికి, వుంటుంది. ‘సృష్టికి కర్త’ – అనే దానిలో, క్రియ లోపించింది – సృష్టి – కర్త – రెండూ, నామవాచకాలే. ‘క్రియ’ అనే స్థితిలో, కర్తకు, అవకాశమే లేదు కనుక, ‘సృష్టికర్త’ అనడంలో, ‘యాజమాన్యత’ మాత్రమే, ధ్వనిస్తోంది కనుక, దీనిలో, క్రియాపూర్వక కర్తకు సమగ్రత లోపిస్తోంది.
దేవుడే, సృష్టిని ‘చేసి’నట్లుగ, మతం, ప్రచారిస్తోంది. ‘చేయడం’ – సృష్టి ‘చర్య’ కాబోదు... లేని ‘స్థితి’కి – ఉనికిని కలిగించడం – సృష్టించడం. ఉన్నదానినుండి, ఆకారాన్ని తయారించడం... ‘చేయడం’! కనుక, దేవుడు, సృష్టి చేయడం, అనేది, సృష్టికార్యం, కాబోదు, మరి..; దేవుణ్ణి, సృష్టికర్తగా భావించే అవకాశం లేదు.
ఏదైనా, దానంతట అదే ‘యేర్పడితే’..; అది, ఆకార ఉనికికేగాని, చేయబడినది కాదు.
అలాగే, అది, సృష్టింపబడినదీ... కాదు... కాబోదు. అలా యేర్పాటులో కూడ, దానికి ‘మూలం’, అది వరకే, వుండి వుండాలి. మూలం, గతంలోనే వుంటే... దానితో యేర్పడేది, చేయబడేదే! సృష్టి కాబోదు. కనుక, సృష్టికర్తకు; అవకాశం లేదు...
‘స్వయంభుః’ అనడంలో, పరిశీలనాత్మక పరిశోధన ద్వారా, ‘సత్యశాశ్వత’ ఎరుక కావాలి.
బ్రహ్మదేవుడు – సృష్టికర్త
మత విశ్వాసం ప్రకారం, సృష్టికర్త ‘మగ’వాడే! శక్తి – పదార్ధ సంయోగంతో (టు ఇన్ ఒన్) ద్వంద్వ సృష్టి ఆవిర్భావం. విశ్వశక్తిని, ఈశ్వరునిగా భావిస్తే... సృష్టి పదార్ధాన్ని, స్త్రీ శక్తిగా అన్వయించుకుంటే..., ఈశ్వర అర్ధనారీశ్వర తత్వంలో, సృష్టిలో, పురుష ప్రత్యేకత కన్పించడం లేదు మరి! సృష్టికర్తగా భావించబడే బ్రహ్మ మనసునుండే, మగ – ఆడ ఆవిర్భవించినట్లు లేదా కలిగినట్లు చెప్పడాన్ని గమనిస్తే బ్రహ్మ కూడ, కేవలం పురుషతత్వంగా అనిపించదు. అలాగే, పద్మభవుని ఆవిర్భావానికి స్థానమైన, పద్మనాభుని, స్త్రీ పురుష జీవి తత్వం, ఎలాటిది? ఇవన్నీ కేవలం పురాణ కథలుగ, కల్పితాలుగ, కొట్టి పారవేయలేం. జీవి పుట్టుకలో, ఆడ – మగ (అండం – జీవకణం) సంపర్క ప్రమేయం, సంయోగం, జీవిపునరుత్పత్తి క్రియలో తప్పనిసరి, అనే విషయం గమనించాలి. పుట్టుకను కలిగినదే, మరో పుట్టుకకు కారణమవుతుందనేదిక్కడ స్పష్టమే! మరి, సృష్టి సంకల్పంలో, దాని ప్రమేయంలో, కేవలం, పురుష కారణమే ఎలా సాధ్యం?
పదార్ధ చలన ఉనికి, పరస్పర విరుద్ధ ద్వంద్వ ప్రమేయమే! గురుత్వాకర్షణలోనే కాదు, స్త్రీ పురుష పరస్పర ఆకర్షణ – వికర్షణలలో, ‘పాజిటివ్ – నెగిటివ్’ అనబడే విధానం ప్రత్యక్షంగానో, పరోక్షంగానో వుంటుంది. ప్రకృతితో సహా, జీవ – నిర్జీవ సృష్టిధర్మం అదే! ఈ స్థితిలో పురుషదేవుడే, ప్రత్యేకంగా సృష్టికర్త అనుకునే అవకాశం ఏది? ఎలా?
ఇంతకూ, అనుకూల – వ్యతిరేక ఆకర్షణ, వికర్షణ ధర్మం, శక్తి – పదార్ధ సంయోగ సృష్టిపదార్ధంతోనే ప్రారంభమైనట్లా? సృష్టికర్తగా భావించబడే బ్రహ్మదేవుడు, జీవి సృష్టికర్తా లేక, సృష్టి పదార్ధ సృష్టికర్తా? ఏదోవిధంగ, జన్మ/పుట్టుకను కలిగిన బ్రహ్మ, పుట్టుక ధర్మాన్ని కలిగియున్న జీవులకే పరిమితమా? దేవుళ్లకూ (ఏవిధంగా, ఏ పేరుతోనైతేనేమి) సంతాన ఉత్పత్తి శక్తిని కలిగియున్నప్పుడు,.. వారి జన్మరాహిత్యతతో జన్మకు కారణం, ఎలా వుంటుంది? ఇంతకూ, జన్మ ఉనికికి, కారణం, ‘కలిగించడ’మా? లేక పుట్టించడమా? క్రియేషన్, ప్రోక్రియేషన్, అనే మాటలను, యీ తీరులో పరిశీలించాలి. ‘ఎలా అయితే ఏమి, మనం పుట్టాం, దట్సాల్’! అనుకోవడాన్ని కాదనలేం గాని, నిజం, వాస్తవం – సత్యం..., యీ క్రమంలో, విషయ పరిశీలనతో, దేనికైనా, దాని ప్రారంభాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయడం, ఆలోచనా ప్రత్యేకతను కలిగిన, మనిషికి ధర్మమేకదా! తత్వ పరిశీలన, సత్యనిత్యత, ఎరుకను తెలియజేసే ప్రయత్నమే యిది.
సృష్టి పదార్ధం బ్రహ్మ! హిందూ పురాణ సాక్షిగ ‘బ్రహ్మ’కు పుట్టుక వుంది. కనుక బ్రహ్మ (పదార్ధం) పుట్టుక ప్రక్రియకే పరిమితంగాని, సృష్టికి కాకూడదు మరి! అలాగే, త్రిమూర్తుల ‘జననం’ కూడ! పురాణ కథనం ప్రకారం (ఆది)శక్తి నుండి వారిది ఉత్పత్తి/పుట్టుక మాత్రమే...! సృష్టికి (పదార్ధం) మూలం, ఆధారం ఇందుకు అతీతంగ, మరేదో ఒకటి వుండి వుండాలి!... దానినే పరమాత్మగ.. పరిశుద్ధాత్మ (హోలీస్పిరిట్)గ మతపరిధిలో పరిగణింపబడుతున్నది. అయినా, తత్సంబంధ ‘సత్యం’ అందుకు అతీతమే!
సృష్టిలోనే దేవుడి ఉనికి అవసరం లేదు – పవిత్ర సంకల్ప దేవుడి (?) సృష్టిలో అపవిత్రత ఎలా చోటుచేసుకుంది?
సృష్టికర్త (?) సంకల్పమే నిర్మాణాన్ని జరిపించిందనుకుంటే ఆ నిరాకార సంకల్పానికి తగినట్లుగనే సాకార పదార్ధ నిర్మాణం వుండాలి కదా! సృష్టి లేని ‘కాలం’లో కూడ సృష్టికర్త వుండి వుంటేనే దరిమిలా తన సంకల్పానుసారం సృష్టి ఆవిష్కరణకు అవకాశం వుంటుంది. దీనినిబట్టి సృష్టికి పూర్వం దేవుడి ఉనికి సృష్టిలో లేనట్లే కదా! అది మరెక్కడ? కనుక, సృష్టిలోనే దేవుడి ఉనికికి అవసరం లేనట్లే కదా! అదేవిధంగా సృష్టికర్త (దేవుడు?) సర్వ పవిత్రతను, శక్తిని, సర్వవ్యాపకత్వాన్ని కలిగి వుండాలి! అట్టి సృష్టికర్త సంకల్పం తత్కారణ సాకార సృష్టి అందుకు భిన్నంగా వుండే అవకాశం లేదు. అలా దైవశక్తి ఉన్నతికి విరుద్ధం.
మానవధర్మం, యిందుకు భిన్నంగా వుండాలి. సాధారణ విషయమే! మరి, పవిత్ర దేవుని సంకల్పానుసారం జరిగిన సృష్టిలో తత్ విరుద్ధమైన అపవిత్రతకు చోటు ఎలా లభించింది? సృష్టి సర్వం పవిత్ర దేవుని సంకల్పమే అయినప్పుడు సృష్టిలోని ప్రతి సూక్ష్మాంశం కూడ ఆ పవిత్రతనే కలిగివుండాలి! నిత్య అనుభవంలో వాస్తవం మరో విధంగా వుంది. పైగా ఆ అపవిత్రతకు పాపానికి కారణమనుకునే సాతాన్ వునికి సృష్టి కర్త (దేవుని) సమీపంలోనే వున్నట్లు చెప్పబడుతోంది. సృష్టికి పూర్వమే దాని ఉనికి అవసరం దేవుడికి (సృష్టికర్తకు) ఎందుకు కలిగింది? దానికి, మరో అపవిత్ర సృష్టికర్త వున్నట్లా? అది దేవుని సమగ్రతకు విరుద్ధం.
దేవుడి ద్వారానే సృష్టి జరిగితే, కన్నవారి పోలికలు పుట్టిన వారికి రాకూడదు – జీవి మనుగడకు (పుట్టుక నుండి గిట్టేవరకు) జీవే కారణం
ఏ జీవికైనా, కన్నవారి పోలికలు పుట్టినవారికి వస్తాయి. అయితే, ఆ పోలికలలో కన
్నవారి పోలికలు పూర్తిగా గాని, ప్రత్యేకంగా గాని, సంపూర్ణంగా గాని వుండవు. ఆ సంతానంలో తండ్రి పోలికలు గాని, లేక తల్లి పోలికలు గాని ఎక్కువగా వున్నంత మాత్రాన ఆ తండ్రిదో, తల్లిదో సంపూర్ణమైన పోలిక సంతానానికి వచ్చిందనడానికి వీలులేదు. ఒక్కొక్కమారి తలిదండ్రుల పోలికలు సమానంగా సంతానంలో రావచ్చు. ఎలా జరిగినా, కన్నవారి పోలికలకు ఎంతైనా కొంత భిన్నత్వంతో సంతానం పోలికలు వుంటాయనేది స్పష్టం. అంతేకాదు, ఒకే తల్లిదండ్రులకు జన్మించిన వారందరూ ఒకే మాదిరి పోలికలను కలిగి వుండరనేది కూడ అనుభవమే. సాకారంగా వూహించబడిన దేవుడి ద్వారానే సృష్టి జరుగుతోందనుకుంటే, కన్నవారి పోలికలు పుట్టిన వారికి రాకూడదు. ప్రతిక్షణం పుట్టే కోటాను కోట్ల రకరకాల జీవుల షేప్‌లకోసం ‘పాటర్న్’లను తయారు చేసుకోవడం సర్వ శక్తివంతుడైన ఆ దేవుడికి కూడ అయ్యే పని కాదు. జీవి పెరిగే విషయంలోనూ, మరణించే విషయంలోనూ దేవుడి ప్రమేయంలో కూడ యింతే నిజం వుంటుంది. ‘అలా బ్రతకాలని, యిలా చావాలి అని దేవుడు పెట్టాడు, తలరాత వ్రాశాడు, విధి నిర్ణయించాడు’ అని అనుకోవడంలో కూడ అర్ధం కన్పించదు. జన్మకే కారణం కాని దేవుడు తక్కిన వాటికి మాత్రం ఎందుకు సంబంధాన్ని కలిగి వుంటాడు. కనుక, మనిషితో సహా జీవి పుట్టుకకు గాని, దాని బ్రతుకునకు గాని, మరణంతో గాని, దేవుడు (సృష్టికర్త అనబడే ఆకారానికి) సంబంధం ఏ మాత్రం లేదనిపిస్తోంది. అందుచేత పుట్టుకనుండి గిట్టేవరకు జీవి మనుగడకు జీవే కారణం అవుతోంది గాని, మరొకరు, కారణం కాదు అనేది నిర్వివాదం.
మనిషితో పాటు దేవుడూ అభివృద్ధి చెందాడు
కుడి ఎడంగా ఏదో విధంగా దేవుడి రూపం మానవ ఆకారానికి దగ్గర పోలికలను కలిగివుంది. సూక్ష్మంగా పరిశీలిస్తే, దేవుడి రూపం కూడ, మానవాకారంతో పాటే, బుద్ధితోపాటే పరిణామం చెందినట్లు సులభంగా అర్థం అవుతుంది. కనుక మానవుడు తనతోపాటు దేవుణ్ణి కూడ అభివృద్ధి చేసుకుంటూ వస్తున్నాడనేది స్పష్టంగా అర్ధమౌతోంది. సృష్టి క్రమాన్ని, దానిలోని భిన్నత్వాన్ని పరిశీలించినా యీ విషయం స్పష్టం అవుతోంది గదా!
దేవున్ని తయారించి, పేరుపెట్టే మనిషి – దేవుడికి, ముందా, తరువాతా?
ఏదైనా ఒకటి ముందుగా వుందంటేనే, దానిని, చేయడమో, ఏదో ఒక, ఆకారాన్ని యేర్పరచడమో, జరగాలి. అలాగే, సృష్టి ఆకారాన్ని, చేయడానికి కూడ, అలా చేసిన వారు, ఎవరో ఒకరు వుండాలిగా! అసలు, చేసేవారు లేకపోతే, చేయడం, చేసిందీ, ఏదీవుండదు... సృష్టి వుంది. మరి! దానిని చేసిన వారు, ఏదో రూపంలో, ఏదో పేరుతో, ఎవరో ఒకరు, వుండాలి కదా!… శిలలతో, విగ్రహాల ఆకారాలను చేయడానికి, మనిషి వున్నట్లే – మనిషితో సహా, సృష్టిని చేసినవానిని, దేవుడని, ఎందుకనుకోగూడదు? పోని, దేవుడు కాకపోతే, మరేదో ఒకటి మొదలంటూ, ఒకటి వుంటేనే కదా, ఆ తరువాత ఏదైనా వచ్చేది, కలిగేది, చేసేది, అయ్యేది? సృష్టికి, ఆ మొదటి దానిని గురించి, చెప్పడానికి, వినడానికి, పిలవడానికి, అనుకోడానికి – ఏదో ఒక పేరంటూ వుండాలిగదా! అందుకే కదా, మనుషులతో సహా, చిన్నదో, పెద్దదో; ప్రాణం వున్నదో, లేనిదో; ప్రతిదానికి, ఏదో ఒక పేరు వుంటుంది. ఆకారాన్ని గుర్తుపట్టడానికైనా, పేరుండాలి, మరి! సృష్టిలో, కోటానుకోట్ల, ఆకారాలున్నాయి. అయినా, వాటన్నటిని కలిపి, ‘సృష్టి’, అని, ఒక పేరున్నట్లే, దానిలో వున్న, ప్రతిదానికి, ఏదో ఒక పేరుండాలి. అలాగే, సృష్టికి ముందు, ఏదో ఒకటి, లేకపోతే, ‘సృష్టి’, అనేది, ఏదీ వుండేది కాదు. సృష్టికి ముందున్న దానికే, ‘దేవుడు’, అని, పేరుంది. భాషకొక తీరుగా, ‘దేవుడు’ – అనే, తెలుగు మాటనే, రకరకాలుగ పిలువబడుతోంది. అయినా, అన్ని పేర్లూ, ‘దేవుడు’, అనే, ఆ ఒక్కదానికే! సృష్టి అనేది; అంతే మరి! దానిని, భాషకొక విధంగ పిలవడంలోనే, భేదంగాని, అన్ని పేర్లలోనూ, ‘సృష్టి’, అని, అర్థమే గదా! అలాగే, అంతా, అందరూ మనుషులే అయినా, ఒక్కొక్కరిని, గుర్తుగా పిలుచుకోడానికి, వేరు వేరుగ, పేర్లున్నాయి. అయినా, అందరినీ కలిపి, జాతిగా, ‘మనుషులు’, అనే పేరు ఒకటి వుంది. ఏదైనా అంతే! అలాగే, ప్రతి ఆకారానికి, దాన్ని గుర్తుపట్టడానికి, ఏదో పేరున్నట్లుగానే, తెలుసుకోడానికి, ఆకారం లేకపోయినా, చూచుకోడానికి, పిలుచుకోవడానికి, కన్పించని వాటికీ, పేర్లు వుంటాయి; అలా వుండాలి కూడా! లేకపోతే, దేనినీ, గుర్తుపట్టడానికి, పిలవడానికి, ఉపయోగించుకోడానికీ, అవకాశం వుండదు మరి! కాని, ఆకారమే లేని దానికి, కనపడని దానికి, పేరు పెడితే... పిలిస్తే, పలికేది లేదు, కనపడేదీ లేదు. ఆకారాన్ని చూచి, గుర్తుపట్టి, పిలవడానికే, పేరు. ఆకారమే లేని దానికి, పేరుపెట్టినా, గుర్తుపట్టడానికి వీలవదు. మరి, అలాంటిది, దేవుడైనా, ఇంకోటైనా, మరేదైనా, ‘ఉంది’, అని అనుకోవడం వీలవదు. అయినా, ఆకారం తయారుచేసి, దానికి, పేరుపెట్టి, గుడికట్టి, ప్రతిష్ఠించి, పూజలు చేసేది, చేయించేది, మనిషే! దేవుణ్ణి తయారించి, పేరుపెట్టే మనిషి – దేవుడికి, ముందా, తరువాతా?
దేవుడు సృష్టి చేసివుంటే, సృష్టి కార్యనిర్వహణ, దాని కర్త (కర్త ఉనికిని, వూహిస్తే), వేరుగనే వుండాలి
సాధారణంగ, కర్త – కర్మ(క్రియానిర్వహణ), దాని ఫలితం..., దేనికదే, వేరుగ వుంటాయి.. అనుభవం, కర్తలో స్మృతిగా మిగిలిపోయినా, కర్త –
కారణం – కార్యం, వేరు వేరుగనే వుంటాయి. కారణ సంకల్పం సంగతి అలా వుంచితే, సృష్టి కార్యనిర్వహణ, దానికార్త (కర్త ఉనికిని, వూహిస్తే), వేరుగనే వుండాలి. దేవుణ్ణి, సృష్టికర్తగ వూహిస్తే, అలా భావిస్తే, నమ్మితే..., ఆ దేవుడు, సృష్టి నిర్మాణానికి పూర్వమే, దానికి సంబంధంలేని స్థితిలోనే, వేరుగ వుండాలి. 'ఉండడం', అనేది, ఉనికిని తెలియజేస్తుంది కనుక, దేవుడి వునికిని కలిగిన, మరొహటి ఏదో, వేరుగనే వుండాలి మరి! అంటే, దేవుడు చేసినట్లు చెప్పబడే సృష్టిలో, దేవుడు వుండే అవసరం, అవకాశంలేదు మరి! అంతకు ముందే దేవుడి నివాసం, వేరుగ వుంది కనుక, అప్పటికి సృష్టి లేదు కనుక, సృష్టి సంబంధంలేని, వేరొక దానిలో దేవుని నివాసం, వుండాలికదా! అండ – పిండ అఖిలాండ – బ్రహ్మాండంగా భావించబడే, ఈ భూగోళ జీవులుండే సృష్టిలో, దేవుడు లేనట్లేనా? అలావేరుగ, ప్రత్యేకంగ, అంతకు పూర్వమె, మరోచోట, దేవుడు లేకపోతే, అందుకు వేరుగ, సృష్టి నిర్మాణ, నిర్వహణ, సాధ్యమయ్యేది కాదుమరి. అంటె (సాకార దేవుణ్ణి సృష్టికర్తగ భావిస్తే), తాను చేసిన – చేస్తున్న సృష్టిలో, దేవుడు లేడన్నమాట! సృష్టికి సంబంధం లేని స్థితిలో, మరెక్కడ, దేవుడు వున్నట్లు అనుకోవలసివస్తే..., అది, పరమాత్మ సర్వ/విశ్వ వ్యాప్తతకు, విరుద్ధమైనదిగా, అనుకోవలసివస్తుంది. ఒకవేళ, సృష్టియావత్తు దేవుడిలోనే వుందనుకున్నా, ఆ దేవుడికి, బాధ్యతా ఉనికి, వేరొకటి వుండాలి...
దేవుని వునికి ఒక నమ్మకం; సృష్టికి సంబంధించి దేవుని ప్రమేయం కూడా నమ్మకమేనా?
మనిషి జన్మకు మనిషే కారణమా? అలాగే, జీవులన్నిటి విషయంలోనూ అంతేనా? మనిషితో సహా, జన్మించిన జీవే, మరో జీవి జన్మకు కారణమవుతున్నట్లు తెలుస్తూనే వుంది. దీనినే, ‘ప్రొక్రియేషన్’ అంటారు. అయితే, మనిషితో సహా, అన్ని జీవులను, దేవుడే చేశాడని మతనమ్మకం... (‘చేయడం – పుట్టించడం’ – సంకల్పం – సంపర్కం అనడంలో – అర్ధ భేదం – క్రియాతి భేదం, వుంది) అయితే, సైన్స్ చెబుతోంది, జీవపరిణామమని. సైన్స్‌కు, పరిశోధనా ఆధారం వుంది. మతానికి, నమ్మకమే, సర్వం. ‘ఎవరి నమ్మకం వారిది’, అనుకునే విషయం, కాదిది. ఎందుకంటే, ఆకార, అనుభవ పూర్వక, మనిషి మానవజాతి ప్రత్యేకత స్పష్టంగా వుంది. ‘దేవుడి’ విషయంలో, పవిత్ర గ్రంథాలు కూడ, మనిషి ప్రమేయాన్నే కలిగియున్నాయి. దేవుడి, స్వరూప స్వభావాలతో, సహా, గ్రంథాలు ఆధారంగానైనా, వాటి, పూర్వస్థితికి ప్రారంభానికి మనిషి కారణం, వుంది.. దేవుడు ఉనికే, మనిషి నమ్మకమైనప్పుడు... మనిషితో సహా, సృష్టికి సంబంధించిన, దేవుడి ప్రమేయం కూడ, మనిషి ఊహగనే, భావించాలా? జీవసంబంధ, గత అవశేషాలు ఆధారంగ, జీవ పరిణామాన్ని, జీవుల గురించి, సైన్స్ చూపించే, ప్రామాణిక ఆధారాలను కాదనగలమా?
వునికిని కాదనలేం: వస్తు ఉనికిని, కాదనలేం. కారణం, లేని ఉనికికి, అర్ధం లేదు. కారణ – కార్యం అనివార్య సంబంధాన్ని కలిగినదే! ఉనికి, స్పష్టమే కనుక, అందుకు, కార్యం – దాని కారణం, తప్పనిసరి. కారకులు (కర్త) ఎవరనేది, తెలియవలసి వుంది. ఇందులో, కేవలం, నమ్మకమే, సమాధానం కాదు. శక్తి – పదార్ధ సంబంధ, సృష్టి వుంది; జీవపదార్ధ, ప్రకృతి వుంది. ఇది స్పష్టమే! వీటి విషయంలో, ప్రత్యేక నమ్మకం, అవసరం లేదు. వాటి ఉనికి, యేర్పాటుకు సంబంధించిన, ‘కారణ కార్య’, స్పష్టతే, కావాలి, మరి!
దేవుడు భూలోకాన్ని నిర్మించినట్లు మనసు వూహించవచ్చు: ఆకారదేవుడు, నిర్గుణంకాదు. నిరాకార నిర్గుణ లక్షణం, సర్వవ్యాప్తతకే, సంకేతం. కనుక, నిరాకార, నిర్గుణ, విశ్వవ్యాప్త, దైవశక్తిని సాకార, గుణసహితంగ ఊహించి, భావించి, సృష్టిలోనే (బహుశా భూగోళంగానే) నివాసాల కల్పన, యేర్పాట్లు జరిగినట్లు, అనుకోవలసి వస్తోంది. సృష్టితో సహా, భూలోకాన్ని, మానవ 'కాలనీ'గా దేవుడు నిర్మించినట్లుగా కూడ మనసు వూహించే అవకాశమూ వుంది.
సృష్టి మొత్తానికి సృష్టికర్త (దేవుడు) అవసరం లేదు
నీరు ఎక్కువకాలం ఒక చోట నిలవవుంటె నాచు మొక్కలు పుడతాయి. కొన్ని జీవులు వృద్ధి పొందుతాయి. పదార్ధం కుళ్ళితే పురుగులు వుంటాయి. పేడ నిలవ వున్నా, జీవి శవం కుళ్ళినా అందులో పురుగులు పుట్టి తిరుగాడుతూ వుంటాయి. చెత్త ప్రోగులో తేళ్ళు పుడతాయి. నిజానికి నీటిలో గాని, కుళ్ళిన పేడ, కళేబరాలలో గాని, చెత్త పోగులో గాని, ఇదివరకే ప్రత్యక్షంగా కన్పించే జీవులు, పురుగులు, తేళ్ళు లేవు. ప్రారంభంలో లేనివి, అవి నిలవ వుండేటప్పటికి ఆ జీవులు ఎక్కడినుండి వచ్చాయి? దేవుడే సృష్టించాడనుకుంటే, కుళ్ళిపోయిన, మురిగిపోయిన చోటులే దొరికాయా తన అమోఘ సృష్టి చేయడానికి? పేడలో పురుగులు, చెత్తలో తేళ్ళు తప్ప మరొకటి క్రొత్తగా పుట్టవు. వాటి సృష్టిలో ఒక ప్రత్యేకత కనిపిస్తూ వుంటుంది. పేడ గుట్టలో కప్పలు ఎందుకు పుట్టవు? చెత్త పోగుల్లో పాములు ఎందుకు పుట్టవు? దేవుడు తలుచుకుంటె ఏమైన చేయవచ్చును గదా! పశువులు మృగాలలో కూడ కొన్నిటికి సంతానం వుండకపోవచ్చు. మానవులలో కూడ అంతే. ఒకవేళ, దేవుడు తాను పుట్టించాలనుకునే సంతానం (సృష్టి)కి ఆధారంగా గతంలో తానుచేసిన సృష్టిని వుపయోగించుకుంటున్నాడను కుంటె, అందులో పక్షపాతం ఎందుకు? పోనీ, తన వాళ్ళనూ, తనను తలుచుకునే వారిని మాత్రమే సృష్టికి ఎన్నిక చేసుకుంటున్న
ాడంటే అదీకాదు. తనని నిత్యము పూజించి, భజన చేసేవారికి సహితం సంతానం లేని సందర్భాలు వున్నాయి. సంతాన ప్రాప్తి కోసం నానా అవస్థలు పడే దైవభక్తులకు సహితం సంతాన భాగ్యం కలగని సంఘటనలు ఎన్నో వున్నాయి. వద్దు మొర్రో అంటున్నవారికి, దేవుడి పేరు తలవనివారికి సహితం కొల్లలుగా పిల్లలు పుడుతున్నారు. ఇది దేవుడి మాయగా మనం అనడం సబబు కాదు. అంతేకాదు, కృత్రిమ పద్ధతులు ద్వారా, శస్త్రచికిత్సల ద్వారా, వైద్య ప్రక్రియల ద్వారా, సృష్టి కార్యాన్ని మానవుడు విజయవంతంగా నిర్వహించిన సంఘటనలు, సందర్భాలు మానవుడికి బుద్ధి తెలిసినప్పటినుండి నేటివరకు వున్నాయి. కనుక సృష్టికి దేవుడు అవసరము లేక దేవుడు సృష్టికర్త అని, హేతువాదంగాగాని, తార్కికంగా గాని చెప్పుకోడానికి అవకాశం లేదు. సృష్టికి దేవుడి సంబంధం లేనప్పుడు, ఆ దేవుడికి మనిషికి సంబంధం ఏమిటి? ఎందుకుండాలి?
అయితే, మొదట మనం చూచినప్పుడు, ఆ తరువాత మనం చూచిన పురుగులు కన్పించకపోవచ్చు. అలాగే చెత్త ప్రోగులో తేలు గ్రుడ్లు, పిల్లలు కన్పించకపోవచ్చు. అలాగే కుళ్ళక ముందు, మురిగిపోక ముందు, అందులో పురుగుల పోలికలు కన్పించకపోవచ్చు. కాని, నీటిలో సూక్ష్మజీవులు వున్నాయి. అలాగే శరీరంలో (జీవ పదార్ధంలో) సూక్ష్మజీవులకు ఆధారాలు వున్నాయనేది విజ్ఞానశాస్త్రం సహితం అంగీకరించే సత్యం. అయితే, అనుకూల పరిస్థితులలో, పరిణామ క్రమంలో సూక్ష్మ రూపంలో వున్న ‘జీవ పదార్ధం’ అందుకు తగిన ఈ భౌతిక రూపాన్ని అభివృద్ధి చేసుకుంది అనేది మనకు అనిపించే విషయం. సృష్టి మొత్తానికి సృష్టికర్త (దేవుడు) అవసరం లేదు అనే విషయాన్ని మాత్రమే యిక్కడ ప్రస్తావించడం జరిగింది.
అండం – పిండం – బ్రహ్మాండం క్రమంలో – సృష్టి పరిశీలన
క్రియేషన్ – ప్రోక్రియేషన్, అనే మాటలకు, అర్ధభేదం వుంది. అలాగె, ఫెర్టిలిటీ – బిగెట్ – ప్రొడ్యూస్ – ప్రొజనరేట్ – జనరేట్ – ఎన్‌జెండర్ ఆరిజినేట్ – వీటి మధ్య కూడ, అర్థభేదం వుంది. సాధారణంగ, ఏదైనా, ముందుగా యేర్పడిందే, దరిమిలా, మరో యేర్పాటుకు, హేతువు అవుతుంది. అలాగే, కలిగినదే, కలిగిస్తుంది. పుట్టుకను కలిగిందే, మరో పుట్టుకకు కారణమవుతుంది. కనుక, జీవి పుట్టుకకు, అండం, మొదటిది. అయినా, దానియేర్పాటుకు, జీవపదార్ధం – దీనికి పూర్వస్థితి, సృష్టిపదార్ధం – ఇందుకు, విశ్వశక్తి, పదార్ధంగా మార్పు చెందడమె – పదార్ధ ఉనికికి, ప్రధాన కారణం.
జీవజాతి పరిణామక్రమం అనుసరించి చూస్తే, అండం – పిండం – బ్రహ్మాండం, జీవ పదార్ధ, పుట్టుకను, పరిమితంగానే, భావించవలసి వస్తుంది. కనుక, యిది (జీవసృష్టి) అనంతం కాదు. అనంత విశ్వంలో, యిది, పరిమిత స్వల్పభాగమె! అంటె, మనం అనుకునే 'సృష్టి', లాంటివి, అనంత విశ్వంలో, అనేకం, వుండాలిమరి!.... అండ – పిండ – అఖిలాండ – బ్రహ్మాండానికి, ప్రారంభం, 'అండ'మే కనుక, అండం మరో జీవినుండి, పుట్టిన జీవపదార్ధమే కనుక, – అండ ప్రారంభ స్వరూప స్వభావాలు, ఎలాటివైనా,.. జీవి పుట్టుక, అండంతోనే ప్రారంభం కనుక, ఆకారం, దేనికైనా, దాని ఉనికికి, పుట్టుకకు, దానికి పూర్వ స్థితిలో, అందుకు మరొకటి కారణం, అవుతోంది.
ఈ క్రమంలో, సృష్టిని విశ్లేషిస్తే, కమలనాభుడు, అలాగే, పద్మభవునికి, పూర్వస్థితి – "ఏదో" ఒకటి వున్నట్లేకదా!('స్వయంభుః' ఆకార రాహిత్యత విశ్లేషణకు విధానం, మరోవిధంగా వుంటుంది)...... సృష్టి పరిస్థితీ అదే మరి! పేరు ఏదైనా, మత ప్రాతిపదిక ఆకారదేవుణ్ణి, సృష్టికర్తగా, భావించే ముందుగా, అంతః పూర్వస్థితిని, గమనించవలసి వుంది.
ఇలా, మత నమ్మకాన్ని ప్రశ్నించడంకాదు సుమా! క్షీరసాగరం – జీవజం; విశ్వశక్తి – హోలీ స్పిరిట్(పరిశుద్ధ ఆత్మ) – ఈ మాటలకు, అత్యంత క్షుణ్ణంగా, పరిశీలించి, వాటి ‘ఆరిజన్’ను 'ఎనలైజ్' చేయవలసి వుంది.
C. సృష్టి ఏర్పాటు – విశ్వశక్తి పరిణామమా?
విశ్వశక్తి పరిణామం: సృష్టి – స్థితి – లయం
విశ్వ ఆవిర్భావం, దాని వ్యాప్తత, సృష్టి ఏర్పాటును గురించి, మతాలు, సైన్స్ అనేక రకాలుగా చెప్పినప్పటికి, గురువుగారు వారి బ్రహ్మ జ్ఞానంతో, శాస్త్రీయ పద్ధతిలో, దానిని గురించి ఒక క్రొత్త సిద్ధాంతాన్ని వారి శైలిలో చెబుతారు. వారి ప్రకారంగా, విశ్వము, అనేది, విశ్వమాత (మదర్ న్యూక్లియస్/దివ్య మాత) ద్వారా నిరంతరంగా వెలువడిన విశ్వశక్తి, కారణంగా ఏర్పడుతుంది. విశ్వమాత నుండి వెలువడినటువంటి విశ్వశక్తి, అనేక పెనుమార్పులతో విశ్వ పదార్ధంగా మారుతుంది. విశ్వశక్తి అనేక దశల ద్వారా మార్పు చెంది పదార్ధంగా రూపాంతరం చెందుతుంది. విశ్వ శక్తే, "ఇంటర్ ఆస్కులేటరీ మెటమోర్ఫోసిస్" (Inter-Osculatory Metamorphosis), ఇంటర్నల్ రిలేటివిటీ అనే ప్రక్రియ ద్వారా విశ్వ పదార్ధంగా (బ్రాహ్మన్ – సృష్టి కర్త) మార్పు చెందుతుంది. “మోనాడ్” అనేది విశ్వపదార్ధం యొక్క సూక్ష్మాతి సూక్ష్మ యూనిట్. ఎంబాడీడ్ ఎనర్జీ సృజనాత్మక బ్రహ్మ పరమాత్మ (విశ్వశక్తి, విశ్వపదార్ధంగా, మారడం అనేక దశలలో జరుగుతుంది. ఆ దశలకు అతీతంగా వెళితే కాని అది విశ్వపదార్ధంగా ఎలా మార్పు చెందుతుంది, ఎలా పరిణామం చెందుతుందనేది తెలియదు).
విశ్వశక్తి వెలువడినటువంటి – విశ్వమూలం నుండి, మొదటగా నెగిటివ్ ఎనర్జీ (బ్లాక్ ఫోర్స్), డార్క్ మ్యాటర్ వెల
ువడుతుంది. ఈ నెగెటివ్ ఎనర్జీ, డార్క్ మేటర్ వెలువడిన తరువాత, వాటికి "గ్రావిటీ స్ట్రగుల్"ఏర్పడుతుంది. ఈ గ్రావిటీ స్ట్రగుల్ ఏర్పడినప్పుడు విశ్వపదార్ధం ఫార్మేషన్‌కి (ఏర్పడడానికి) అవకాశం ఉంటుంది (అంతవరకు విశ్వ పదార్ధం ఏర్పడటానికి అవకాశమే లేదు). గ్రావిటీ స్ట్రగుల్ కారణంగా(సెంట్రీపీటల్ – సెంట్రీఫూగల్ సిస్టం ద్వారా)..... విశ్వశక్తే, సృజనాత్మక తత్వంగా ఎంబాడీడ్ ఎనర్జీగా విశ్వవ్యాప్తతను పొందుతుంది. (ఈ శక్తితో కూడుకున్న పదార్ధం, ఎలక్ట్రో మాగ్నటిక్ ప్రాసెస్ ద్వారా జడపదార్ధంగా, హైడ్రో మాగ్నటిక్ మ్యూటేషన్ కారణంగా జీవపదార్ధంగా పరిణామం చెందుతుంది). విశ్వశక్తి పదార్ధ రూపాన్ని దాల్చడమే సృష్టి...., నిరాకార అనంత శక్తి, దానిలోని ఇంటర్నల్ రిలేటివిటీ, ప్రకోపం కారణంగా అది పదార్ధ పరిణామంతో ఎంబాడీడ్, ఫైనైట్ (finite) శక్తిగా ఏర్పడుతుంది.
అదే విశ్వశక్తి (విశ్వశక్తి – స్పేస్ ఎనర్జీ – కాస్మిక్ ఎనర్జీ – స్పిరిచ్యువల్ ఎనర్జీ – ప్లానెటరీ ఎనర్జీ – సోలార్ ఎనర్జీ – రేడియేషన్ ఎనర్జీ – బయోకాస్మిక్ ఎనర్జీ (జీవాత్మ) – భౌతిక సెల్ఫ్) అనేక దశలలో పరిణామం ద్వారా స్పేస్ మ్యాటర్, గెలాక్సీలుగా, సోలార్ వ్యవస్థలుగా, సోలార్ వ్యవస్థలో గ్రహాలుగా మార్పు చెందుతుంది. మొదటగా ఇది అగ్ని, వాయువు, ధూళీ మేఘాలు (డస్ట్ క్లౌడ్స్), కేంద్రీకృత నక్షత్ర మండలాలుగా (గెలాక్టిక్ మ్యాటర్ గా) రూపాన్ని దాల్చి..., ఆ తరువాత పరిణామ క్రమంలో, సోలార్ – సోలార్ క్లౌడ్స్‌గా, కామెట్స్, ప్లానెటరీ పదార్ధంగా (గ్రహ, ఉపగ్రహ పదార్ధంగా) రూపాన్ని దాల్చుతుంది. సూర్యునిలోని, వాయు పదార్ధ సూక్ష్మతలు, అంతర్గత మాగ్నటిక్ ఫోర్స్‌తో సహా, కాస్మికల్ రేస్ (Cosmical Rays) గా వెలువడి, సోలార్ పరిధి మొత్తంలో వ్యాప్తి చెంది, అవి సోలార్ క్లౌడ్స్‌గా మారతాయి. హైడ్రోజన్, ఆక్సిజన్, మీథేన్, కార్బన్, అమోనియ మొదలగు వాయు మిశ్రమంతో తయారు అయిన సోలార్ పదార్ధం, అది గ్రహ, ఉపగ్రహ ఫార్మేషన్‌లో తోడ్పడింది. ఈ అనంత, వ్యాప్త విశ్వశక్తే, పరమాణువు కేంద్రకం లోని పరమాణువు శక్తిగా మారుతుంది.
సోలార్ ఇగ్నేషన్ – బర్నింగ్ కారణంగా, ఉత్పత్తి చెందిన వేడి – వెలుతురు, గ్రహాలపై వ్యాపించే, పద్ధతి ఆధారంగా, ఆయా గ్రహాలలో వాతావరణం ఏర్పడుతుంది. భూమి లోపలి భాగంలో ఉన్నటువంటి ద్రవపదార్ధం (ఉపరితలం నుంచి 100 కి.మి. తరువాత) అత్యంత ఉష్ణతను కలిగి ఉంటుంది. దాని పై భాగం ఘనీభవించిన కారణంగా ఆ మేరకు అది ఉష్ణతను కోల్పోతుంది. క్రమానుగతంగా, మూలంలో ఉన్నటువంటి ద్రవ పదార్ధాన్ని కోల్పోయినప్పటికీ - ఉష్ణం, సూర్యరశ్మి రసాయనిక సంయోగంతో - భూమిపై 'క్లైమేట్' ఏర్పడుతుంది. గ్రహాలపై వాతావరణ స్థితుల ఆధారంగా ఆయా గ్రహాలపై 'ప్రకృతి' ఏర్పడుతుంది. ఆయా గ్రహాలపై ఉన్నటువంటి కార్బన్ డై ఆక్సైడ్, మీథేన్ (క్లోరో ఫ్లోరో కార్బన్స్?) వాయువుల సాంద్రత ఆధారంగా ఆయా గ్రహాలకు సంబంధించిన ప్రకృతి నిర్ణయించబడుతుంది. ఆ ప్రకృతిలోని నీరు, ఆ గ్రహాలపై జీవానికి కారణమవుతుంది. ‘ఓజోన్ పొర’ ఏర్పడడంతో, భూమిపై అనుకూల ఉష్ణోగ్రతలు, వాతావరణ స్థితిగతుల కారణంగా ప్రకృతితో జీవపదార్ధం ఏర్పడటంతో, జీవి ఆవిర్భావానికి అవకాశం ఏర్పడింది. విశ్వశక్తి పదార్ధంగా మారే ప్రక్రియలో ‘బయోలాజికల్ (జీవ) దశ’ ఉంటుంది. దాని సూక్ష్మాతి సూక్ష్మ యూనిటే డి. ఎన్. ఎ(లైఫ్ ఫోర్స్). క్రమానుగతంగా, వివిధ జీవ జాతులు ఏర్పడినాయి – అందులో ఒకటే మానవ జాతి. Self base life, life based self, ‘Self based ‘mind’ (is the evolutionary biological process) అనేది జీవ పరిణామ ప్రక్రియ.
శక్తి సర్వవ్యాప్తం [పైన చెప్పిన విధంగా విశ్వ శక్తి – స్పేస్ శక్తి – కాస్మిక్ శక్తి – ఆధ్యాత్మిక శక్తి – గ్రహ శక్తి – సౌర (సోలార్) శక్తి – రేడియేషన్ శక్తి – బయో - కాస్మిక్ శక్తి – ఆ తరువాత “భౌతిక సెల్ఫ్”. బయో - కాస్మిక్ శక్తినే జీవాత్మ అని అంటారు]. పదార్ధం, బ్రహ్మపదార్ధం నుండి జీవపదార్ధం వరకు ఉంటుంది.
స్మృతి సృజనాత్మక (క్రియేటివ్) శక్తి, బ్లాక్ ఎనర్జీకి ప్రతిస్పందనగా పనిచేయడం ప్రారంభం కావడంతో, సృష్టి పదార్ధం విశ్వ వ్యాప్తత సంకుచిత స్థితిలో, క్రమానుగతంగా, కాలవ్యవధిలో అత్యంత సూక్ష్మతను పొందుతూ, దాని తిరోగమన ప్రస్థానం పూర్తితో... అది మదర్ న్యూక్లియస్‌లో సంలీనతను చెందుతుంది... ఇలా కొంత కాలం (కోట్లాది మానవ సంవత్సరాలు) విరామం దరిమిలా... మునుపటి తీరులోనే... మరలా విశ్వసృష్టి ప్రారంభమై, విస్తరిస్తూ ఉంటుంది. ఇది, నిరంతర శక్తి, చేతన, చలన సృష్టి కార్యమే సుమా! ఇలా విశ్వశక్తి పదార్ధంగా మారే దాన్ని సృష్టి గాను, దాని వ్యాప్తతను స్థితి గాను, దాని తిరోగమన సంలీన సూక్ష్మతను లయం గాను భావించవచ్చు. కొన్ని కోట్ల మానవ సంవత్సరాల తరువాత, అదే, సృష్టి – స్థితి – లయం, సైకిల్ రిపీట్ అవుతుంది. ఈ విశ్వంలో, అనంత, స్వయంభువు, విశ్వమాత తప్ప, అన్నీ కూడా ఈ మూడు దశలలో మార్పు చెందుతాయి.
సృష్టి పదార్థ మూలం ‘ప్రోటాన్ న్యూక్లియస్’
శక్తి (ఎనర్జీ) కేంద్రీకృత, సూక్ష్మత; పదార్థ స్థూల వ్యాప్తి, సృష్టిపదార్థ, సహజతే! పరమాణువునుండి పదార్థ సృష్ట
ి వ్యాప్తతవరకు జీవకణం నుండి – స్థూల శరీరం వరకు సూక్ష్మ – స్థూల ఉనికి విధానం యిదే! శక్తి కేంద్రీకృత అంతర్భాగం పదార్థ వ్యాప్తతా బాహ్యత; అలాగే శరీర బాహ్య స్థూలత దానిలోని ఆత్మశక్తి సూక్ష్మత ఇలాంటివే! విశ్వశక్తి కేంద్రీకృత పరమ సూక్ష్మత – పరమాత్మ! పదార్థం, సృష్టివ్యాప్తం; ‘ప్రొటాన్’, ఎనర్జీ సూక్ష్మత. మేటర్, ఆకార సృష్టి వ్యాప్తత, అంతఃబాహ్యత, యిలాటిదే. కేంద్రీకృత శక్తి సూక్ష్మతకు ఉనికి అస్తిత్వ భంగం కలిగినప్పుడు పదార్థ విచ్ఛిత్తి/ధ్వంసం సంభవిస్తాయి. (సైన్స్ ఆటం శక్తి అలాగే మతనమ్మిక శివుని త్రినేత్ర పరోక్షతను, పరిశీలించవలసినవే!) శక్తి – పదార్థ అంతర్గత, బాహ్య, చేతన, చలన క్రియా, ధర్మానికి యిది వర్తిస్తుంది. ఇదే సృష్టి ‘ఉనికి – విచ్ఛిత్తి’ (సృష్టి – స్థితి – లయ) విధానం. సైన్స్ న్యూక్లియర్ విధానం ప్రొటాన్ కాల డ్రోన్ ప్రయోగం అలాగే సృష్టి ప్రారంభానికి, సైన్స్ నమ్మకం – ‘బిగ్‌బ్యాంగ్’, యిలాటివే సుమా! ఎనర్జీ పరమ సూక్ష్మత సృష్టి పదార్థ మూలం ‘ప్రోటాన్ న్యూక్లియస్’ అనే విషయాన్ని పరిశీలన, పరిశోధన చేయవలసి వుంది.
సృష్టికారకమైన, శక్తి – పదార్ధ, అదృశ్య (శాశ్వత) – దృశ్యతలు (అశాశ్వత), పరస్పరాధారాలే!
స్థూల – సూక్ష్మతలు; దృశ్య – అదృశ్య రెండిటికి వర్తిస్తుంది. పదార్ధ సూక్ష్మతలో (దృశ్యం) శక్తి సూక్ష్మత, అదృశ్యతగ వుంటుంది. అయితే, ఆశాశ్వతమైన పదార్ధ సూక్ష్మతలోని శక్తి సూక్ష్మతతోపాటు ఆ పదార్ధ సంబంధ అత్యంత సూక్ష్మత కూడ తన ఉనికిని కోల్పోయినప్పుడు అది కూడ శాశ్వత శక్తి సంలీనతనే పొందుతుంది! అదే శక్తి ఏకత! పదార్ధ నిర్మాణ (ఫార్మేషన్) స్థితికి అది విశ్వశక్తి పూర్వ స్థితి. విశ్వశక్తి ఆకృతి (Contour/embodied) ని పొందడం ద్వారా అది పదార్ధంగ మారుతుంది. సూక్ష్మ ప్రమాణంగ ప్రారంభ ఆ లీస్ట్ యూనిట్ (ఆటం, దాని పార్టికల్స్ క్వార్ట్‌జ్ (Quartz) – జీవకణం దాని సూక్ష్మ భాగాలు) బేస్‌గ, పదార్ధ స్థూలతగ అది విశ్వవ్యాప్తమైనా శక్తి సూక్ష్మత, న్యూక్లియస్‌గ దాని కేంద్రంలోనే వుంటుంది.
జీవి (మనిషి) జన్మను ఆశించలేదు; చావునూ కోరుకోవడంలేదు. ఈ రెండిటి మధ్యగల జీవితానికి, అవి, ప్రారంభ – సమాప్తి మాత్రమే! జీవితంలో, శరీరం – మనసు, దృశ్య అదృశ్యతగా, అనుభవాలే సుమా! ఆత్మ, అదృశ్య భావనే కావచ్చు. దానిని, శాశ్వతమనుకున్నా, అశాశ్వత శరీరంతో, దానికి గల సంబంధాన్ని గురించి, యోచన చేయవలసి వుంది. నిజానికి, ఆత్మ, దేనినీ అశించేదికాదు. కనుక, అది, ఆశింపబడేదిగా కాకూడదు మరి! భౌతిక ఇంద్రియ మనసుదే, ఆ స్థితి, ఈ స్థితిలో అశాశ్వత జీవితం, ఆశించవలసిన, 'శాశ్వత', ఏది? అది, దేనికి సంబంధించినది?
ఇంతకూ, అశాశ్వత – శాశ్వత, అంటె ఏమిటి? అలా, వాటిని, ఏ ప్రాతిపదికన, నిర్వచించి, నిర్ణయించాలి? కేవలం, దృశ్య – అదృశ్యత మేరకే, వాటిని, అలా అనుకునే వీలు లేదు. సృష్టి రెలిటివిటి (సాపేక్షం)ని అనుసరించి, దృశ్య – అదృశ్య; ప్రత్యక్ష – పరోక్ష; భావం – భావన; అనుభవం – అనుభూతి; యివి, తప్పనిసరి! 'మార్పు', ఈ రెలిటివిటికి అనుసంధాన అనుబంధం; అనివార్యం! సృష్టికారకమైన, శక్తి – పదార్ధ, అదృశ్య – దృశ్యతలు, పరస్పరాధారాలే! సృష్టి రెలిటివిటికి, అక్కడే ప్రారంభం జరిగింది. దరిమిలా, ప్రకృతి, దానిలోని జీవులతోసహా, ఈ ‘ద్వంద్వ’ బంధాన్ని, అనుసరించడం, జీవిత సహజతగనే, జరిగిపోతోంది… మరి..., అశాశ్వత ఆశించవలసిన, శాశ్వత, వేరుగ, ఎక్కడుంది?
దృశ్యత – స్పర్శతోపాటు, అదృశ్యత కూడ, శాశ్వతం కాదు, ఒకానొక స్థితిలో జరిగిన అదృశ్యతకు, మరోస్థితిలో, దృశ్యత యేర్పడవచ్చు. ఆ రెండిటి మధ్యగల, రెలిటివిటీ, అందుకు కారణం కావచ్చు. జీవిత దృశ్యత, అశాశ్వత అనుభవం. మరణానంతరం, మోక్షంగా భావించబడే స్థితిలో, అదృశ్యతగా, అనుభూతిని కలిగించేది ఏది? దానిని పొందే కర్త ఎవరు? ఏది? నిరాకార నిర్గుణ..., ఆత్మ, యిందుకు అతీతం మరి!
అదృశ్య ఆధారశక్తికి, 'పదార్ధ సృష్టి', దృశ్యత మాత్రమే!
పదార్ధ 'గుణం' – శక్తి 'తత్వం', వీటి పరస్పర సమ్మేళనకు సంబంధించిన చేతన – చలనమే విశ్వ ఉనికిగా భావించవచ్చు. దృశ్య, అదృశ్యత... లేక ఆధారితమని, దీనినే మరో విధంగా అనుకోవచ్చు... అయితే సాధారణంగా ద్వంద్వంలో గాని, అంతకు మించిన స్థితిలో గాని, వాటిలో ఏదో ఒకటి... ఎంతైనా కొంత... ఏదో రూపంలో తన ఆధిక్యతను లేదా ప్రాధాన్యతను కలిగి వుంటుంది. There is neither Equilibrium nor Equipoise in the Universe. కనుక, దృశ్య అదృశ్య ద్వయంలో అదృశ్యతే... దృశ్యతపై ఆధిక్యతను కలిగి వున్నట్లు గ్రహించగలం. అయితే అదృశ్యత ఉనికికి, దృశ్యతే కారణమైనట్లుగానే... దృశ్యత 'స్థితి'కి అదృశ్యతే ఆధారంగా వుంటోంది. ఉదాహరణకు, సూక్ష్మస్థితిలో వున్న పరమాణువు పదార్ధ రూపంలో, దానిలో న్యూక్లియస్‌గా చలిస్తున్న ఎనర్జీ ఉనికికి, దాని వ్యక్తతకు కారణం. అయినా, ఆ పరమాణువు 'స్థితి'కి ఎనర్జీ చలన 'గతి'గా ముఖ్య ఆధారంగా వుంది. అలాగే శరీరము, ప్రాణము వీటిలో అదృశ్యత ప్రాణశక్తికి, పదార్ధ నిర్మిత శరీరం భౌతిక 'దృశ్యం'గా ఆధారం. అయితే... అదృశ్య ప్రాణశక్తి శరీర దృశ్య 'స్థితి'కి ఆధారమవుతోంది గదా! పరమాణు విచ్ఛితిలో దృశ్య పరమాణు రూప పదార్ధం
తన స్థితిని కోల్పోయినా... అంతవరకు, అందుకు ఆధారంగా వున్న అదృశ్య ఎనర్జీ పరమాణు రూప 'గుర్తింపు'ను మాత్రమే కోల్పోతుంది గాని, అది పూర్తిగా లేకుండా పోలేదు. దాని 'ఎటర్నిటీ'ని అది కోల్పోలేదు. కనుక, శక్తి (ఎనర్జీ) రహిత పదార్ధం మాత్రమే రూపరహిత మవుతుందనేది స్పష్టంగా తెలుస్తుంది. అలాగే మనసు అదృశ్యత – కర్మ దృశ్యతలో మనసుదే పైచేయి! సెన్సెస్ – మనసు ద్వయంలో సెన్సెస్‌దే ఆధిక్యత! సెన్సెస్ – ప్రకృతి వీటిలో ప్రకృతిదే ప్రాధాన్యత! ప్రకృతి – సోలార్ విషయంలో... సోలార్ శక్తిదే ఆధిక్యత! సోలార్ – విశ్వశక్తి సంబంధంలో విశ్వశక్తిదే ఆధిపత్యం. అలాగే..., విశ్వశక్తి – స్వయంభువు (మదర్ న్యూక్లియస్), ఆంతర్యంలో స్వయంభువే (The absolute) సర్వదా (at all events) ది సుప్రీం సోల్!
పుట్టుకే లేని దానికి (ఎనర్జీ) ఎటర్నిటీ ('అ'మృతం?) వుంటుందని..... ఏదో రూపంలో ఫార్మేషన్ (స్థితి) జరిగిన దానికి (పదార్ధం/శరీరం/ఆకృతి/సాకారం) మరేదో విధంగా దాని విచ్ఛిత్తి తప్పదని అర్ధమవుతుంది. స్వయంభువు – సృష్టికి మధ్యగల సన్నిహిత శాశ్వత సంబంధం యిదే! అయితే క్రియేషన్‌కు, ప్రోక్రియేషన్‌కు మధ్య మరో విధమైన భేదం వుంది.... సాధారణంగా, ఏదో రూపంలో ఏదో విధంగా, జీవ పదార్ధానికే ప్రోక్రియేషన్ ప్రక్రియ వర్తిస్తుంది.... అందుకు క్రియేషన్ పరోక్షంగా ఒక కారణం మాత్రమే! అలాగే ప్రోక్రియేషన్ ఒక కార్యం (Effect)! దాని ఉనికి గుర్తింపుకు తత్సంబంధ కార్యఫలితమే! 'కాజ్ అండ్ ఎఫెక్ట్' మధ్యలో గల ఎఫర్ట్ (The exertion) కార్య తుది ఫలిత స్వరూప స్వభావాలను నిర్ణయిస్తుంది. ఇందుకు, దృశ్య రహిత 'మనసు' ప్రధాన పాత్ర వహిస్తుంది.
సృష్టి – స్థితి – లయ (Creation – Existence – Invisibility) యీ త్రయం (Trio)లో, సృష్టి, తన 'ఉనికి'తో – 'స్థితి'ని కలిగియుండి, దరిమిలా 'లయం' (అప్పటికి లేని స్థితిని) కలిగి వుంటుందనేది స్పష్టం కనుక 'సృష్టి' అంటే పదార్ధ ఉనికిగా అనుకోవాలి మరి! ఇది 'ఎనర్జీ' (విశ్వశక్తి) ద్వారా 'కలిగించ'బడి (ఇందుకు 'కర్త' మీమాంస అవసరం అవుతుంది!) స్థితికి, లయంకు కారణమైనప్పటికీ.... సృష్టి తన శాశ్వతను కలిగి లేదు! అయితే, స్వయంభువు (ఆత్మకారకశక్తి/మదర్ న్యూక్లియస్) చేత కలిగించబడిందే కనుక సృష్టిని, విశ్వశక్తి ప్రభావిత 'ఫార్మేషన్' అని మాత్రమే అనవలసి వుంటుంది.................. అంటే, అదృశ్య ఆధారశక్తికి, 'పదార్ధ సృష్టి', దృశ్యత మాత్రమే! విశ్వశక్తి, స్వయంభువు (The Mother Nucleus) నుండే వెలువడిందే గాని, అది సృష్టి ఫార్మేషన్ కాబోదు. కనుక, స్వయంభువు తత్వసారూప్యతతో (Analogical Analysis) కలిగిన విశ్వశక్తి కూడ, నిత్యత శాశ్వత (ఎటర్నిటీ) వుంది. స్థితి కారణం, శక్తి స్థిర ఉనికి ప్రశ్నార్ధకమే!
ఈ విధంగా, The Autogenesis (The Mother Nucleus) – Genesis – Creation (Formation) Procreation (Being and Becoming) – The Existence and the annihilation...... This is Ontological – Chronological – consequential – the evolutionary and the eventual process of the events regarding to the Universe.
అదృశ్యత నుండి, దృశ్యత కలగడం, సృష్టి ప్రత్యేకత
జన్మ కలిగినదే, మరోజన్మకు, కారణమవుతోంది. ఉనికిని కలిగినదే, మరో ఉనికికి, హేతువు కాగలదు... ఇలా, సృష్టిలో, ప్రతిదీ, మరోదానిలో భాగమె! ఇది, ఆకారదృశ్యం. అయితే, సృష్టి ప్రారంభం, యిలాటిది, కాకూడదు. నిరాకార అదృశ్యత నుండి, ఆకార దృశ్యత కలుగుతోంది. శూన్యతనుండి కాదు – దృశ్యతలేనిదాని నుండి, దృశ్యత కలగడం, సృష్టి ప్రత్యేకత! (ఇలా అనడంలో, సమగ్రతలేదు; వివరణ, యింకా వుంది) దృశ్యతకే ఉనికి, ప్రత్యేకం కాదు; అదృశ్యతకూ, పరోక్షరీతిలో, వునికి, వుంది; వుంటుంది. శరీర ఉనికి ప్రత్యక్షం; మనసు వునికి, అలాటిది కాదు; అయినా, దానికి వునికి వుంది. (ఆత్మ వివరణ వేరు). భౌతిక నేత్ర (స్పర్శ) స్థూల దృష్టికి, బాహ్య ఆకార స్థూలత, కన్పిస్తుంది; (అనిపిస్తుంది), మనోనేత్ర సూక్ష్మతకు, నిరాకార సూక్ష్మతా అనుభూతి కలుగుతుంది, 'ఉనికి' లేనిదెక్కడ?
యేర్పడినదే సృష్టి: అనంత విశ్వంలో, సృష్టి, యేర్పడిందేగాని, చేయబడింది కాదు (స్వయంభు). అదృశ్య శక్తికి, దృశ్యపదార్ధంగా, పరివర్తనను (కన్‌వర్షన్ conversion) చెంది., దానికేంద్ర ఆధార బిందువు (బీజం/న్యూక్లియస్)గ, నిలిచింది. వ్యాప్త తత్వతను కలిగిన, శక్తితో కూడి వున్న, పదార్ధం… పరిణామ క్రియగ, శక్తి వ్యాప్తతను, అనుసరించడం, సహజంగానే వుంది. 'సృష్టి విస్తరిస్తోంది', అని సైన్స్ చెప్పడంలో, వాస్తవం వుంది... ఉనికి భిన్నతా పరిణామం, సహజతే అయినా అది ఆకార బాహ్యభిన్నత, అంతర్గత శక్తి ఉనికి స్థితికి వర్తించదు... ఆవిధంగా, యేర్పడినదే సృష్టి.
‘మార్పు’ – పరివర్తన, ఆకార పదార్థ సృష్టిలో, సృష్టి అంతటా వున్నాయి
‘మార్పు’ (మ్యూటేషన్), పరివర్తన (ట్రాన్సిషన్), ఆకార పదార్థ సృష్టిలో, ఈ రెండూ లేనిదెక్కడ? సృష్టి అంతటా అవే! శక్తి (ఎనర్జీ), చేతన (సెంటియన్సీ), హేతువుగ, ఎంబాడీడ్ ఎనర్జీగ, ఆకార నిర్జీవ పదార్థంలో పరివర్తనగ, అంతర్గత చలన మార్పుగ; జీవ పదార్థంలో ‘ప్రకృతి – పురుష’, ఋతుపరిణామ బాహ్య
– అంతర్గత నిత్యమార్పు! ప్రోటోప్లాజం – ప్లాస్మా, జీవసంబంధమైన జీవ, జాతి పరిణామ, సహజ మార్పు అనివార్యమే! ‘విత్తనం – మొలక’ మొదలు అలాగే ‘అండం – పిండం’ ప్రారంభంనుండి, ‘వృక్ష – జీవులలో వాటి వృద్ధాప్య సమాప్తి వరకు అంతర్గత బాహ్య మార్పు జరుగుతూనే వుంటుంది. ‘మనిషి – ఉనికి’, అంతేమరి! The universal changeability and the conversion are inevitable aspect by means of the momentary movement.
సృష్టి - శూన్యం విశ్లేషణ (శూన్యం నుండి ఏదీ రాదు)
సృష్టి, దాని నిర్మాణం, నిర్వహణ – ఫలితం – అనుభవం – యీ మార్గంలో విశ్లేషణ సాగిస్తే – విషయజ్ఞాన పరిపూర్ణతకు చాలా వరకు అవకాశం వుంది. ‘సృష్టి’, అంటే ఏమిటి? ఏవిధంగానూ, అది వరకు ‘లేని’ది వుండడం( బీయింగ్)... “శూన్యం నుండి ఏదీరాదు”, అనేది సైన్స్ స్పష్టం చేస్తున్న శాస్త్రీయ వాస్తవం. సరే! అసలు ‘శూన్యం’ అంటే ఏమిటి? చాదస్తంగా అనిపిస్తోందా? కాదు – కానే కాదు.... “అంటే ఏమిటి?” అనేదానికి, ‘విషయం’లేనప్పుడు, అది చాదస్తం అనిపించవచ్చు. కాని, ఇక్కడ, అన్నిటికంటే, తర్కబద్ధమైన పెద్ద విషయమే వుంది. శూన్యం నుండి యేదీ రాదంటే.... వచ్చేదంతా ఎక్కడినుండి? నదిలో ప్రవాహానికి, ఎక్కడో ఒకచోట ప్రారంభం వుంది. ఆ ప్రారంభానికి వర్షం ఆధారం. ఆ ’ధార’ నదికి ఆరంభం అయింది. వర్షానిక్కారణం మేఘం. మేఘానికీ వుంది యేర్పాటు. ఇందులో ‘శూన్యం’ ఎక్కడ? మేఘాలు కన్పిస్తాయి. వాటి నిర్మాణం, అంత స్పష్టంగా, సులువుగా, ప్రత్యక్షంగా తెలియకపోవచ్చు. (కాస్మిక్‌రేస్‌తో ప్రారంభ మవుతాయి, సోలార్‌క్లౌడ్స్; ప్లానెట్ వాతావరణంతోడైతే వాటికి, అవి మారతాయి వర్షపుమేఘాలుగా! శీతోష్ణస్థితిగతులు (ఉష్ణశీతల వాయువులు) వర్షానికి తోడ్పడతాయి). అలాగే లేనిది వుండడం సృష్టి అని నిర్వచిస్తే... లేకపోవడానికి పూర్వం, ఆస్థానంలో యేదో వుంటేగాని, ప్రస్తుతం లేకపోవడం జరగదు. అదే తీరులో, ప్రస్తుతం ‘లేకపోవడం’ దరిమిలా, ఆస్థానంలో యేదో వుండడమే కావచ్చు... ఇది తర్కాన్ని తలపిస్తున్నా..... సులువుగా త్రోసివేయడానికి వీల్లేని విషయంగా, హేతుబద్ధమైన దానిగా, యోచన చేయాలి, అప్పుడు తెలుస్తుంది ‘శూన్యం’ సంగతి!
సృష్టి విస్తరణ ఫినిట్
ఒక వస్తువు (పదార్ధం) సమస్థూలత (బరువు) సూక్ష్మబిందువును, దాని సెంటరాఫ్ గ్రావిటీగ, భావించవచ్చు; అది, జీరో గ్రావిటీ! జీరో, (పూర్ణానుసారం) ఖండితం కాదు. (అరసున్న, విసర్గ, భాషా సంబంధమైనవి) ఏకం! పాక్షిక రహితం! దాని దక్షిణ పార్శ్వ భాగం స్థానం, దాని వామస్థాన విలువను, పెంచడమె గాని, తనకు తానుగ, విలువను పెంచుకోదు; హెచ్చించుకోదు; సంచితం చేసుకోదు. ఇది, గణిత, భాషా సంబంధ ప్రస్తావనే! వేదాంత స్థాయిలో, యిది, మరో విధంగ వుంటుంది. ఆత్మ వివరణకు, జీరోను, ఉదాహరణగ గ్రహిస్తే, దాని తీరు, వేరుగ వుంటుంది. వృత్తకేంద్ర బిందువు, వ్యాసార్ధంతో ప్రారంభించి, వృత్త పరిధిని,(ఔటర్‌ఫినిట్) పూర్తిచేసి, దాని వ్యాసంతో, వృత్త విస్తరణను, నిర్ణయిస్తుంది. ఇది, గణిత విషయమే అయినా, దానికేంద్ర సూక్ష్మత, తన చుట్టూ, సమాన విస్తరణ స్థూలత, 'వ్యాప్త', జనరల్ అవగాహనకు, ఉపయోగమె. అంటే, శక్తి – పదార్ధ, సృష్టి విస్తరణ స్థూలత, దాని, కేంద్ర సూక్ష్మ బిందువు నుండే, వృత్తాకార స్థితిగ, వ్యాప్తి జరుగుతుంది గాని, దాని, బయటి బాహ్యత నుండి కాదు. ఈ విస్తరణ అంతర్గత వైశాల్యం, ఎంతవున్నా, దానికి, ఔటర్ లిమిట్(ఫినిట్) తప్పనిసరి, అంటె, సృష్టి విస్తరణ, అనంతం కాదు. అది, అంతర్గత ఫినిట్‌లోనే వుంది. కనుక, సృష్టి వృత్తాకార, (జీరోగ్రహ సంబంధ, గోళాకారం, ప్రత్యేకం) ఫినిట్‌లోనే వుంది. సైన్స్ చెప్పే, సృష్టి విస్తరణ కూడ, ఫినిట్‌లోనే వుంది.
వృత్తాకార విస్తరణ, ఫినిట్‌కు దాని నిర్మాణానికి, దాని కేంద్ర బిందువు సూక్ష్మతే, ప్రారంభం! దాని ప్రభావం, పరోక్షరీతిగ, అదృశ్యతగ, వృత్తవైశాల్య విస్తరణ అంతటా, వుంటుంది. సీడ్‌లోని పదార్ధ లక్షణాలు, ప్రాణశక్తి, సూక్ష్మత, వృక్ష స్థూలతకు విస్తరిస్తుంది. అండం – పిండంలో, జీవ సూక్ష్మత, యిలాటిదే!
దృశ్య సృష్టిలో ప్రతిదానికి ఒక బాహ్య లిమిట్ వుంటుంది
శక్తి – పదార్ధ నిర్మిత అఖిలాండ బ్రహ్మండమనబడే సృష్టికీ, వునికి వుంది, అది, ప్రత్యక్షమె, అది, దాని పదార్ధ బాహ్యతకే! దాని అంతర్గత శక్తికీ, వునికి వుంది. అయినా, దానికి, ఆకార ప్రత్యక్షత లేదు మరి! ఉదాహరణకు, దానిమ్మ పండులోని, గింజల గ్రూపుల గదులు, దేనికదే, పలుచని పొరలతో, విభజన హద్దును, కలిగి వుంటాయి; అలాటివి, దేనికదే, అనేకం వున్నా..., వాటన్నిటికీ, ఉమ్మడి, బాహ్యతగా, చెక్కలాంటి తొక్క, వాటిని, ఆవరించి వుంటుంది. అయినా, దానితోసహా, దానిలోపలిభాగం యావత్తూ, దానిమ్మ పేర, మొత్తం పండుకు బాహ్యలిమిట్ వుంది. బహుశ, రసం కలిగిన పండ్లన్నీ యిలాగే కావచ్చు. అలాగే, చెట్టు లిమిట్‌లో వున్న అన్నిటికీ, దేని బాహ్యత దానికే వుంది. బ్రెయిన్‌లో, కోటానుకోట్ల న్యూరాన్లు, భాగాలు, విభాగాలు(లోబ్స్)గ, వాటి ఫంక్షనల్ స్వరూప స్వభావాలు, వివిధ రీతులలో వున్నా, వాటి బాహ్యత, స్కల్‌తో సహా శిరస్సుగనే, వ్యవహరిస్తున్నాం. అలాగే, శరీర వ్యాప్తంగ, జీవకణాలు, వివిధ అవయవాల రూపంలో భాగాలుగ, వే
టికవే వున్నప్పటికీ, అంతర్గత ఫంక్షన్ లిమిట్‌లో, బాహ్యత లిమిట్‌ను కలిగి వున్నాయి, అయినా, వాటన్నిటినీ కలిపి, ఒకటిగా, శరీరంగ, వ్యవహరిస్తున్నాం. అయినా శిరస్సుతో సహా, మొత్తం శరీరానికి, బాహ్య చర్మలిమిట్ వుంది. 'ఆటం', తీరూ యిలాటిదే! అండం – బీజం స్థితీ యిదే!
పదార్థ సృష్టికి, ఆకార బాహ్యతే! దానికి నిర్జీవ, సజీవ భేదం లేదు. అలాగే సూక్ష్మ స్థూలతకూ యిదే వర్తిస్తుంది. ఏ కారణంగానైనా – ఏదైనా తన ఔటర్(ఫినిట్యూడ్)ను దాటితే అది తన ఆకార ఉనికినే కోల్పోతుంది. కనుక ఏదైనా తన ఔటర్ లిమిట్‌లో వున్నంత వరకే దాని ఆకార ఉనికి.
నిర్జీవం – జీవం ఏదైనా ‘ఔటర్’ హద్దు కలిగినది. ఆ పరిమితిలోనే అది ఇమిడి వుంటుంది. పంచభూత ప్రభావితమైన ప్రకృతి దానిలోని జీవులతో సహా ప్రతిదీ పరిమితిని మించే అవకాశంలేదు. అదే ‘ఆకాశహద్దు’. ప్రకృతి సహజత! శారీరక, మానసిక సంబంధమైనది ఏదైనా, మనిషితోసహా బాహ్య లిమిట్‌ను కలిగినదే! అలాగే మంచి – చెడు, శిష్టం – దుష్టం కూడ సహజ పరిమితిని కలిగినదే! దేవతల సద్గుణం, రాక్షసుల తమోగుణం కూడ, పరిమితిని కలిగినవే. మానవ శాస్త్రజ్ఞానం తెలివికూడ అలాటివే! జీవిత ద్వంద్వం కూడ హద్దును కలిగినదే! భిన్నతను కలిగియున్న పదార్థ సృష్టిలో ఆకార హద్దులో ఏదైనా భిన్నతే! అరిషడ్వర్గ, ప్రభావం కూడ అంతటిదే సుమా! అందుచేత భౌతికం, ఆధ్యాత్మికం దేనికి చెందినదైనా వాటిలోని ‘మంచి – చెడు’ సమన్వయతా సాధనతోనే సత్ఫలితానికి అవకాశం వుంటుంది.
విశ్వం – సృష్టి ఒకటి కాదు, అనంతం కాదు, అవి అనేకం – ఫినిట్
‘సృష్టి ఒక్కటే’ అనే భావనతోనే మతం, దేవుణ్ణి సృష్టికర్తగా నమ్ముతోంది. అలాగే, సృష్టి ప్రారంభానికి బిగ్‌బ్యాంగ్ సూత్రాన్ని సైన్స్ స్థిరపరచుకుంది. నిజానికి సృష్టి ఒక్కటే కాదు, అనేకం! కనుక సృష్టికి అనంతాన్ని ఆపాదించరాదు. అదేవిధంగా విశ్వం కూడ! దానికీ అనంతం (ఇన్‌ఫినిట్యూడ్) వర్తించదు, అనంతతలో అదీ ఒక భాగమే సుమా! అనంత శక్తి పరమ సూక్ష్మతలో విశ్వం కూడ ఒక విశాల భాగం మాత్రమే! ఆ అనంత శక్తి పరమ సూక్ష్మతే మదర్ న్యూక్లియస్ – (విశ్వమాత).
కనుక సృష్టికి సంబంధించి ‘తమ దేవుడే’, అని మతం అనడంగాని, బిగ్‌బ్యాంగ్‌తోనే సృష్టి ప్రారంభమని సైన్స్ అనుకోవడంగాని – అసలుకు సంబంధించి అవగాహనా లోపమే! వారి భావాలు, నిర్ణయాలు అనంతానికి వర్తించవు. అవి వారి నమ్మకం పరిధిలోనివే! మానవ జ్ఞానం మరింత విశాలం కావాలి. హేతుబద్దం కావాలి. ‘ఇనోవేటివ్’ కంటె ‘ఇనోసెన్స్ కన్‌స్ట్రక్టివ్ కాన్షస్‌నెస్’ మానవ జాతికి మేలుకరము.
శాశ్వత లేకపోవడమె, అశాశ్వతగాని, శూన్యతకాదు
సృష్టి, దానిలోని, నిర్జీవ (అంతర్గతచలనం), జీవ, సమస్తం, శక్తి – పదార్ధ రూపం (శరీరం) దాని మార్పిడి, స్థూల అదృశ్యత తప్ప, దానిలో, శూన్యతకు సంబంధించి, ఆశాశ్వత ఏదీ లేదు. దృశ్య శరీర సంబంధమైన అన్నీ, అదృశ్యతతో, ప్రకృతిలో కలిసిపోతూ, దరిమిలా, పంచభూతాలతో, సూక్ష్మస్థితిలో తమ ఉనికిని కలిగి వుంటాయి. యంత్రంలోని విడిభాగాల లోహ స్క్రాప్, శిల కరిగిన, తరిగిన, యిసుక రేణువులు, 'నోవా' నక్షత్ర విచ్ఛిన్నతా పదార్ధం; మంచుగడ్డ – నీరు (తారుమారు/వైస్‌వెర్సా); సాగరాన్ని చేరిన నదినీరు; మేఘం... వర్షించిన నీరు; భూమిలోకి చేరిన నీరు; నీటి ఆవిరి – దరిమిలా, దాని అదృశ్యత – అలాగే శరీరం – శవం....., యిలా, స్థూల దృశ్యత, సూక్ష్మ అదృశ్యతగా, అంతర్గత బాహ్యమార్పును చెందుతుందేగాని, దానిలో, శూన్యస్థితికి, అవకాశంలేదు. దృశ్యత లేకపోవడం, అదృశ్యత అయినట్లుగ, శాశ్వత లేకపోవడమె, అశాశ్వతగాని, శూన్యతకాదు. కనుక, శక్తి – పదార్ధ నిర్మిత సృష్టి..., ప్రత్యక్ష స్థూల 'అశాశ్వత'గ, పరోక్ష సూక్ష్మ 'శాశ్వత'గ అంతర్గత చలన దశల మార్పిడిని చెందుతూ, అది, నిత్య చేతనగ వుంటుంది. అవతరించారనుకునే వారి శరీరస్థితీ, యిందుకు అతీతం కాదు.
సృష్టి ఆదిలో ఏక కణ జీవి వునికి, ఈనాటి బహు కణ జీవితో పాటు భద్రంగానే వుంది
జడం సంగతి అలా వుంచినా, ఏకకణ జీవి దగ్గర నుండి, కోటాను కోట్ల కణాలను కలిగివున్న జీవుల వరకు సృష్టి క్రమాన్ని పరిశీలిస్తే వివిధ కణాలు, వాటి సంఖ్య, వాటి క్రమం ద్వారా వివిధ జీవుల వుత్పత్తి జరుగుతోంది గాని, దేవుడు అమాంతంగా జీవిని సృష్టించి, భూలోకంలోకి విసిరివెయ్యడం లేదనేది స్పష్టం. అయితే జీవి పరిణామ సిద్ధాంతాన్ని అంగీకరించి ఆలోచించినప్పుడు ఒక సందేహం కలుగుతుంది. ప్రారంభంలోని ఏకకణజీవి, పరిణామ క్రమంలో కోటానుకోట్ల జీవ అణువులను కలిగివున్న జీవులు వాటివాటి వునికిని భద్రంగా కాపాడుకుంటున్నాయి. ఇది పరిణామ సూత్ర పరిపూర్ణతకు విరుద్ధం కదా! ఒక స్థితి మరొక నూతన స్థితికి పరిణామం చెందినప్పుడు దాని పూర్వ స్థితిని రూపుమాపుకోవాలిగదా! అండం దగ్గరనుండే ఆలోచించినా, మరణంతో మాసిపోయే వరుకు మధ్యలో జరిగే పరిణామ ఫలితంగా ప్రతిసారి అంతకు పూర్వస్థితి, వునికి ఎప్పటికప్పుడు మాసిపోతోంది గదా! అలాంటప్పుడు సృష్టి ఆదిలో ఏక కణ జీవి, ఈనాటి బహు కణ జీవితో పాటు బ్రతికే వుందే! వాటి ప్రత్యేక వునికి భద్రంగానే ఉంది కదా! ఏకకణ జీవి వరకు, ఆ తరువాత యీనాటి వరకు జరిగిన పరిణామానికి మూల కారణం ఏమై వుంటుంది అనేది మరొక ముఖ్యమైన ప్రశ్న.
సృష్టి – డార్విన
్ పరిణామ సిద్ధాంతం
డార్విన్ పరిణామ సిద్ధాంతాన్ని పరిశీలిస్తే దేవుడి సంకల్పంతో హఠాత్తుగా యీ సృష్టి జరిగిందనడానికి అవకాశం యే మాత్రమూ లేదు. ఎందుకంటె, “సృష్టికి ముందు, దేవుడు లేడు కనుక. సృష్టి ఒక్కసారిగా జరిగి అంతటితో ఆగిపోలేదు కనుక. పుట్టడం, గిట్టడం భులోకంలో నిత్యకృత్యంగా జరుగుతోంది కనుక! దేవుడు పుడుతూ, చస్తూ వున్నాడు కనుక. గ్రహాలు, తిరగడం, నక్షత్రాలు మెరవడం అనుక్షణం జరుగుతూనే వుంది కనుక, పదార్ధం కలవడం విడిపోవడం మామూలుగా జరిగిపోతూనే వుంది గనుక... మనిషి బుద్ధి మారుతూ, జ్ఞానం పెరుగుతూ సృష్టి తీరూ తెన్నూ మారుతోంది గనుక”. కనుక పరిణామమే ప్రకృతికి, లేక సృష్టికి జీవికి ప్రమాణమని స్పష్టంగా తేలుతోంది.
జీవ సృష్టి – జీవ పరమాణువు మరియు ‘జీన్’ పాత్ర
జీవి సృష్టికి, రసాయనిక ద్రవ్యాల సమ్మేళనం అని, అందుకు మూలకాలు కారణమౌతాయని, వాటి పరమాణువులు అందుకు తోడ్పడతాయని (ఆ పరమాణువులకు ఏం తోడ్పడతాయో యింకా విజ్ఞాన శాస్త్రానికి తెలియలేదు) మూలకాల పరమాణువుల మిశ్రణంలోని జీవి సృష్టికి కారణమౌతోందని, ఆ సమ్మేళనంలోని అణువుల నిష్పత్తి భేదాన్ని బట్టి వివిధ జీవులు యేర్పడతాయని చెప్పే భౌతిక శాస్త్రం, కన్నవారి పోలికలు పుట్టినవారికి రావడానికి ‘జీన్’ కారణమంటున్నారు. అయితే ఈ ‘జీన్’ నిర్ణయానికి కారణం యింకా పూర్తిగా తెలియకపోయినా, స్థూలంగా దాన్ని గురించి ఆలోచన చేయవచ్చు. జీవ పరమాణువుల లక్షణాలు ‘జీన్’ ఆకృతికి స్థితికి కారణం కాకపోదు. ప్రతి జీవికి జీవాణువుల నిష్పత్తి జీవ రసాయనాల సమ్మేళన వివిధ రీతులుగా వుంటోంది గదా! భిన్నత్వంగల యిద్దరు స్త్రీ, పురుషుల సంయోగంతో సంపర్క కారణంగా, మరొక జీవి కలిగినప్పుడు ‘జీన్’ ఉనికి తప్పకుండా మార్పు వుండి తీరుతుంది. అయితే, ఒకే తల్లదండ్రుల కలయిక ద్వారా యేర్పడే జీవిలోని ‘జీన్’ ఒకేరీతిగా వుండడానికి వీలులేదా? కన్నవారి కలయిక ద్వారా వచ్చే ప్రతి జీవిలోను జీవ పరమాణువుల నిష్పత్తి, రసాయనిక ద్రవ్యాల సమ్మేళనం దాని పరిమాణం రసాయన చర్య మారిపోతూ వుంటుందా? జీవి జన్మని నిర్ధారించిన జీవాణువుల నిష్పత్తి ఆ జీవి బ్రతుకంతా మారిపోతూనే వుంటుందా? ఒకవేళ స్త్రీ, పురుషులలో పూర్తి వ్యక్తిగత జీవాణువుల నిష్పత్తి రసాయనిక ద్రవ్యాల వుత్పత్తి సమ్మేళనం భిన్నంగా వున్నప్పటికి, వారిద్దరి కలయికతో ఏదో ఒక నిష్పత్తి నిర్ధారణ కావాలి గదా! ఆ నిష్పత్తికి తగినట్లుగా జీవుల పుట్టుక జరగాలి గదా! అందుకు తగినట్లుగాని, ఆ కుటుంబం వరకైనా, షేప్‌ని (వారసత్వాన్ని) నిర్ణయించే ‘జీన్’ ఒకే రూపాన్ని కలిగి వుండాలి గదా! అనుభవంలో అలా లేదు. కనుక, విజ్ఞాన శాస్త్రం ప్రకారం జీవి సృష్టికి, దాని వారసత్వానికి కారణాలైన జీవాణువుల నిష్పత్తి, రసాయనిక ద్రవ్యాల సమ్మేళనం ‘జీన్’ అన్నీ కూడ ఏ ఒక జీవిలోనూ స్థిరత్వాన్ని కలిగి వుండడంలేదు అనేది తెలుస్తోంది. మాటమాటకి పరిణామ ప్రభావానికి లోనయ్యే ‘జీన్’ పరమాణువుల నిష్పత్తి ఆ జీవి బ్రతికినంత కాలం ‘షేప్’లు మారుస్తూనే వుండాలి. (వయస్సు కారణంగా, బాహ్యంగా కన్పించే పెరుగుదల తరుగుదలకి, పై వాటి పరిణామం ద్వారా రావలసిన ఆకారానికి సంబంధం లేదు).
ఒక్కొక్క జాతికి (కీటక జాతి, పురుగుల జాతి, పక్షుల జాతి, జంతువుల జాతి, మృగాల జాతి, మనుష్యుల జాతి మొదలగు రీతిలో) ఒక్కొక్క సంఖ్యలో జీవాణువుల నిష్పత్తి వుంటుందనుకుంటే, ఒకే జాతిలోవున్న భిన్నత్వానికి (శారీరక, మానసికారాలలో) కారణం ఏమై వుంటుంది? జీవి గ్రహించే గాలి, నీరు, ఆహారం యిందుకు ముఖ్య కారణమని తెలియని వారు కూడ అనుకోరు ఇవి ఏ మాత్రం కారణం కాదని స్పష్టంగా, అనుభవపూర్వకంగా తెలుస్తోంది కనుక. అంతేకాదు, శారీరక స్థితిగతులకు, రూప భేదాలకి, ఆ శరీరంలో వుండే మానసిక స్థితిగతులకు, పద్ధతులకు సంబంధం వుండడం లేదు.
వినియోగమే గాని, మనిషికి సృష్టించడం సాధ్యం కాదు
పైన వివరించినట్లు సృష్టించడానికి, తయారుచేయడానికి చాలా భేదం వుంది. ఈ భేదం కేవలం భాషాపరంగానేకాక, దాని అర్థంలో కూడ స్పష్టమైన తేడా వుంది. ఇంగ్లీషులో ఇన్‌వెంట్ అనేదానికి, డిస్‌కవర్ అనేదానికి భేదం వున్నట్లే క్రియేషన్, మేకింగ్ అనే పదాలకు కూడ చాలా తారతమ్యం వుంది. లేనిదానిని కలిగించడం సృష్టించడం అనాలి. ఉన్నదాన్ని కావలసిన రీతిలో మలుచుకోవడాన్ని తయారు చేయడమనాలి. పరిశోధనా పరిభాషలో కూడ యీ భేదం వుంది. కనుక ‘పదార్ధం’ (మేటర్) వుంది. కనుక, దానిని తనకు కావలసిన రీతిలో తయారుచేసుకుంటున్నాడు మనిషి. తన విషయ వస్తు జ్ఞానాన్ని వుపయోగించి, ‘పదార్ధం స్థిరం’ అనే సూత్రాన్ని మనిషి పాటించడం జరుగుతుంది గాని, తన మేధస్సుతో దానిని తారు మారుగా గాని, హెచ్చు తగ్గులుగా గాని, ఉండడం, లేకపోవడంగా గాని, మరో విధంగా గాని, మనిషి చేయడం లేదు. అదివరకు వున్న మూలకాలను, పరమాణువులను కనుగొని, వాటి నిష్పత్తిని, భౌతిక, రసాయనిక ప్రక్రియను, నిష్పత్తి అటూ యిటూ మార్పు చేయడం ద్వారా నూతన వస్తువును వస్తువుకు ఆధారమైన దానిని తయారు చేసుకుంటున్నాడు గాని, అందుకు భిన్నమైన మరొక ఘనకార్యం మనిషి చేయలేకపోతున్నాడు.
భూమి, ఆకాశం; నీరు, నిప్పు; వాయువు... అలాగే, సూర్యుడు, గ్రహాలు, నక్షత్రాలు; నదులు, కొండల
ియ మనసు ప్రస్థానమేగాని, ప్రత్యేకంగ, ఆత్మ ప్రస్థావన కాదు.
ప్యూర్ (అనంత) శక్తి – పరిమిత (సృజనాత్మక) శక్తి అవగాహన
సృష్టి పదార్ధమైనా – దానిని, బ్రహ్మ పదార్ధమనుకున్నా, ఆకారహేతువైన పదార్ధం ఏదైనా, ఎంబాడీడ్ ఎనర్జీయె! అంతరిక్షం నుండి, 'అమీబా', వరకు, పదార్ధపరిణామ, ఆకార దర్శితమె: సృష్టిశక్తి, ఆటం నుండి, ప్రాణశక్తి వరకు, వ్యాపించి వున్నది, పదార్ధ కేంద్రీకృత, అంతర్గత శక్తే! ఇది ఫినిట్ (అంతం). Absolute Zero సూక్ష్మతగల, ప్యూర్ ఎనర్జీయే, విశ్వ శక్తి; ఇది, ఇన్‌ఫినిట్, సర్వవ్యాప్తం, అనంతం...... పదార్ధ గత శక్తికి, ఆకార బాహ్యత వుంటుంది. అందుకే, అది అంతం, ఫినిట్!
అండ – పిండ – బ్రహ్మాండ క్రమంలో, 'బ్రహ్మాండం', అనేమాటను, 'అతిపెద్దదిగ (జైగాంటిక్) అనే, విశేషణ పదంగానే తప్ప, దానిని, నామవాచకంగ భావించరాదు. సృష్టికర్తను, 'ది సుప్రీం' అనే అర్ధంలో, పరబ్రహ్మను గ్రహించాలి. అయితే, యిదంతా, సృష్టికే పరిమితం (ఫినిట్)గాని, అనంత విశ్వానికి, అన్వయం కాదు. ఈ విషయంలో, 'ప్యూర్ ఎనర్జీ'కి, క్రియేటివ్ ఎనర్జీకీ మధ్యగల, భేదాన్ని గ్రహించాలి.... అలాగే, అనంత విశ్వానికి, ఆకార బాహ్యతగల సృష్టికి మధ్యగల, తారతమ్యతను, అవగాహన చేసుకోవలసి వుంది. అదే తీరుగ, ఆకారదృశ్యత, నిరాకార అదృశ్యత; అశాశ్వత – శాశ్వత; ఆకారబాహ్యత – దాని పదార్ధ నిక్షిప్తత…., అలాగే, నిరాకార వ్యాప్తత – విశ్వ అనంతత (ఇన్‌ఫినిట్యుడ్‌నెస్)…......., ఇలా, ఆయా మాటల మధ్యగల, తత్సంబంధ గుణ – తత్వ విశ్లేషణ; వాటి నిజం – వాస్తవం – సత్యం..., వీటిమధ్యగల, అర్ధ – భావ, భేదాన్ని గ్రహించే ప్రయత్నం చేయాలి. అదే పద్ధతిలో, అండం – పిండం – బ్రహ్మాండం – యీ క్రమంలో గల, జీవపరిణామం, ఇందుకు సంబంధించి, సంఘటనా నిజం – కారణవాస్తవం; సృష్టి పదార్ధ చలన విధానం, దానిలోని శక్తితత్వం, చేతన; విశ్వశక్తిలోని, సత్యనిత్యత, దాని చేతన 'ఆత్మ'తత్వం......., యిలా క్రమాన్ని అనుసరించాలి.. పరిశీలన, దాని విశ్లేషణ, వాస్తవిక అన్వేషణకు, వుపయోగం....... పాక్షిక అవగాహన, పదార్ధ', ఆకార పరిమితిలోనే వుంటుంది; కనుక, విశాల దృక్పథంతో, విషయజ్ఞాన విశ్లేషణతో, తత్వసత్యత, దాని శాశ్వత పరమజ్ఞానాన్ని (The Absolute wisdom) దాని, ఆత్మానందానుభూతిని, 'జీవాత్మ – ఆత్మ',(The Self of Soul)కు చేర్చాలి....
🕉🌞🌎🌙🌟🚩
? లేక జడం తరువాత, జీవి దగ్గర నుండి మొదలై వుంటుందా అనేవి ముఖ్యమైన విషయాలు. ఎక్కడో ఒక చోట, ఏదో రీతిలో ప్రారంభమైన పరిణామం గురించి, ఆ తరువాత దాని స్వరూప స్వభావాలను గురించి పరిశోధించి తెలుసుకోవడం ఒక్కటే చాలదు. పరిణామానికి మూల కారణం, స్థానం, సమయం గుర్తించిన తరువాతనే దాని గమనాన్ని గురించి విశ్లేషించవచ్చును.
పదార్ధం వుంది అనుకుని పరిణామం గురించి వర్ణించడం, విశ్లేషించడం ప్రారంభించడమంటె, దేవుడు ఉన్నాడనుకుని ఆ తరువాత సృష్టిని గురించి, ఆ దేవుడి లీలను గురించి చెప్పుకోడానికంటె చెప్పుకోదగినంత మార్పు, హేతువాదం కన్పించదు. ఈ రెండింటిలోనూ కుడి ఎడమ భావన తప్ప రెండు చేతులూ ఒకే శరీరానికి కలిసివున్నట్లు వుంటుంది. కనుక పదార్ధం దాని సృష్టిని గురించి వివరంగా, వాదనకు, వివాదానికి తావులేకుండా చెప్పవలసిన బాధ్యత విజ్ఞాన శాస్త్రం పైన వుంది. అలా కాకపోతే దేవుడే మెరుగనిపిస్తాడు. కేవలం జీవ పరిణామాన్ని గురించే కాకుండా, అంతకుముందు దైవ పదార్ధ పరిణామం గురించి, ఈ రెండింటికి వున్న సంబంధం, సమన్వయతల గురించి పరిశోధించి ఋజువు చేస్తే, శాస్త్రజ్ఞానం సంపూర్ణత చెంది, దేవుడు శాశ్వతంగా మాసిపోతాడు.
పరమాత్మ – సృష్టి
స్థూలం – సూక్ష్మం, ఈ రెండింటికీ, అవినాభావ సంబంధం వుంటుంది; వుండాలి మరి! వీటిలో, యేది దేనికి మూలం లేదా ప్రారంభం అనేది కూడా ఆలోచన అవసరమే! ఒకదాని పూర్వస్థితి స్థూలం అయితేనే, దరిమిలా అది సూక్ష్మంగా పరిణామం చెందే అవకాశం వుందనుకుంటే..., ఆ మొదటి యేర్పాటుకు గల హేతువు లేదా కారణ కార్య సంబంధం ఏమిటి? ఒకవేళ, మూలకాల (ఎలిమెంట్స్) సూక్ష్మతా సమీకరణే పదార్ధ స్థూలతకు ఆధారమనుకుంటే, వాటి నిర్మాణం లేదా ఉనికి..., తత్పూర్వపు స్థూల స్థితి ఏదో రూపంలో కారణం కావాలి గదా! అదే 'డార్క్ మేటర్' అని సమాధానం చెప్పుకుంటే, ప్రస్తుత స్పేస్ మేటర్/విశ్వపదార్ధం, ఆ డార్క్ మేటర్ ఉనికికి తత్పూర్వస్థితికి, ఆధారం లేదా మూలం అంటూ ఏదో ఒకటి అవసరమే గదా! అది ఏదై వుంటుంది? అలాగే, పదార్ధరహిత ఎనర్జీకి స్పేస్ 'ఉనికి' ప్రత్యేకంగా వుంటుందా? పరమాత్మ – సృష్టి వేరునుకుంటే, పరమాత్మ దేవుడు (?) సంకల్ప ఫలితమే సృష్టికార్యం అని అనుకుంటే, ఆ సృష్టికి పూర్వం పరమాత్మ ఉనికి, సృష్టి 'సూక్ష్మ' స్థితి వేరువేరుగా వుండాలి మరి! సృష్టి, తనలోనిదే అయితే, దానిని వేరుగా ప్రత్యేక సందర్భంలో సృష్టించడానికి గల సంకల్ప హేతువేమి? అలాగే, పరమాత్మ అనంతమైతే ఆ పరమాత్మ (దేవుడు)లోని సృష్టి ఉనికి కూడా ఆ పరమాత్మతోటే శ్వాశ్వత అనంతత కలిగియున్నట్లే గదా.............!
తర్కానికి ప్రారంభం వున్నట్లే దానికి తుదికి కూడ ఎక్కడో ఒకచోట 'ఫుల్‌స్టాప్', అవసరం. సెమికోలన్ కాదు. అలాకాక, అవిచ్ఛిన్నంగా అది అలాగే సాగిపోతోంటే..., చివరికది తిరిగి తన ప్రారంభస్థానాన్నే చేరుకోవలసి వుంటుంది. ఆస్థితిలో దానికి సమాధానం, ఆ ప్రారంభ ప్రశ్నతోనే చేరిపోతుంది. ఇదే మానవ మేధస్సుకు గల పరిమితి.
పరమాత్మ తత్వం (పరిపూర్ణ 'ఏకత') దృశ్య – అదృశ్యతలకు అతీతం
రూపరహిత, సర్వవ్యాప్త (నిరాకార – నిర్గుణ) పరమాత్మ, దృశ్య – అదృశ్య; అశాశ్వత – శాశ్వత, మార్పులకు అతీతం. భావనాస్పర్శ, అవగాహనా, అనుభూతితప్ప – ‘ఆత్మదర్శనం’ అనేదానికి, ప్రత్యేక అవకాశంలేదు. ఆత్మానుభూతిలోని, 'ఊహా' రూపం తప్ప, మరో దర్శనం, ఆత్మ తత్వం కాదు. సర్వవ్యాప్త, నిరాకార, నిర్గుణ తత్వానికి, ఆకార దృశ్యత, ఏ తీరు? అది, మనసు మరో అంతర్గత విన్యాసమె సుమా! సర్వవ్యాప్తమంటె, అంతఃబాహ్య 'ఫినిట్' స్థితికి, అతీతం. 'పరమాత్మ ఉన్నదెక్కడ?' అనేదానికి, 'లేనిదెక్కడ?' అనేదే, సంక్షిప్త సమాధానం. భౌతిక ఇంద్రియ నిర్మిత, ప్రభావిత, మనసు, పరమాత్మను, ఎక్కడో, వూహిస్తుంది. నదిలోని నీటిని, పాత్రలోకి, తీసినప్పుడు, ఆ పాత్ర బాహ్యతతో ఆవరింపబడిన, నది నీటికి, పాత్రలోని నీరు భిన్నం కాదు. ఆ పాత్రలోని నీటిని, ఆ పాత్ర పేరుతో పిలిచినా, ఆ నీరు, దానిది కాదు; నదికి చెందినదే! పాత్రలోని నీటిని, నదిలో కలిపినప్పుడు, కలిసినప్పుడు, అది, నది నీరే అవుతుంది. పాత్ర నిమిత్తమాత్రమే! గంగాజలాన్ని దేనిలో భద్రపరిచినా, అది, నది నీరే అవుతుంది. పాత్ర నిమిత్తమాత్రమే! గంగాజలాన్ని దేనిలో భద్రపరచినా, అది, గంగాజలమెగాని, ఆ పాత్రపేర నీరు కాదు. అదే పాత్రలోకి, మరోసారి నీటిని తీసినప్పుడు, అదీ, నది నీరే అయినప్పటికి, మొదటిసారి తీసిన పాత్రలోని నీరు కాదు యిది. అదే విధంగా, నదినీటిని, దానిపేరుతో, వ్యవహరించినా, దాని సాగరసంగమంతో, అది సాగర నీరే సుమా! అంటే, స్థూల సూక్ష్మతలు; దృశ్య – అదృశ్యతలు, అప్పటి ఒక స్థితిలో, వాస్తవాలే అయినా, నిజానికి, ఆ రెండూ కాని, 'ఏకత', మరొకటి వుంటుంది.... శరీరగత, ఆత్మను, పరమాత్మ సూక్ష్మతగ, జీవాత్మగ, అనుకున్నా, అది, సర్వవ్యాప్త పరమాత్మకు, భిన్నమైనదికాదు. అలాగే, ప్రకృతి – పురుష సంబంధం 'ఆత్మ' నిరాకార, నిర్గుణ పరమాత్మలోనిదే! స్థాన ఉనికితో, అది, అప్పటి 'లిమిట్ ఫినిట్’, అయి, ఆకార నామంతో, వ్యవహరించబడుతోంది; దానినే, మనసు గ్రహిస్తోంది. మరి..., మోక్షం పేరుతో, పరమాత్మను, ఎక్కడో, సుదూరాలలో ఊహించాలా? కనుక, ఆత్మ స్థాయికి, ఇంద్ర
ు, పర్వతాలు, సముద్రాలు – వీటికి, అలా అని పేర్లు పెట్టిన మనిషి, వాటికి ముందా, తరువాతా? దేవుడి సంగతీ అంతే! ఉన్న వాటి, వుపయోగ, వినియోగమేగాని, మనిషి, తానుగా, లేనివాటిని కలిగించడం, సాధ్యం కాదు. మనిషి ఉనికికి, ముందేవున్న, ఆ మొదటిది, మనిషిది కాదు.
‘అతి’ ఏదైనా వృధానే – ‘అతి’ వినియోగంలోకి రాదు
‘అతివర్జియేత్’, అనడంలోని, అంతరార్ధం యిదే కావచ్చు. శరీర అవయవాలతో సహా అలాగె ప్రకృతి మనిషి జీవితంతో సహా దీనిని గమనించవలసి వుంది. కనుక దేనిలోనైనా ముఖ్యంగా జీవి, జీవన, జీవిత విధానంలో స్వీకరణ – దాని నిర్వహణ కెపాసిటిని గమనించవలసి వుంది. సాధారణంగ మనిషి జీవితావసరాల కనీస ప్రామాణికతను అనుసరించి స్వీకరణ లిమిట్ వుంటుంది. జాతి సహజత శరీర పరిమాణ లిమిట్ కూడ వుంటుంది. దానిని మించిన దేనితోనైనా సహజ విరుద్ధ ఫలితాలుంటాయి.ఉదాహరణకు శ్వాసతోసహా ఆకలి దాహం, నిద్ర, అలాగే జాతిపరంగ పునరుత్పత్తి పరిమితీ వుంటుంది.నిర్జీవ ఆకార, అంతర్గత లిమిట్, పదార్ధ సృష్టికి వుంటుంది. ఏదైనా కాల, సమయ, వ్యవధి వరకే తన ఉనికిని కలిగివుంటుంది.
అలాగే జీవన స్వీకరణతోపాటు శరీరంలోని అవయవ, కార్యనిర్వహణకూ లిమిట్ తప్పదు. వాటి స్వీకరణ – వినియోగ, విసర్జనకూ పరిమితి వుంటుంది. ఇలా శరీర, మానసిక జీవిత పరిధి లిమిట్‌లోనే అందుకు సంబంధించినది ఏదైనా జరగవలసి వుంటుంది. ‘సొ ద ఎక్సెస్ నో సక్సెస్’!
సృష్టికి, దేవుడు కాదు, జీవ పరిణామం మూలమని అంగీకరించే ముందు ఆలోచించి సమాధానం పొందాల్సిన కొన్ని ప్రశ్నలు....
జీవ పరిణామం యీ నాటికి యీ స్థితికి చేరడానికి లక్షల సంవత్సరాల కాలం పట్టి వుండవచ్చు. కాదు, కోట్లు సంవత్సరాలన్నా అతిశయోక్తి అవసరం లేదు. అదేవిధంగా ‘స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్’ ప్రకారం జీవులు నశించడం, నిలవడం అవిచ్ఛిన్నంగా జరుగుతూ వుండి వుండవచ్చు. అయితే జీవపరిణామ సూత్రం లేక సిద్ధాంతం యింతటితోనే ఆగిపోదు. దాని బాధ్యత యింతటితో తీరిపోదు. సాధారణంగా ‘పరిణామానికి’ మార్పుకి చాలా భేదం వుంటుంది. ఈ రెండూ ఒకటి కాదనేది స్పష్టం. పరిణామానికి ఒక క్రమమైన పద్ధతి వుంటుంది. నిత్యమూ జరిగేదానికి నికరమైన నియమం వుంటుంది. కనుక జీవ పరిణామ సూత్రానికి కూడ స్పష్టమైన, స్థిరమైన పద్ధతి వుండాలి. అనూహ్యమైన, శక్తివంతమైన, కారణాలతో మధ్య మధ్యలో పరిణామక్రమం విపరీతమైన (తక్కువగా గాని, ఎక్కువగా గాని) మార్పును చెందదు. కనుక, జీవ పరిణామమనేది (జీవకణం ప్రారంభ స్థానంగా గుర్తిస్తే) ఏక కణ జీవి నుండి ప్రారంభమై ఆరోహణ క్రమంలో నానాటికి వృద్ధి చెందుతూ, వ్యాప్తి చెందుతూ అసంఖ్యాక జీవకణ నిర్మాణంతో జీవులు మార్పు చెందుతున్నాయా? లేక వరుస క్రమంతో నిమిత్తం లేకుండా మార్పుకు లోనౌతోందా? శారీరక, మానసిక అభివృద్ధి పరిణామం ఒకదానికొకటి సమాన ప్రాతిపదికపై జరుగుతోందా? లేక యిందులో భిన్నత్వం వుందా? శారీరక పరిణామానికి, బుద్ధి లేక మనస్సు మొదలైన వాటి పరిపక్వత ఒకే పరిణామ సూత్రంపై ఆధారపడి జరుగుతున్నాయా? పరిణామ క్రియలో ఫలాన జీవి, ఫలాన జీవికి ముందు దశ అని అనుకోడానకి వీలైతే, ఆ ఫలానా జీవి జాతిలోని వివిధ రకాలకు, శారీరక మానసిక భిన్నత్వానికి కారణం ఏమై వుంటుంది? ఉదాహరణకు మనిషికి ముందు కోతి దశ అని అనుకుంటె; ఆ కోతులలోను, ఆ తరువాత మనుష్యులలోను (ఒకే కాలంలో వున్న వారితో సహితం) భిన్నత్వం ఎంతో వుంటోంది. కోతికి, మనిషికి కోతిని పోలిన మనిషి శరీరం అతి దృఢంగాను, పెద్దది గాను వున్నట్లు భూగర్భ త్రవ్వకాల ద్వారా లభించిన అవశేషాలు చెబుతున్నాయి. ఒకనాటి రాకాసి బల్లులు ప్రస్తుతం లేవు. ఆ పేరుతో పిలవబడుతున్న యినాటి బల్లులను చూస్తే నమ్మలేకుండా వున్నాం. అలాగే మేమత్ ఏనుగునకు, నేటి ఏనుగు పరిమాణానికి పోలికే కన్పించదు. అదేవిధంగా ప్రాచీన మానవుని శారీరక పరిమాణానికి నేటి మనిషికి పోలికలు కన్పించవు. శరీర నిర్మాణానికి సంబంధించినంత వరకు బలమైన, అతి పెద్దదైన శరీరం నుండి పరిణామం చెందిన శరీరం అంతకంటె చిన్న పరిమాణాన్ని కలిగి వుండడం సహజమేనా? పరిణామక్రమంలో అవరోహణం సంభవిస్తే యిలా జరగవచ్చు. అయితే, బుద్ధికి (జ్ఞానానికి) సంబంధించినంత వరకు ఆనాటికి యీనాటికి, నానాటికి పరిణామ దశలో ఆరోహణం (అభివృద్ధి) విధానం స్పష్టంగా కన్పిస్తోంది. అయితే శరీర పరిణామం, బుద్ధి పరిణామం వేరు వేరు క్రమాలను, కారణాలను కలిగివున్నాయా? ఈ రెండింటికి కూడ (భౌతిక) పదార్ధమే మూల కారణమా? ఆధారమా? ఇంతకూ అసలు పదార్ధ లక్షణం ఏకత్వమా భిన్నత్వమా? (జడమూ జీవమూ అనే విషయాన్ని ప్రస్తుతానికి అలా వుంచినా) ఈ పరిణామ ప్రక్రియలో జీవి పుట్టడం చావడం అనే విషయాలకు సంబంధించిన మూలకారణం మరొకటి వుంది. దీనిని జీవశాస్త్రం పరిశీలిస్తుంది. అయితే జీవ పరిణామం కూడ జీవ శాస్త్ర సంబంధమైనా అందులో భౌతిక, రసాయనిక విషయాలు కూడ ప్రాధాన్యత వహిస్తాయి. కనుక, సృష్టికి దేవుడు కారణం కాదు అని స్పష్టమైనప్పటికీ, జీవ పరిణామం మూలమని అంగీకరించే ముందు ఆలోచించి కొన్ని ప్రశ్నలకు సమాధానం పొందాల్సి వుంటుంది....

Comments
Post a Comment